మబ్బు దుప్పటి కప్పిన ఆకాశం నీడలో,
రాత్రి వానలో మురిసిన అడవి....
తడారని మానులు ముదురు వర్ణాలు చిలుకుతుంటే,
నేలంటిపెట్టుకున్న పచ్చిక సరికొత్త అందాలు సంతరించుకుని ముస్తాబవుతుంది.
పెదవంటిన చినుకు రాలునని పూలు మొహమాటపడుతున్నాయి, విరిసేందుకు.
మధ్య మిగిలిన ప్రదేశమంతా గాజు వర్ణపు మైకమేదో తెరలు కట్టి,
వెలుగుతూ వగలుపోతుంది. చిక్కగా పేరుకుని, చక్కగా అల్లుకుపోయింది.
సరిహద్దు రేఖల కింద భూమి పరుచుకున్నట్టు,
శరీరాల చాటున ఈ మైకం ఒకటిగా ప్రవహిస్తుంది.
ఆర్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచపు గుండెల్లో ప్రేమను కురిసి,
ప్రకృతి విశాల ప్రపంచాన్ని తనలో ఐక్యం చేసుకుంది.
1 comment:
"పెదవంటిన చినుకు రాలునని పూలు మొహమాటపడుతున్నాయి, విరిసేందుకు."
"సరిహద్దు రేఖల కింద భూమి పరుచుకున్నట్టు,
శరీరాల చాటున ఈ మైకం ఒకటిగా ప్రవహిస్తుంది."
Wonderful expressions!
Post a Comment