Friday, October 26, 2007

..GOD..

The silent 'ME' in me ,
Who Creates... my best creations,
Who observes.... everything I do,
Who laughs... with me when I am alone,
Who walks.. beside when I wander,
Who listens... silent when I cry,
Who speaks... when I lose words,
Who gives.... all that I need,
is GOD... to me...!

God is within me. Around me...
In all the life I see, I fell, I touch, I sense.
Even in the non-sense... the thoughts, ideas, creations...But!
I realise Him only in the Gaps....??!!
That shows I am never alone.....
Even if I am, She never leaves me...as,
It is 'ME'.......

Saturday, October 20, 2007

ప్రకృతికి ప్రేమ పుడితే....

ప్రకృతి చాలా అందమైనది. అందుకు కారణం తన సహజత్వం అనుకుంటా...

మేఘం కరిగినపుడే వర్షమై కురుస్తుంది.
చెట్లు ఎండుతున్నాయా, నేల బీడువారుతుందా అనేదానితో సంబంధం లేకుండా...
వాగులు పొంగుతున్నాయా, నదులు ముంచెత్తుతున్నాయా అన్నది పట్టించుకోకుండా...
మేఘం కేవలం చల్లని చిరుగాలికే స్పందిస్తుంది. అది దాని స్వభావం. ప్రేమ కాదు!!

ఒకరిని impress చెయ్యటం అంటే ఏమిటో ప్రకృతికి తెలియదు.
ఒకరి కోసం emotional అవ్వదు.
బాహ్య విషయాల వల్ల తనకి feelings కలగవు.
ప్రకృతికి ప్రేమించటం రాదు!!

అయితే ఇన్నాళ్ళూ ప్రకృతి స్వభావానికి స్పందించి పరవశించిన నాలోని కళాకారుడు...
నాకు దాన్ని ప్రేమగా చిత్రించి చూపించాడా...? అది ప్రేమ కాదా...?!!
ఇన్నాళ్ళూ నేను మాయలో ఉన్నానా ? స్వభావాన్ని ప్రేమగా తప్పుగా అర్థం చేసుకున్నానా..?
నేను ప్రకృతిని ప్రేమిస్తున్నానా ? ప్రకృతి నన్ను ప్రేమించట్లేదా ??

ఇలాంటి ప్రకృతిని ఒక మనిషిగా ఊహించుకుంటే..? ఆ మనిషికి ఎవరి మీదైనా ప్రేమ పుడితే..?
ప్రేమించిన వారికోసం సమస్తం, సర్వం విడిచి వచ్చే స్వభావం కలిగిన ప్రేమ,
ప్రకృతి పై ఎలాంటి మార్పులు తెస్తుంది..? అసలు మార్పు తీసుకురాగలదా..?
ప్రతి వారిలో స్పందన కలిగించే ప్రేమ, ప్రకృతి సహజత్వం ముందు ఓడిపోతుందా?

ప్రేమా...? స్వభావమా...??

Sunday, October 14, 2007

మానస సరోవరం...


ప్రకృతి చాలా నిర్మలంగా ఉంది.

పక్షుల్ని తనలో స్వేచ్ఛగా ఎగరనిచ్చే విశాలమయిన నీలి ఆకాశం నిశ్శబ్దంగా ఆ జంటలను చూసి చిరునవ్వులు చిందిస్తోంది. ముట్టుకుంటే మాసిపోతాయేమో అనిపించే పాలనురుగులాంటి మబ్బులు.. అలా అలా గాలితో కలిసి పచార్లు కొడుతున్నాయి. ఆ చెట్లు.. తల్లి,తండ్రి పక్షులు తిరిగి వచ్చేవరకూ... బుల్లి పిట్టలకు ఊయలలూపి వింఝామరలు వీస్తున్నాయి. వీటి చాటున దూరంగా కనిపించే ఆ కొండలు.. ప్రియుని కోసం వేచి చూస్తున్న ప్రియురాలి వలె కనిపిస్తోంది.

ఈ గాలిగాడు మహా తుంటరి! రేపల్లె లో కృష్ణుడు ఒకే సారి అందరి గోపికల దగ్గరా ఉన్నట్టు.... అటు ఆ మబ్బులతో పచార్లు కొడుతూనే.. ఇటు ఈ జలపాతంలో జారే నీటిని ముద్దాడుతున్నాడు. ఆ స్పర్శకి నీటి భామ సిగ్గుతో వంకర్లు తిరుగుతోంది. వీడు అక్కడితో ఆగక... జలపాతంలో జారిన ఆ నీటి భామకు చక్కిలిగింతలు పెడుతున్నాడు. ఆ భామ కేరింతల సవ్వడి చేస్తూ అలలై పారుతోంది/పరుగెత్తుతోంది.

వారి ముచ్చట్లు చూస్తూ మురిసిపోతూ సాగిపోతున్న నన్ను కూడా వీడు వదలలేదు సుమీ...! నా జుట్టు రేపుతూ... నా పైట లాగుతూ... ఒక్క నిమిషం చిన్న పిల్లాడిలా తోచాడు. మరు క్షణం.. విరహంతో వాటేసుకుని కుదిపేసిన ప్రియుడిలా... ఏమో ఈ కృష్ణ మాయ.....!

ఇలా నేస్తాలతో కలిసి.."ముద్దుగారే యశోద..ముంగిట ముత్యమూ..వీడు..." అంటూ చిందెయ్యాలనిపించింది. ఆగక ఒక చిందేసాను. నవ్వుకున్నాము....

ప్రకృతితో ఒకటయి ఆనందించటానికి అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే కదా....!

Sunday, October 7, 2007

ఉద్యోగరిత్యా స్వదేశం వదిలి విదేశం వచ్చాను.
అక్కడ నన్ను ఆప్యాయంగా పలకరించేవారుంటారా...? అన్న సందేహం తో వచ్చాను.

ఐతే...

చీకటి ముంగిలిలో మబ్బుల చాటున దోబూచులాడుతూ ఊసులు చెప్పే చుక్కలు...
తెల్లవారుతూనే నెమ్మదిగా ఊపందుకుని, కనురెప్పల్ని ముద్దాడే రవికిరణాలు...
చీకటితోనే నిద్ర లేచి మంచులో తలార స్నానం చేసి, ముస్తాబయి నిల్చున్నట్టుగా మెరిసే చెట్లు...
తెల్లవారకముందే రాగాలందుకొని, ఎప్పుడెప్పుడా తెల్లవారటం అని ఎదురుచూసినట్టుగా ఎగిరే పిట్టలు...
నేనూ ఉన్నానుగా... అని చెప్తున్నట్టుగా తాకే గాలి...
చిరునవ్వుల సావాసంలో కళ్ళలో కనిపించే మెరుపు...
చిన్న పిల్లల అమాయకపు చూపులు, వారి ఆటలు...
ఇలా మరెన్నో...
ఎంతో అభిమానం చూపుతున్నాయి.
ఆప్యాయతతో దగ్గరకి తీసుకుంటున్నాయి.

మనం పసిగట్టాలే కానీ, తన పర భేదం లేకుండా...ఇలా స్వచ్చమైన ప్రేమను పంచే వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు.
నెను విస్మరించిన ఆ విషయాన్ని, ఈ విదేశీ ప్రయాణం నాకు మరొక్క సారి గుర్తుచేసింది.

Universal Love అంటే ఇదేనేమో..?