నేను కర్మ బద్ధుడను. నాకు నిన్ను అక్కున చేర్చుకునే హక్కు లేదు." చావు ప్రేమ ఎదుట నిలబడి నిస్సహాయ స్వరం తో సన్నగా చెప్పింది.
"ఎందుకు??" నిలదీసింది ప్రేమ.
తనని నిలదీసిన ప్రేమ కళ్ళలోకి సూటిగా చూడలేక తల దించుకుని దోషిలా నిలబడి దేవ రహస్యాన్ని బయటపెట్టింది చావు. "నీవు విధాత చెక్కిన శిల్పానివి కావు. అందువల్ల నీకు చావు లేదు."
"మరి నేనెవరిని??" నీటి తేర కంమేస్తున్న కళ్ళతో, వణుకుతున్న స్వరంతో జాలిగుప్పే మోముతో హృదయ విదారకంగా అడిగింది ప్రేమ.
"క్షమించాలి. నా దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు." అని చెప్పి చావు మాయమయ్యింది.
గుండె రగులుతూండగా "నాకు మోక్షం దొరికే వరకూ ఈ సృష్టి కొనసాగు గాక. చావుకు విశ్రాంతి నశించు గాక!" అని తలచి...........
మానస పుత్రిక అయిన ప్రేమ అప్పట్నుంచి దిక్కు తోచక తెగిన గాలిపటంలా తన ఉనికి ఏమిటో, తన పుట్టుకకు కారణం ఏమిటో తెలుసుకోవాలని లోకం లో ప్రతి ఒక్కరినీ అశ్రయిస్తూనే ఉంది. తను ప్రాణంతో ఉందో లేదో కూడా గ్రహించలేని ప్రేమ, బ్రతికున్న పిశాచమై మనుషులను ఆవరించి వేధిస్తూనే ఉంది. విధికి ఎప్పటికప్పుడు తనని తానూ అర్పించుకుంటూనే ఉంది, ఏదో ఒక రోజు తనకు మోక్షం దొరుకుతుందన్న ఆశతో..... జాలికి లొంగని విధి, ప్రేమకు తన వెన్ను చూపి తన దారిన తాను పోతూనే ఉంది. నిరాశకు లొంగని ప్రేమ పట్టు వదలని విక్రమార్కుడు పూనిన బెతాళుడిలా వేరొక మనసు కొమ్మకు తనని తాను ఉరేసుకుంటూనే ఉంది.
Saturday, July 16, 2011
Wednesday, July 13, 2011
పున్నమొచ్చి పోయింది.
పున్నమొచ్చి పోయింది.
చీకటితో అనుబంధం స్పృహలోకి రావాలంటే పున్నమొచ్చి పోవాలా?
ఆకాశం ఎంత గాఢంగా కౌగిలించుకున్నా, ఆ భిక్ష వెన్నల వెలుగులదే కదా....
వెన్నెల చేసిన గాయాన్ని చీకటి మరింత లోతుగా గుచ్చింది. గుర్తుచేసింది.
గాఢాలింగనంతో స్తంభించిన రెండు మనసుల గుండెలయ భీకరమైన నిశ్శబ్దమై ప్రళయ తాండవం చేస్తుంది.
మళ్ళీ ఏ పున్నమో రావాలి. తన సోయగం తో వీరిని ఏమార్చి చల్లగా విడదీసి కాపాడాలి.
వెన్నెల కురిపించి విరహం రాజేసి కొత్త సంగీతాలకు ప్రాణం పోసి నిలబెట్టి పుణ్యం కట్టుకోవాలి.

Subscribe to:
Posts (Atom)