Saturday, March 7, 2020

మధురం.. ఈ అనుభవం
మధురం.. నీ పరిచయం

మావితోటలోని కొయిలలా..
పండు రేయిలోని వెన్నెలలా..
దట్టమయిన లోయలోని సరస్సులా..
నా మది సొరుగుల్లోని సుగంధం నువ్వా!
ఆ చిన్ని తార లేని నాడు
ఈ అనంతమయిన ఆకాశానికి అస్థిత్వం ఏది?

అహం విడిచిపెట్టి
ఎండమావి తలుపుతట్టి
కుదరదంటే కాదంటూ
వద్దంటే వదలనంటూ
మొండి మహర్షిలా
నీ పట్టునే తపస్సుగా చేసి
నా మది పొడుపు కథ విప్పి
ఆవలున్న అనంత ప్రేమ సాగరాన్ని తాకావు.

సోయగాల గవ్వల సడిలో
వలపుల అలల తడిని
చిరునవ్వుల కేరింతలతో కలిపి
నా మది సముద్ర తీరాన
నీ అనురాగపు తేనె పూసి
అపురూపమైన సంధ్యను ఆవిష్కరించావు.
ప్రేమగా చూసి నన్నొక
అందమైన చిత్రంగా మలిచావు.

మధురం.. ఈ అనుభవం
మధురం.. నీ పరిచయం
మధురమే.. నీ సంగమం
సరిరాదు.. ఏ.. బంధం!

Tuesday, July 30, 2019

శాశ్వతం - మర్మం



దట్టమైన అడవి మునిచీకటి అంగీ ధరించి;
తనను వలపు జల్లుల్లో తడిపిన నీలినింగికేసి
అరమోడ్పు కళ్ళతో, తడిసిన మేనుతో చూస్తోంది.
ఇది ఆశ చిగురించిన అడవి మనసు ఒలకబోసే ఆరాధనా భావం. 

అవునంటూ ఒక కొమ్మ ఊగింది.
తడబాటు తత్తరపాటు లేని ఆ చేష్ఠకి,
పూలు రెమ్మలు గుసగుసలాడి  మురిపెంగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయి
ఈ అలజడికి వాటి మీదుగా జలజలా రాలిన నీటి బిందువులే ఆ కలయిక లోని హర్షాతిరేకానికి సాక్ష్యం.

-----------------------------------------

ఇది శాశ్వతం కాదంటూ ఆకాశం పయనమయ్యే ప్రయత్నం చేస్తూ గర్జిస్తుంది.
ఈ నిమిషం నిజం. ఈ మమేకం తన్మయత్వం నా అస్థిత్వానికి చిహ్నం. ఆ మర్మం నాలో నాతో ఆజన్మాంతం నా సొంతం.

అంటూ అడవి చీకటి ఒడిలో ప్రశాంతంగా నిదురించింది.    

Friday, January 25, 2019

నా మాట నమ్మండి

ఏందుకో యీ యాతనా తపనా మనో వేదనా!
ఇది ఇక ఎప్పటికైనా నన్ను వదిలి పోవునా?!

విధి వికటించి
తలరాత పిచ్చిగీతలా తోచి
కాయం మానల్లే ఎండి
గాయం పుండుగా మారి
గుండె యాంత్రికంగా కొట్టే ప్రతి పోటూ
గునపంలా దిగుతుంది

దిగులో బాధో విచారమో మరి పైత్యమో
ఎదైనాకానీ మందు ఒకటే లాగుంది.
వేలు విడిచిన వివేకం చెప్తుంది.

ఏడ్చినట్టుంది...
మనిషికి మెదడుకి మందు పని చేస్తుందేమో కానీ

ఇది మనసుకి పట్టిన దెయ్యం
పీక కాదు గుండె పట్టుకుంటుంది
ఇది రక్తం తాగదు కానీ
దాని పళ్ళు దిగిన గుండె
మెల్లగా జీవస్చవమై బీటలు వారి
చిట్లి దానంతటదే ముక్కలవుతుంది.

పేదరాసి పెద్దమ్మ కథలో
విక్రమార్కుడి కథల్లో రంగులో
ఖాస్త ఊరట కలిగించొచ్చు
అంతకుమించి లాభం లేదు.
తెరచిన అరచేతులు గాల్లో ఊపుతూ
అంది అన్నీ తెలిసిన ఒకామె

ఇలాంటి క్లిష్ఠ పరిస్థితుల్లో
మూతి బిగించి చేతులు ముడుచుకుని
కుదరదని కూర్చుంటే ఎట్లా...

