Friday, August 31, 2007

...విప్లవం...


చురుకుగా కదిలే ఆ తెల్లని మేఘాలు...
శాంతి కోసం చేసే ఉద్యమం తాలూకు క్రాంతికారుల్లా ఉన్నాయే...!
ఏమిటా వేగం...? ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైతన్యం...?
ఉద్యమ స్ఫూర్తితో, సమావేశానికి హాజరయ్యే హడావుడిలో ఉన్నాయా...?

ఆ వేగం, ఆ చైతన్యం మనలో కరువయ్యాయే...!
ఆ స్ఫూర్తి, ఆ ఐకమత్యం మనలో లేకపోయాయే...!
ఎదుగుదల ముసుగులో సమాజం గుడ్డిదవుతోందా...??
సంస్కారం పేరు చెప్పి మానవత్వం కోల్పోతున్నామా...??

కానీ అప్పుడప్పుడు జరిగే చిన్ని చిన్ని సంఘటనలు...
వేసవి లో సాయంకాలం వీచే పిల్ల గాలుల్లా కొంత ఊరటనిస్తాయి.
దారితప్పిన నావికులకు కనిపించిన చిటారు కొమ్మల వలె ఆశలు నింపుతాయి.
ఆ మేఘాలలో ఉన్నటువంటి చైతన్యం మనలో ఎప్పుడు వస్తుందో...!!

No comments: