Wednesday, July 13, 2011

పున్నమొచ్చి పోయింది.

పున్నమొచ్చి పోయింది.

చీకటితో అనుబంధం స్పృహలోకి రావాలంటే పున్నమొచ్చి పోవాలా?

ఆకాశం ఎంత గాఢంగా కౌగిలించుకున్నా, ఆ భిక్ష వెన్నల వెలుగులదే కదా....

వెన్నెల చేసిన గాయాన్ని చీకటి మరింత లోతుగా గుచ్చింది. గుర్తుచేసింది.

గాఢాలింగనంతో స్తంభించిన రెండు మనసుల గుండెలయ భీకరమైన నిశ్శబ్దమై ప్రళయ తాండవం చేస్తుంది.

మళ్ళీ ఏ పున్నమో రావాలి. తన సోయగం తో వీరిని ఏమార్చి చల్లగా విడదీసి కాపాడాలి.
వెన్నెల కురిపించి విరహం రాజేసి కొత్త సంగీతాలకు ప్రాణం పోసి నిలబెట్టి పుణ్యం కట్టుకోవాలి.

4 comments:

కొత్త పాళీ said...

nice expression

మురారి said...

>>వెన్నెల కురిపించి విరహం రాజేసి కొత్త సంగీతాలకు ప్రాణం పోసి నిలబెట్టి పుణ్యం కట్టుకోవాలి.

ఈ లైన్‌ బాగా నచ్చింది. అందంగా ఉంటూనే నిగూఢంగా రాయడంలో మీది ప్రత్యేకమైన శైలి. బావుంది.

మోహన said...

Thank you

రసజ్ఞ said...

చక్కని పదజాలంతో కూడిన భావ వ్యక్తీకరణ!