Tuesday, April 14, 2009

మోసం - నిజం

నాకు నవ్వు రావటం లేదు. రాకుండా నవ్వే నవ్వు ఎంత కృత్రిమంగా ఉంటుందో తెలియదా.. అయినా నవ్వితేనే ఆనందంగా ఉన్నట్టా? నవ్వితే చాలా? ఆనందమో కాదో అన్నది నీకు పట్టదా? ఒక్క రోజు నవ్వుతూ లేకపొతే ఏమైంది అని ఎంతో కంగారు పడుతూ అడుగుతావు. నీ బరువుకి నా జారుడు మొహం కూడా తోడైతే నువ్వు మోయలేవనిపిస్తుంది. ఒక సారి నవ్వుతాను. బాగానే ఉన్నానంటాను. ఇంత దూరం నుంచి నేనిచ్చే ఆ సామాధానం నిజమనుకుని సమాధానపడతావు నువ్వు. ఎంత వెర్రి నేస్తానివి... నిన్ను మోసం చేయటం ఎంత సులువో..! 'నమ్మిన వాళ్ళని మోసం చేస్తావా?' అని నీ ఆ నమ్మకం నన్ను ప్రశ్నిస్తోంది. తనకేం తెలుసు? నేను బాధపడేప్పుడు ఆ బాధ కంటే ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవన్న ఆలొచన నన్నింకా బాధపెడుతుందని, అందుకే ఆ మోసాన్నే నిజం చెయ్యటానికి వచ్చే ఆ అలకి ఆనకట్ట కట్టేస్తున్నానని...

అల లేనినాడు సముద్రపు ఒడ్డు కూడా ఎడారితో సమానమే కదా...

7 comments:

చైతన్య said...

చాలా చాలా బాగుందండి.... very touching!
నాకు కుడా ఇలాంటి అనుభవం ఉంది!

Vamsi Krishna said...

nammani vALLanu mOsam cEyagalaraa??;p

మోహన said...

@చైతన్య
Thank you.

@Vamsi Krishna
నమ్మినవాళ్ళని, నమ్మనివాళ్ళని కూడా మోసం చెయ్యచ్చు ప్రయత్నిస్తే. కానీ నచ్చిన వాళ్ళని మోసం చెయ్యలేం. అందుకే ఆ మోసాన్నే నిజం చెయ్యాలని ప్రయత్నిస్తుంటాం :)

Unknown said...

siri
hiiiiii.chala baga rasaru nijam ga.ila chala sarlu jarugutu vuntundi naku kuda....

శేఖర్ పెద్దగోపు said...

>>>నేను బాధపడేప్పుడు ఆ బాధ కంటే ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవన్న ఆలొచన నన్నింకా బాధపెడుతుందని, అందుకే ఆ మోసాన్నే నిజం చెయ్యటానికి వచ్చే ఆ అలకి ఆనకట్ట కట్టేస్తున్నానని...

ఎంతో మానసిక పరిణితి, అవతలి వ్యక్తి మీద ప్రేమ ఉంటే గాని ఇలాంటి భావోద్వేగాన్ని చూపించటం సాధ్యం కాదేమో....

ఆ వాఖ్యం చాలా నచ్చింది.

సుజ్జి said...

beautiful..!

AumPrakash said...

మోహన గారూ, సున్నితమైన అంశాలను అందంగా రాస్తున్న మీ శైలి నాకు నచ్చింది.