Tuesday, August 7, 2007

..Art of Living..

ఒకానొక రోజు ఒక రద్దీ రోడ్ లో జరిగిన సంఘటన ఇది. టైమ్ ఉదయం సుమారు 10 గంటలు కావస్తోంది...నేను office ముందు రోడ్ cross చెయ్యటానికి wait చేస్తున్నా. ఇంతలో... రోడ్ కి అటు వైపు...
పెద్ద జుట్టు, గడ్డం, మాసిన బట్టలు. ఒక బండి లో చెత్తను పోగెస్తున్నాడతను.
అరే... అతని చేతిలో ఎంటవి? గులాబీలలా ఉన్నాయే..! traffic వలన సరిగ్గా కనిపించటంలేదు. ఆవును గులాబీలే. ఏం చేస్తున్నాడతను వాటితో... అని కుతూహలంతో గమనిస్తున్నాను. అతడు వాటిని తదేకంగా పరిసీలిస్తున్నాడు. ఉన్నట్టుండి, ఆ చెత్త కుప్పలోని ఆ రోజాలకు ఎలా వచ్చింది అంత ఎర్రదనం?

చక్కిలిగిలి పెడుతున్న సఖుడి చేతుల్లో వాలిన చెలి చెక్కిలి వలె సిగ్గుతో ఎర్రబడి ముడుచుకున్నాయేమో అన్నట్టుగా ఉన్నాయి.
భానుడి తాపానికి సొమ్మసిల్లి వాలిన ఆ ఆకులు, సిగ్గుతో వాలిన కన్నె కాటుక కన్నుల వలె ఉన్నవి కదా...!

అతడు వాటితో బండిని అలంకరిస్తున్నాడు. ఆహా.... అద్భుతం...!
ఆ బండి నాలుగు మూలలకు చేరిన ఆ పూవులు reception లోని flower vase లో కంటే అక్కడే అందంగా ఉన్నాయి. అప్పుడే అర్థమయ్యింది అందం గులాబీలలో కాదు, అలంకరించే చేతిలో ఉందని.
అతనిలోని కళాకారుడికి నా పాదాభివందనం...

My dear K-man, you did not bless me with your smile today. The roses were looking very beautiful. You added to their redness with your 'Art'. They are blessed being touched by you. Being aware, you cleansed a place. Unknowingly you have touched my heart and made my day.

ఆ సన్నివేసం గురించి ఇంకా ఎంతో చెప్పాలని, ఎంతో వర్ణించాలని ఉంది నాకు. కానీ మాటలే కరువయ్యయే...

1 comment:

Raniiii said...
This comment has been removed by the author.