వదిలించుకుంటే వదిలెయ్యటానికి దెయ్యమా?? ప్రేమ...
ఆత్మ కదూ?!
దొరికేంత వరకూ వెతుకులాట...
దొరికితే సందిగ్ధం. మౌనం. ధ్యానం.
పొత్తు కుదిరితే కోలాటం.
కుదరకపోతే విరహం. వైరాగ్యం. స్వర్గ ద్వారం.
---------------------------------------------
యశోద తన కృష్ణుడిని రకరకాలుగా అలంకరించి చూసుకుని మురిసిపోయేదట.
రోజుకో రకంగా అలంకరించి చూసుకున్నా తృప్తి కలిగేదికాదుట ఆవిడకి.
ఆవిడ పిచ్చి కానీ ఆ తేజో మూర్తి ముందు ఈ అలంకారాలెంతా?!!
అలానే ప్రేమని వర్ణించటానికి మొత్తం సాహిత్యం సరిపోదు. ఆ విషయం తెలిసినా మనసొప్పుకోదు.
ఎంత చెప్పినా ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. ఎంత విన్నా ఇంకా.... కొంచం అనిపిస్తుంది.
తగదనో... తెగదనో తెలిసినా....నచ్చిన రంగులతో, భావాలతో అలంకరించి,
దగ్గరైన అద్దాల్లో ప్రేమని చూసుకుని మురిసిపోవటం ఒక అద్భుతమయిన అనుభవం. :)
అలాంటి ప్రయత్నాల్లోదే ఈ టపా కూడా ఒకటి.