అయ్యో..! చెప్తుంటే వినరే
దెయ్యం పట్టిందంటే నమ్మరే!!

నా మాట నమ్మండి.
ఆ విషం ఊరంతా పాకేలోగా
విషయం గ్రహించండి
జాడీలో పట్టండి
పొలిమేరలోకి తీసుకుపోయి పూడ్చేయండి.
రోదిస్తూ చెబుతోందో వనిత.

Tuesday, October 17, 2017

నా పలక

ఆజ్ కల్ పావ్ జమీన్ పర్ నహి పడతే మేరే..



అమ్మో నీ ముందే..?!

ఆ చిందులన్నీ నీ వెనకే!



అల్లాంటి క్షణాల్లో ఎన్ని తలపులో పలక మీద రాశుకున్నవి.

నిను చూస్తే ఇలా.. నువ్వొస్తే అలా.. అని.

మరెన్నో జ్ఞాపకాలు. ప్రతి జ్ఞాపకానికో పాట. నువ్వో.. మరి నేనో.

వెన్నెల పరుచుకున్న మేడ మీదో, బాల్కనీ మూల చీకట్లోనో, ఫోన్ బూత్ లోనో, ఖాళీ బస్టాప్ లోనో...

బోలెడన్ని పలకరింపులు ప్రతి పలకరింపుకొక మెలిపెట్టే వీడ్కోలు.

మరపనేదే లేదే! నిమిషాలు, రోజులు కొన్ని సార్లు నెలలు...

మెలిపడిన ముడి విడేది మాత్రం మరసటి పలకరింపుకే.



తుంటరి కాలం. పరాకులో ఉండగా మెల్లగా ఏదో చేస్తుంది ఆ పలక మీద

నాకేం తెలుసు, ఈ పలక ఆ కాలం తో చేరిందని..

ఇప్పుడది మయాబజార్ అని, మాయల పుట్ట అని

ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాక్కూడా తెలీదు. నిజం. ఒట్టు!



ఇప్పుడా పలక ఎక్కడో ఉంది. తనకు తానే ఎదో గీస్తుంది.
చంద్రుని కిరణాలు తాకిన కలువ రేకుల్లా విచ్చుకుంటుంది ఎందుకో మరి..

Saturday, July 29, 2017

మేఘన-వరుణ్-సత్య

సుప్రభాత సమయంలో ఎగిరేప్పుడు పక్షుల్లో ఒక ఉత్తేజం కనిపిస్తుంది. ఈ రోజు నాకోసం ఏం  దాచిందో త్వరగా చూడాలి అన్న ఒక ఆత్రుత కనిపిస్తుంది.

అవే పక్షులు చల్లని సాయంత్రం వేళ గూటికి బయలుదేరినప్పుడు ఎగిరే తీరు వేరుగా ఉంటుంది. మనసులో ఆత్మ సంతృప్తితో ముఖం పై చిరునవ్వుతో నడుస్తున్న ఒక జ్ఞాని లా కనిపిస్తాయి. 


అల్లాంటి ఒక ఆహ్లాదకరమైన సాయంత్రం మమేకమై ఎవరో అజ్ఞాత వ్యక్తి మురళి వాయిస్తుంటే ఆ వేణుగాన స్రవంతి లో తలమునకలౌతూ ఆ గానం వెంటే పరుగుతీసే గోపికల్లాగో లేక ఏవో అర్ధంకాని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ గురువునాశ్రయించే అనుచరుడిలాగో ఆ కొంగల వెంట  సాగిపోతున్నాయి తెల్లని మేఘాలు.

--------------------------------------------------------------------------

"ఎవరైనా ఓక కవి ఈ దౄశ్యాన్ని చూస్తే మంచి కవిత రాస్తాడేమో కదా సత్యా."
"హ్మ్మ్మ్.. ఎవరైనా నా.. వరుణ్ అనే కవి నా?"
"అబ్బా నేనన్న ప్రతి వాక్యాన్నీ వరుణ్ తో ముడెయ్యాలా? బాగా అల్లరెక్కువయ్యింది నీకు" చిరుకోపం ప్రదర్శిస్తూ చాటుగా నవ్వుకుంది మేఘన. 

"లేకపోతే?! నా దగ్గరా నీ దాపరికాలు? వరుణ్ కనపడకపోతే వెతికే నీ కళ్ళు అతను కనపడగానే హాయిగా నవ్వటం నేను గమనించలేదనుకుంటున్నావా? ఇన్నేళ్ళనుంచి నిన్ను చూస్తున్నాను. నీలో ఈ తేడాని నేను ఆ మాత్రం గమనించలేనా? సో, ఇక దాపరికం డాంభికం మాని విషయం చెప్పు మేరీ బుల్ బుల్" అంటూ సత్య మేఘనని చక్కిలిగింతలతో ముంచెత్తేసింది. 

"అబ్బా ఆగవే రాక్షసి. చెప్తా చెప్తా ముందు వదులు" అంటూ సత్య నుంచి విడిపించుకుంది మేఘన.
"యాక్చుయల్లి చెప్పటానికి ఎమీ లేదు." 
"ఓస్! చెప్తావా లేక మళ్ళీ...."
"ఆ ఆ... వద్దు వద్దు. చెప్తా చెప్తా."
"హ్మ్మ్.. అలా రా దారికి. I am all set to listen. పేష్ కియా జాయ్..."
మేఘన ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుని, "వరుణ్ అంటే నాకిష్టం. చిలిపితనం-చాతుర్యం-చమత్కారం-చురుకుతనం..."
"ఓయ్.. నీ చ గుణింతం కాస్త ఆపి విషయం చెప్పు సాగదియ్యకుండా. టెన్షన్ తట్టుకోలెకపోతున్నా ఇక్కడ."

"ప్చ్.. నువ్విలా నాకు అడ్డు కొడితే చెప్పను పో!"
"అలాగా.. ఐతె ఒకె. చెప్పకు. నువ్వే దాచుకో."
"సరే సరే.. కట్ షార్ట్ చేసి చెప్పాలంటే అతనిలో సమయానికి సందర్భానికి తగ్గట్టు వ్యవహరించే అతని స్మార్ట్నెస్. ఎవరినైనా ఆకట్టుకోగలిగే మాట తీరు నాకు బాగా నచ్చుతాయి."

"అతను పాటలు పాడడు. కవితలు రాయడు.  But he is an artist in his own way, a sensible man. At the same time a practical man too. A rare combination. Right? . సో అతనంటే నాకు వల్లమాలిన అభిమానం."

"బాబోయ్. పిచ్చ బాగా ముదిరింది నీకు. మరి నీలో ఈ సరికొత్త డిసార్డర్ యాంగిల్ చూసాడా వరుణ్?"

"లేదు. నేనతనికి ఏమీ చెప్పలేదు. ఈ విషయమై ఎప్పుడూ మాట్లాడలేదు. It's all just professional talk."

"హుహ్.. మేఘనా, ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవటం బెటర్ రా.. నా మాట విని ఆలస్యం చెయ్యకుండా వరుణ్ కి నీ ఫీలింగ్స్ ఎక్ష్ప్రెస్స్ చెయ్"

"ప్ఛ్.. నేనూ అలానే అనుకున్నా సత్యా. కానీ ఏదో భయం. "
"భయమా.. నీకా.. దేనికి?"
"I haven't been lucky ever in any relationship"
"ఓయ్.. నిలో ఆర్ట్ మూవీ హిరోయిన్ ని పక్కనపెట్టు తల్లి కాసేపు. "
"I am not joking సత్య"
"neither am I!!"
"ప్ఛ్.. ఎలా చెప్పను నీకు"
"నాకే చెప్పలేకపొతే ఇంకా వరుణ్ కి ఎలా చెప్తావు? So go on.. speak out. Whats your problem."
"నాది అర్ధం లేని భయం కాదు. కొంచెం సాంతం విను. వరుణ్ ముందు కొంచెం తడబడినా అతను నా గురించి ఏమనుకుంటాడో అని భయం. నన్ను గౌరవం తో చూసే వరుణ్ రేపు విషయం తెలిసి నన్ను అసహ్యించుకుంటే నేను తట్టుకోలేను."

