ఆమె కుడి కన్ను అదురుతోంది. "బయటకు వెళ్ళద్దు. కిటికీ తలుపులు వేస్తున్నాను. ఎవరూ తీయద్దు. ఈరోజు బూచోడొస్తాడు, బయటకు వెళ్ళద్దు. నా మాట వినండి. ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే వస్తా." అని చెప్పి ఆమె ఇంటిలో తన లాగే బెదిరిన లేడిపిల్లల్లా హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న ఆడవాళ్ళ గుంపులో చేరింది.
"ఆంటీ ఎప్పుడూ ఇంతే. భయపెట్టేస్తుంది. పద, బయట వరండా లో ఆడుకుందాం." అని పిల్లలు ఇద్దరూ వరండాలో కెళ్ళి కిటికీ ఎక్కి ఆడుకుంటున్నారు.
కిటికీ ఎక్కి కటకటాలలో నిల్చున్న అక్క, "తమ్ముడూ ఈ కిటికీ నా స్పేస్ షిప్ రా.. నేను నీ షిప్ మీద బాంబులు వెస్తున్నా... ఢిషుం!! ఢిషుం!!"
"ఆ.. నా షిప్ పేలిపోయిందే..." అంటూ కిటికీ గ్రిల్ పట్టుకుని నేల మీద వేలాడుతున్నాడు....
ఇది గమనించని ఒకావిడ తలుపు గొళ్ళెం పెట్టేసింది.
ఇంతలో పెద్ద తుఫాను లా, సుడి గాలిలా శబ్దం. భూకంపం వచ్చినట్టు అన్నీ అదురుతున్నాయి. వంట గదిలో చెవులు రిక్కించి వింటున్న ఆమెకు పిల్లల గొంతులు వంట గది కిటికీ పక్కన ఉన్న వరండా లోంచి వినపడ్డాయి. ఒక్క దూకులో ఆమె వరండా వైపు పరుగు తీసింది. అప్పటికే చాలా ఆలశ్యం అయిపోయింది.
ఇసుక తుఫాను - ఎక్కడ్నుంచి వచ్చిందో.... ఉన్నట్టుండి బయట అంతా ఇసుకతో కప్పడిపోయింది. కటకటాల వెనుక పాప..!!! చూసి గుండె ఝల్లు మంది ఆమెకు. ఏం చెయ్యాలో పాలు పోక వెంటనే వెళ్ళి, కటకటాల్లోంచి చేతులు బయట పెట్టి పాప నడుం చుట్టూ, కాళ్ళ చుట్టూ చుట్టేసింది. ఇంకొకామె పాప చేతులు గట్టిగా పట్టుకుంది. ఒకామె పాప తలను తన చేతులతో గట్టిగా పట్టుకుంది. "బాబేడీ?!!!" అన్నారు ఎవరో.. వాడు వేసుకున్న ఎర్ర చొక్కా కిటికీ అద్దం వెనుక కనిపిస్తోంది! విలవిల్లాడిపోయారు ఉన్న వాళ్ళంతా... ఏం చెయ్యలేని పరిస్థితి!!!
కాసేపు అంతా నిశ్శబ్దం. మరు నిముషం, ఉన్నట్టుండి ఏదో అయస్కాంత శక్తి లా లాగేస్తోంది. పాప చుట్టూ వారి చేతులు ఇంకా గట్టిగా బిగుసుకున్నాయి. ఇంట్లో అన్నీ అదురుతున్నాయి. పట్టు సడలిపోతుంది. కళ్ళు మూసి, చేతులు ముడేసి అలాగే నిల్చున్నారు. కాస్త తగ్గింది, కళ్ళు తెరిచి చూసారు. బాబు ఎర్ర బట్టలు దూరంగా ఇసుకలో....
Wednesday, January 27, 2010
Tuesday, January 5, 2010
నాది హామీ.. :)
నాదైన నేను, నాకు తెలిసిన నిన్ను చేరి, నాకు తెలీని నేనై, నాదైన నిన్ను పొందాను. నాకు తెలీని నీవు, నేననుకున్న నా నుండి నాదనుకున్న నిన్ను తీసుకెళ్ళిపోయావు. మిగిలిన నాది కాదనుకున్న నన్ను చూసి నాకు భయం వేసింది. నువ్వనుకున్న నాదైన నిన్నైతే నువ్వు తీసుకుపోయావు కానీ, నాదైన నువ్వు నా దగ్గరింకా మిగిలే ఉంది. నేను కాని నేను నాదైన నిన్ను, నన్ను జాగ్రత్తగానే చూసుకుంటుంది. నాది హామీ.. :)
Subscribe to:
Posts (Atom)