Friday, December 28, 2007


తూర్పున ఉదయిస్తున్న సూర్యుడు, పట్టుదలతో రగులుతున్న శ్రామికుడిలాగా...
మంచు తెరల ను, చెట్ట్ల ఆకుల ను ఛేదించుకుంటు నేల చేరుతున్న కిరణాలు,
అడ్డంకులను అధిగమిస్తూ, గమ్యం వైపు ఆతడు చేసే అలుపెరగని,ఆశావహ ప్రయాణం లాగా...
ఆ స్పర్శకు చలించి, చైతన్యం పొందిన ప్రకృతి, ఆతడిని వరించిన విజయ లక్ష్మి లాగా తోస్తున్నాయి...!

Tuesday, November 13, 2007

...Beauty of Friendship...

I was in a corner, You brought me light...
Everything around seemed so Bright..!
You smiled.. and then hugged me...
I felt it great... I saw myself shine...!
You took me out...taught me dance...
Wow !!! the pleasure is immense...

I felt the air in my hairs...
when we ran effortless and aimless..,
with my hand in yours or otherwise... [I dont remember...]
with our only destination as Happiness !!

It has become my routine now..!
My journey has become joyful and effortless !!
I wish, I see you there everytime I reach...!
For, I wish you Happiness always...

Now... can I call you my friend ?!

Life became simple in your friendship !
Smile has become common in your company !!

If I ever owe anything at all to God.. it is you..
For, you cost me, my life.. my dear FRIEND..!

I dedicate this to all my dear friends...

Love, Smiles and Hugs... :)

Friday, October 26, 2007

..GOD..

The silent 'ME' in me ,
Who Creates... my best creations,
Who observes.... everything I do,
Who laughs... with me when I am alone,
Who walks.. beside when I wander,
Who listens... silent when I cry,
Who speaks... when I lose words,
Who gives.... all that I need,
is GOD... to me...!

God is within me. Around me...
In all the life I see, I fell, I touch, I sense.
Even in the non-sense... the thoughts, ideas, creations...But!
I realise Him only in the Gaps....??!!
That shows I am never alone.....
Even if I am, She never leaves me...as,
It is 'ME'.......

Saturday, October 20, 2007

ప్రకృతికి ప్రేమ పుడితే....

ప్రకృతి చాలా అందమైనది. అందుకు కారణం తన సహజత్వం అనుకుంటా...

మేఘం కరిగినపుడే వర్షమై కురుస్తుంది.
చెట్లు ఎండుతున్నాయా, నేల బీడువారుతుందా అనేదానితో సంబంధం లేకుండా...
వాగులు పొంగుతున్నాయా, నదులు ముంచెత్తుతున్నాయా అన్నది పట్టించుకోకుండా...
మేఘం కేవలం చల్లని చిరుగాలికే స్పందిస్తుంది. అది దాని స్వభావం. ప్రేమ కాదు!!

ఒకరిని impress చెయ్యటం అంటే ఏమిటో ప్రకృతికి తెలియదు.
ఒకరి కోసం emotional అవ్వదు.
బాహ్య విషయాల వల్ల తనకి feelings కలగవు.
ప్రకృతికి ప్రేమించటం రాదు!!

అయితే ఇన్నాళ్ళూ ప్రకృతి స్వభావానికి స్పందించి పరవశించిన నాలోని కళాకారుడు...
నాకు దాన్ని ప్రేమగా చిత్రించి చూపించాడా...? అది ప్రేమ కాదా...?!!
ఇన్నాళ్ళూ నేను మాయలో ఉన్నానా ? స్వభావాన్ని ప్రేమగా తప్పుగా అర్థం చేసుకున్నానా..?
నేను ప్రకృతిని ప్రేమిస్తున్నానా ? ప్రకృతి నన్ను ప్రేమించట్లేదా ??

ఇలాంటి ప్రకృతిని ఒక మనిషిగా ఊహించుకుంటే..? ఆ మనిషికి ఎవరి మీదైనా ప్రేమ పుడితే..?
ప్రేమించిన వారికోసం సమస్తం, సర్వం విడిచి వచ్చే స్వభావం కలిగిన ప్రేమ,
ప్రకృతి పై ఎలాంటి మార్పులు తెస్తుంది..? అసలు మార్పు తీసుకురాగలదా..?
ప్రతి వారిలో స్పందన కలిగించే ప్రేమ, ప్రకృతి సహజత్వం ముందు ఓడిపోతుందా?

ప్రేమా...? స్వభావమా...??

Sunday, October 14, 2007

మానస సరోవరం...


ప్రకృతి చాలా నిర్మలంగా ఉంది.

పక్షుల్ని తనలో స్వేచ్ఛగా ఎగరనిచ్చే విశాలమయిన నీలి ఆకాశం నిశ్శబ్దంగా ఆ జంటలను చూసి చిరునవ్వులు చిందిస్తోంది. ముట్టుకుంటే మాసిపోతాయేమో అనిపించే పాలనురుగులాంటి మబ్బులు.. అలా అలా గాలితో కలిసి పచార్లు కొడుతున్నాయి. ఆ చెట్లు.. తల్లి,తండ్రి పక్షులు తిరిగి వచ్చేవరకూ... బుల్లి పిట్టలకు ఊయలలూపి వింఝామరలు వీస్తున్నాయి. వీటి చాటున దూరంగా కనిపించే ఆ కొండలు.. ప్రియుని కోసం వేచి చూస్తున్న ప్రియురాలి వలె కనిపిస్తోంది.

ఈ గాలిగాడు మహా తుంటరి! రేపల్లె లో కృష్ణుడు ఒకే సారి అందరి గోపికల దగ్గరా ఉన్నట్టు.... అటు ఆ మబ్బులతో పచార్లు కొడుతూనే.. ఇటు ఈ జలపాతంలో జారే నీటిని ముద్దాడుతున్నాడు. ఆ స్పర్శకి నీటి భామ సిగ్గుతో వంకర్లు తిరుగుతోంది. వీడు అక్కడితో ఆగక... జలపాతంలో జారిన ఆ నీటి భామకు చక్కిలిగింతలు పెడుతున్నాడు. ఆ భామ కేరింతల సవ్వడి చేస్తూ అలలై పారుతోంది/పరుగెత్తుతోంది.

వారి ముచ్చట్లు చూస్తూ మురిసిపోతూ సాగిపోతున్న నన్ను కూడా వీడు వదలలేదు సుమీ...! నా జుట్టు రేపుతూ... నా పైట లాగుతూ... ఒక్క నిమిషం చిన్న పిల్లాడిలా తోచాడు. మరు క్షణం.. విరహంతో వాటేసుకుని కుదిపేసిన ప్రియుడిలా... ఏమో ఈ కృష్ణ మాయ.....!

ఇలా నేస్తాలతో కలిసి.."ముద్దుగారే యశోద..ముంగిట ముత్యమూ..వీడు..." అంటూ చిందెయ్యాలనిపించింది. ఆగక ఒక చిందేసాను. నవ్వుకున్నాము....

ప్రకృతితో ఒకటయి ఆనందించటానికి అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే కదా....!

Sunday, October 7, 2007

ఉద్యోగరిత్యా స్వదేశం వదిలి విదేశం వచ్చాను.
అక్కడ నన్ను ఆప్యాయంగా పలకరించేవారుంటారా...? అన్న సందేహం తో వచ్చాను.

ఐతే...

చీకటి ముంగిలిలో మబ్బుల చాటున దోబూచులాడుతూ ఊసులు చెప్పే చుక్కలు...
తెల్లవారుతూనే నెమ్మదిగా ఊపందుకుని, కనురెప్పల్ని ముద్దాడే రవికిరణాలు...
చీకటితోనే నిద్ర లేచి మంచులో తలార స్నానం చేసి, ముస్తాబయి నిల్చున్నట్టుగా మెరిసే చెట్లు...
తెల్లవారకముందే రాగాలందుకొని, ఎప్పుడెప్పుడా తెల్లవారటం అని ఎదురుచూసినట్టుగా ఎగిరే పిట్టలు...
నేనూ ఉన్నానుగా... అని చెప్తున్నట్టుగా తాకే గాలి...
చిరునవ్వుల సావాసంలో కళ్ళలో కనిపించే మెరుపు...
చిన్న పిల్లల అమాయకపు చూపులు, వారి ఆటలు...
ఇలా మరెన్నో...
ఎంతో అభిమానం చూపుతున్నాయి.
ఆప్యాయతతో దగ్గరకి తీసుకుంటున్నాయి.

మనం పసిగట్టాలే కానీ, తన పర భేదం లేకుండా...ఇలా స్వచ్చమైన ప్రేమను పంచే వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు.
నెను విస్మరించిన ఆ విషయాన్ని, ఈ విదేశీ ప్రయాణం నాకు మరొక్క సారి గుర్తుచేసింది.

Universal Love అంటే ఇదేనేమో..?

Sunday, September 16, 2007

...Colourful...

Life is like a colour.
It has got its own shades...!
When touched by other colours,
It no more remains the original...
But Huh...! it gives out pretty new shades...!
Each of them is UNIQUE and BEAUTIFUL...!

Friday, August 31, 2007

...విప్లవం...


చురుకుగా కదిలే ఆ తెల్లని మేఘాలు...
శాంతి కోసం చేసే ఉద్యమం తాలూకు క్రాంతికారుల్లా ఉన్నాయే...!
ఏమిటా వేగం...? ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైతన్యం...?
ఉద్యమ స్ఫూర్తితో, సమావేశానికి హాజరయ్యే హడావుడిలో ఉన్నాయా...?

ఆ వేగం, ఆ చైతన్యం మనలో కరువయ్యాయే...!
ఆ స్ఫూర్తి, ఆ ఐకమత్యం మనలో లేకపోయాయే...!
ఎదుగుదల ముసుగులో సమాజం గుడ్డిదవుతోందా...??
సంస్కారం పేరు చెప్పి మానవత్వం కోల్పోతున్నామా...??

కానీ అప్పుడప్పుడు జరిగే చిన్ని చిన్ని సంఘటనలు...
వేసవి లో సాయంకాలం వీచే పిల్ల గాలుల్లా కొంత ఊరటనిస్తాయి.
దారితప్పిన నావికులకు కనిపించిన చిటారు కొమ్మల వలె ఆశలు నింపుతాయి.
ఆ మేఘాలలో ఉన్నటువంటి చైతన్యం మనలో ఎప్పుడు వస్తుందో...!!

Thursday, August 30, 2007

ఎక్కడున్నాడు..?


రేపల్లే లో కృష్ణుడు పిల్లలతో అడుకునేవాడట...
గోపికలందరితో కలిసి పాడేవాడట...
తన వేణు గానం తో అక్కడి అందరినీ ముగ్ధుల్ని చేసేవాడట...
అక్కడి చెట్లు, పూవులు, సమస్తమైన ప్రకృతి కూడా ఆ గానానికి పరవశించేవట...

మరీ... రేపల్లెలోనే ఉన్నాడా కృష్ణుడు??
హమ్... అవును నిజమే...
మనసు రేపల్లె అయితే....
అతడక్కడే కదా.. ఉంటాడు..!

Saturday, August 25, 2007

...ప్రేమ...

భాషకి అందనిదది,
బెదిరింపుకు లొంగనిది..!

భావనకి మూలమైనది,
స్పందనకి కారణమైనది..!

కళ్ళలో కనిపిస్తుంది,
నవ్వులో విరబూస్తుంది..!

తెగింపు నిస్తుంది,
త్యాగం నేర్పిస్తుంది..!

విశ్వమంతా వ్యాపించి ఉంది,
అయినా నిత్యం అన్వేషింపబడేది..!

ఏమో అది.....?
’ప్రేమ’ కాక మరేది..?!!

Tuesday, August 7, 2007

..Art of Living..

ఒకానొక రోజు ఒక రద్దీ రోడ్ లో జరిగిన సంఘటన ఇది. టైమ్ ఉదయం సుమారు 10 గంటలు కావస్తోంది...నేను office ముందు రోడ్ cross చెయ్యటానికి wait చేస్తున్నా. ఇంతలో... రోడ్ కి అటు వైపు...
పెద్ద జుట్టు, గడ్డం, మాసిన బట్టలు. ఒక బండి లో చెత్తను పోగెస్తున్నాడతను.
అరే... అతని చేతిలో ఎంటవి? గులాబీలలా ఉన్నాయే..! traffic వలన సరిగ్గా కనిపించటంలేదు. ఆవును గులాబీలే. ఏం చేస్తున్నాడతను వాటితో... అని కుతూహలంతో గమనిస్తున్నాను. అతడు వాటిని తదేకంగా పరిసీలిస్తున్నాడు. ఉన్నట్టుండి, ఆ చెత్త కుప్పలోని ఆ రోజాలకు ఎలా వచ్చింది అంత ఎర్రదనం?

చక్కిలిగిలి పెడుతున్న సఖుడి చేతుల్లో వాలిన చెలి చెక్కిలి వలె సిగ్గుతో ఎర్రబడి ముడుచుకున్నాయేమో అన్నట్టుగా ఉన్నాయి.
భానుడి తాపానికి సొమ్మసిల్లి వాలిన ఆ ఆకులు, సిగ్గుతో వాలిన కన్నె కాటుక కన్నుల వలె ఉన్నవి కదా...!

అతడు వాటితో బండిని అలంకరిస్తున్నాడు. ఆహా.... అద్భుతం...!
ఆ బండి నాలుగు మూలలకు చేరిన ఆ పూవులు reception లోని flower vase లో కంటే అక్కడే అందంగా ఉన్నాయి. అప్పుడే అర్థమయ్యింది అందం గులాబీలలో కాదు, అలంకరించే చేతిలో ఉందని.
అతనిలోని కళాకారుడికి నా పాదాభివందనం...

My dear K-man, you did not bless me with your smile today. The roses were looking very beautiful. You added to their redness with your 'Art'. They are blessed being touched by you. Being aware, you cleansed a place. Unknowingly you have touched my heart and made my day.

ఆ సన్నివేసం గురించి ఇంకా ఎంతో చెప్పాలని, ఎంతో వర్ణించాలని ఉంది నాకు. కానీ మాటలే కరువయ్యయే...

నిన్న సాయంత్రం....

ప్రశాంతమైన వాతావరణం - పశ్చిమాన అస్తమిస్తున్న సూర్యుడు - గూటికి తిరుగు ప్రయాణం అయిన గువ్వలు - వినీలాకాసం లో తిరిగి తిరిగి అలసినట్లుగా మెల్లగా కదులుతున్న మేఘమాల... - మీ సేద నే తీరుస్తానుగా అంటూ చల్లగా వీస్తున్న గాలి...

ఆ గాలికి, నా రాగాన్ని చేర్చి గూటికి తిరుగు ప్రయాణం అయిన గువ్వకి వినిపించమని పంపాను. అంత ప్రశంతమైన వాతావరణం లో కూడా నాకు రైలు కూత వినిపిస్తోందే...!

Monday, August 6, 2007

ఎందుకో..!


పిల్లలు, వాళ్ళ నవ్వులు, కల్మషం లేని వాళ్ళ చూపులు, ముద్దులొలికే వారి చేతలు, వారి అలకలు, బంగారు పలుకులు....
నాకు మళ్ళీ చిన్న పిల్లగా మారిపోవలి అని ఉంది.
స్వేచ్చగా పరిగెట్టడం, మనస్పూర్తిగా నవ్వటం, పిలిచి పిలిచి అమ్మ అలసే వరకూ ఆడుకోవటం, హద్దులు లెకుండా ప్రేమ ను పంచటం వారికే సొంతం.
అటువంటిది వారు ఎదిగే కొద్దీ వారి నుంచి ఈ లక్షణాలు దూరం అవుతాయి. ఎందుకో..!