Tuesday, October 17, 2017

నా పలక

ఆజ్ కల్ పావ్ జమీన్ పర్ నహి పడతే మేరే..అమ్మో నీ ముందే..?!

ఆ చిందులన్నీ నీ వెనకే!అల్లాంటి క్షణాల్లో ఎన్ని తలపులో పలక మీద రాశుకున్నవి.

నిను చూస్తే ఇలా.. నువ్వొస్తే అలా.. అని.

మరెన్నో జ్ఞాపకాలు. ప్రతి జ్ఞాపకానికో పాట. నువ్వో.. మరి నేనో.

వెన్నెల పరుచుకున్న మేడ మీదో, బాల్కనీ మూల చీకట్లోనో, ఫోన్ బూత్ లోనో, ఖాళీ బస్టాప్ లోనో...

బోలెడన్ని పలకరింపులు ప్రతి పలకరింపుకొక మెలిపెట్టే వీడ్కోలు.

మరపనేదే లేదే! నిమిషాలు, రోజులు కొన్ని సార్లు నెలలు...

మెలిపడిన ముడి విడేది మాత్రం మరసటి పలకరింపుకే.తుంటరి కాలం. పరాకులో ఉండగా మెల్లగా ఏదో చేస్తుంది ఆ పలక మీద

నాకేం తెలుసు, ఈ పలక ఆ కాలం తో చేరిందని..

ఇప్పుడది మయాబజార్ అని, మాయల పుట్ట అని

ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాక్కూడా తెలీదు. నిజం. ఒట్టు!ఇప్పుడా పలక ఎక్కడో ఉంది. తనకు తానే ఎదో గీస్తుంది.
చంద్రుని కిరణాలు తాకిన కలువ రేకుల్లా విచ్చుకుంటుంది ఎందుకో మరి..

Friday, July 28, 2017

తప్పొప్పులు

పరిస్థితుల-ప్రయోజనాల తులాభారంలో తప్పొప్పులు నీడల్లా వాటి రూపురేఖలు మార్చుకుంటున్నాయి.


Monday, January 5, 2015

Here I am......

Every moment I see u coming towards me.... And I wait eagerly with all I have.... Holding all my will n hope in my hands close to my heart, I wait. I dream that u come, kiss me.... Say "I LOVE YOU" n then we live happily ever after..........

When I wake up, I see u come but in no time U come.... hit... n run. Far away..... Away from my sight. To those far away distances..... Carrying away all my dreams to those shores which I have never even dreamt about..... leaving me wet in my salty tears. After a while I build my dreams again and again  waiting for u every day, every moment eagerly with all I have.... Holding all my will n hope in my hands close to my heart, I wait. I dream that u come kiss me.... Say "I LOVE YOU" n then we live happily ever after.......... And so on....the story repeats.

Many friends keep telling me to leave.....  But how can I? To where...? and What will I leave? I will not, I can't.... leave myself!!!!!

I know u will come back... for me. And also I know that u will run away... again!!!

No matter what, I am always here waiting for u, to embrace you every time u come back. After all.... Love is to fall again n again n again for the same you.....
n Here I am... In Love with YOU.

Tuesday, December 9, 2014

I, Walk Away.

I, walk away.
And all you feel is I left you behind, cheated on you, moved on and I don't Love You any more!!

But Darling, the Truth is...

All my Love for you is right here in me, drowning me from within, suffocating, choking and pulling me far far away from you.

The same force which once brought us together, is now pulling and dragging my Love to a very distant High Lands. The prophecy tells that my Love eventually will be shattered by the grief of our separation and buried alive there, in those High Lands, deep under the rocks of your Mistrust and Disbelief.

Now, I accept this harsh journey and walk away... with all my Faith to meet you again one day, my love, when your Love rises so high... enough to reach those High Lands, blooms beautifully and burns the barriers down in its Fire and Warmth.

Then... my dear, through the ashes of the burnt, will "my Love" come back to life  in your arms, taking the fragrance of your Love as its first breath. I promise.
Until then...... I, Walk Away.

Monday, August 25, 2014

సంద్రం
రావద్దని తోస్తున్నా....

ముంచేస్తా అని భయపెడుతున్నా....

ముందుకెళ్తే ప్రమాదం అని తెలిసినా....


దొరికినంతలా కావలించుకుంటూ ముందుకే వెళ్తున్నా...

ఎందుకో.....!!

Tuesday, March 18, 2014

పరిమళంగంధపుచెక్కను అరగదీస్తే చందనం వచ్చినట్టు....
    నా మనసును అరగదీస్తుంటే ప్రేమను పంచుతుంది.
- ఓ పూవు

Wednesday, December 12, 2012

రెక్కల పురుగు...

రెక్కల పురుగు...
ఏమిటో దానిలో అంత అశాంతి?
ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు
కొవ్వొత్తొకటి వెలిగించగానే దాని చుట్టూ గిరికీలుకొడుతుంది గాల్లో.
మంటలో పడి కాలిపోతుందేమో అని ఎన్ని సార్లు పక్కకి నెట్టినా మళ్ళా అక్కడికే వస్తుంది.
ఆ మంట చుట్టూనే తిరుగుతుంది.
ఏమిటో దానికి అంత ఆకర్షణ ఆ మంటపైన, 'ఈ క్షణం కోసమే ఇంతకాలం ఎదురుచూస్తుందా?' అన్నట్టు
అలా తిరిగి తిరిగి ఆఖరికి ఆ మంటలో పడి కాలి తగలబడిపోయింది. చచ్చిపోయింది.

హ్మ్....
భౌతికంగా కుర్చీలో కదలకుండా కూర్చున్నా కానీ
నా మనసు మాత్రం ఏదో తెలియని ప్రశాంతత తీరాలను చేరాలని ఆకాంక్షిస్తూ, తనలో
రేగుతున్న అలజడి కెరటాలకు ఇకనైనా స్వస్తి పలికే క్షణం కోసం నిరంతరం నిరీక్షిస్తూనే ఉంది.
తనలోని అశాంతికి కారణమైన అజ్ఞానాన్ని కాల్చి తగలబెట్టే వెలుగు కోసం నిత్యం వేచిచూస్తుంది !!
నాకు తెలియకుండానే, ఆ రెక్కల పురుగులా.