Friday, June 24, 2011

కృష్ణార్పణం!! :)

యాధాలాపం గా మొదలయ్యి, సరదాగా నడిచి, ఎటో తీసుకుపోయి, నన్ను ఆనందంలో వదిలేసిన ఒక సంభాషణ.

ఉద్దేశాలు ఏం లేవ్. సరదాగా అందరితో పంచుకోవటం కోసమే ఇక్కడ.

 ************************************


అతడు: ఒక్క సీతనే maintain చేసిన రాముడి కంటే 16000 మందున్న కృష్ణుడంటే ఎందుకో ఈ అమ్మాయిలకి అంత ఇష్టం!
ఆమె: హహహా. నీకర్ధం కాదు. వదిలెయ్!
 అతడు: చెప్పండి గురువు గారు. నెర్చుకుంటాం.  మీలాంటి గురువులే చెప్పక పొతే ఎవరు చెబుతారు?
 ఆమె: హర హర మహాదేవ!!   ఎవరు... ఎవరు నన్ను పిలిచింది! :P
 అది మర్మం నాయనా...
  ఒక్క సీత తో ఉండి ఆమెలో లోకాలు చూడగలవాడూ దేవుడే....
 అన్ని వేల మంది గోపికలని అలరించి, ఎవరికీ అంతుపట్టని వాడూ దేవుడే...
  ఒక్కో అవతారానికి ఒక్కో purpose ఉంది..
 purpose ని చూసి judge చెస్తున్నాం....
  కానీ దేవుడు అనే వాడు ఈ conditionings కి వీటికీ అంతు చిక్కని వాడు

 అతడు: ఆ..... అదే ఏం చూసి judge చెస్తునారో చెప్పమనే అడుగుతున్నాం
  ఎందుకు ఈ అవతారమే ఇష్టం?

 ఆమె: :)
  నీకు 16000 వెల మంది గోపికలు, 8 మంది భార్యలు కనిపిస్తున్నారు.
  నాకెమో...
 సదా చిరునవ్వులు ఒలికిస్తూ... సత్యం వైపు, పరమానందం వైపు నడిపించగల ఒక మహా గురువు, చిదానంద మూర్తి...
  వైరాగ్యం మీద కూడా మమకారం లేని వైరాగి. మహా యోగి...
 ఉన్నా అన్న భ్రమని లేనన్న నిజాన్ని సరిసామానం గా చూపగల పరమ పురుషుడు కనిపిస్తున్నాడు...
 అదీ మర్మం...
 అతడు: అమ్మో!
ఆమె: ఇంకా ఎంతో ఉంది...
 మాటల్లో ఇరికించి చెప్పే భావాలా ఇవి.......!!!
  నా వల్ల కాదు.

 అతడు: మీ దగ్గర చాలా knowledge ఉందండి.
ఆమె: లెదండి...
  అంతాకృష్ణార్పణం.

 అతడు: మీరు క్కృష్ణుడి విశ్వరూపం pose లో కనపడుతున్నారు నాకిప్పుడు.
 ఆమె: :)))))
  పెద్దదాన్నే కానీ అంత పెద్ద దాన్ని కాదు.
 మీరు చూసేది ఆ పరమ పురుషుడి పేరు లో ఉన్న మహత్యం, ఆ పేరు స్మరణలో ఉన్న తన్మయత్వం అంతే..
  అందుకే ఆ గగుర్పాటు వల్ల అలా అనిపిస్తుంది.
 నేను కోట్ల కోటిలో ఒక్క వంతు కూడా జరగలేదు..
  చెయ్యాల్సిన ప్రయాణం, కరిగించాల్సిన దూరం ఇంకా చాలా ఉంది.


******************************************************
Thanks to the friend, who brought out the best of my thoughts abt Him! :)

4 comments:

Indian Minerva said...

నాకెందుకో కృష్ణుడు ఓ పేధ్ధ radical గా అనిపిస్తాడు. రాముడంతటి figgure "ఇలా వుండండిరా బాబు" అని rules & regulations నిర్ణయించిపోతే. కృష్ణుడు మాత్రం లోకకల్యాణార్ధమనిచెప్పి అన్నింటినీ తిరస్కరిస్తాడు. తనకునచ్చినది చేసుకుంటూ పోతాడు ఒక లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని. పైపెచ్చు తానే దైవమంటాడు. పొరపాటునకూడా కృష్ణుడిలో inferiority గానీ సంశయంగానీ కనపడవు. He is always clear about what he is gonna fo.

మోహన said...

@Indian Minerva

Yes. In addition to being radical he is very responsible too.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...
This comment has been removed by a blog administrator.
Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

<<...సదా చిరునవ్వులు ఒలికిస్తూ... సత్యం వైపు, పరమానందం వైపు నడిపించగల ఒక మహా గురువు, చిదానంద మూర్తి...>>

ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. కొత్త కోణం ఇది..