"మేఘనా నీ ప్రాబ్లెం ఏంటో తెలుసా.. అవసరానికి మించిన బరువు మొయ్యటం. వరుణ్ నీ కాలేజ్ క్లాస్మేట్ కాదు. అతనొక మంచి మనిషి. He is a matured guy! So stop thinking that he would judge you. ఇకపోతే నువ్వు అతనేమనుకుంటాడో అన్న ఆలోచన పక్కనపెట్టు. For a minute take him out of this discussion. Let me tell you, about YOU. నీకు మేఘన అన్న పేరు అంటి అంకుల్ ఎలా పెట్టారో నాకు తెలీదు. ఆ పేరు నీకు అలా సెట అయిందో లేక నువ్వు ఆ పేరు ప్రభావం లో బతికేస్తున్నవో నాకు తెలీదు. ఆకాశాన్ని ఆవరించి భూమిని తన నీటితో నిన్పెయ్యగలదు మేఘం. పక్కవాళ్ళ ప్రపంచాన్ని నీలో నింపెసుకుని వాళ్ళ ప్రపంచాన్ని నీ ప్రేమతో నింపెయ్యగలవు నువ్వు."

"సత్యా. ఏమంటున్నావే?"

"హుహ్.. లెట్ మీ ట్రై అగైన్."
"మేఘనా, నువ్వొక అద్భుతం. నీలా ఎవ్వరు ఉండరే. ఎవరైనా నీదగ్గరకొచ్చి ఏదైనా షేర్ చేసుకుంటే. అదేదో నువ్వే అన్నట్టు నీదే అన్నట్టు ఫీల్ అవుతావు. That's a great quality. I haven't seen anyone so compassionate."
"But that's not good for you. You know?!"

"Satya, did I trouble you with my overrated concerns?"

"No. No.. I love you. I love you taking care of me like a baby. That's me. But నీ ప్రేమ సాగరం లో ఎల్లవేళలా ఈదగలిగే శక్తి అందరికి ఉండదు బంగారం. ఆ ప్రవాహం లో కొట్టుకుపోవటం ఇష్టం లేక కొందరు నీకు దూరం కావచ్చు.. Do you see what I mean?"

"I think so. But I am confused".

"Simple. అన్ని సార్లు నువ్వు ఒక composed character లా ఉండక్కర్లేదు. అన్ని సార్లు త్యాగాలు చెయ్యక్కర్లేదు. in fact its good to be selfish. Its ok if you slip or fall. Be yourself. సో అతని గురించి ఆలోచించటం మాని ముందు నీ గురించి ఆలోచించు. నీకేం కావాలో ఆలోచించు. అతనితో నీ భవిష్యత్తు గురించి ఆలోచించు.  నీ ఒవర్ఫ్లోఇంగ్ ప్రేమ సాగరం లో వరుణ్ కొట్టుకుపోకుండా చూసుకో. That's all."

--------------------------------------------------------------------------
వీధి చివర వేణుగోపాల స్వామి గుడిలో సాయంత్రం హారతి మొదలయ్యింది.




Friday, July 28, 2017

తప్పొప్పులు

పరిస్థితుల-ప్రయోజనాల తులాభారంలో తప్పొప్పులు నీడల్లా వాటి రూపురేఖలు మార్చుకుంటున్నాయి.


Monday, January 5, 2015

Here I am......

Every moment I see u coming towards me.... And I wait eagerly with all I have.... Holding all my will n hope in my hands close to my heart, I wait. I dream that u come, kiss me.... Say "I LOVE YOU" n then we live happily ever after..........

When I wake up, I see u come but in no time U come.... hit... n run. Far away..... Away from my sight. To those far away distances..... Carrying away all my dreams to those shores which I have never even dreamt about..... leaving me wet in my salty tears. After a while I build my dreams again and again  waiting for u every day, every moment eagerly with all I have.... Holding all my will n hope in my hands close to my heart, I wait. I dream that u come kiss me.... Say "I LOVE YOU" n then we live happily ever after.......... And so on....the story repeats.

Many friends keep telling me to leave.....  But how can I? To where...? and What will I leave? I will not, I can't.... leave myself!!!!!

I know u will come back... for me. And also I know that u will run away... again!!!

No matter what, I am always here waiting for u, to embrace you every time u come back. After all.... Love is to fall again n again n again for the same you.....
n Here I am... In Love with YOU.