Sunday, October 7, 2007

ఉద్యోగరిత్యా స్వదేశం వదిలి విదేశం వచ్చాను.
అక్కడ నన్ను ఆప్యాయంగా పలకరించేవారుంటారా...? అన్న సందేహం తో వచ్చాను.

ఐతే...

చీకటి ముంగిలిలో మబ్బుల చాటున దోబూచులాడుతూ ఊసులు చెప్పే చుక్కలు...
తెల్లవారుతూనే నెమ్మదిగా ఊపందుకుని, కనురెప్పల్ని ముద్దాడే రవికిరణాలు...
చీకటితోనే నిద్ర లేచి మంచులో తలార స్నానం చేసి, ముస్తాబయి నిల్చున్నట్టుగా మెరిసే చెట్లు...
తెల్లవారకముందే రాగాలందుకొని, ఎప్పుడెప్పుడా తెల్లవారటం అని ఎదురుచూసినట్టుగా ఎగిరే పిట్టలు...
నేనూ ఉన్నానుగా... అని చెప్తున్నట్టుగా తాకే గాలి...
చిరునవ్వుల సావాసంలో కళ్ళలో కనిపించే మెరుపు...
చిన్న పిల్లల అమాయకపు చూపులు, వారి ఆటలు...
ఇలా మరెన్నో...
ఎంతో అభిమానం చూపుతున్నాయి.
ఆప్యాయతతో దగ్గరకి తీసుకుంటున్నాయి.

మనం పసిగట్టాలే కానీ, తన పర భేదం లేకుండా...ఇలా స్వచ్చమైన ప్రేమను పంచే వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు.
నెను విస్మరించిన ఆ విషయాన్ని, ఈ విదేశీ ప్రయాణం నాకు మరొక్క సారి గుర్తుచేసింది.

Universal Love అంటే ఇదేనేమో..?

No comments: