Thursday, March 3, 2011

గుప్పెడు గుండె - చిల్లు కుండ

అరడుగు దూరాన ఉన్న ఆనందాన్ని పట్టుకోడానికి జీవితకాలం సరిపోదు.
'ఉందీ...' అన్నామా, ఎంటనే జారిపోద్ది. గాల్లాంటిదా ఆనందం...?!!
పీల్చుకుని ఉంచేసుకుంటా అంటే కుదరదు.
వదిలెయ్యాల... మళ్ళా దానెనక పరిగెత్తాల.. :)


********
గుప్పెడు గుండెలో పుట్టిన ప్రేమని వర్ణించటానికి మొత్తం సాహిత్యం సరిపోదు.
ఎంత వడిసిపట్టుకుందాం అన్నా లాభం లేదు, గుండె చిల్లు కుండే!!
పోవాల...... మళ్ళా రావాల... :)
ఆగిందా.., బీడువారిన నేల్లాగా పగుళ్ళుపోయి పంట పండదు. రసహీనం!



---------------------------------------------
ఇందుకేనా ధ్యానాన్ని ఊపిరితో ముడెట్టారు???!!!!
నాకింకా ఎవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, బాబోయ్...! :P

2 comments:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

"ఆనందం" అనే జీవిత పరమార్థాన్ని నాలు లైన్లలో చేప్పేశారు!
------
"గుప్పెడు గుండెలో పుట్టిన ప్రేమని వర్ణించటానికి మొత్తం సాహిత్యం సరిపోదు."
నేనూ ఇంతకాలం ఇలానే అనుకుంటూ వచ్చాను.
ఇప్పుడేమైందీ? మీరు ఓ మూడు ముక్కల్లో చెప్పేశారు... "గుండె చిల్లు కుండే!"

Really Excellent!

మురారి said...

చిల్లుకుండ గుండెను నాలుగు వాక్యాలతో భలే ఒడిసిపట్టేసారే!..గొప్పగా రాసారు.