రెక్కల పురుగు...
ఏమిటో దానిలో అంత అశాంతి?
ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు
కొవ్వొత్తొకటి వెలిగించగానే దాని చుట్టూ గిరికీలుకొడుతుంది గాల్లో.
మంటలో పడి కాలిపోతుందేమో అని ఎన్ని సార్లు పక్కకి నెట్టినా మళ్ళా అక్కడికే వస్తుంది.
ఆ మంట చుట్టూనే తిరుగుతుంది.
ఏమిటో దానికి అంత ఆకర్షణ ఆ మంటపైన, 'ఈ క్షణం కోసమే ఇంతకాలం ఎదురుచూస్తుందా?' అన్నట్టు
అలా తిరిగి తిరిగి ఆఖరికి ఆ మంటలో పడి కాలి తగలబడిపోయింది. చచ్చిపోయింది.
హ్మ్....
భౌతికంగా కుర్చీలో కదలకుండా కూర్చున్నా కానీ
నా మనసు మాత్రం ఏదో తెలియని ప్రశాంతత తీరాలను చేరాలని ఆకాంక్షిస్తూ, తనలో
రేగుతున్న అలజడి కెరటాలకు ఇకనైనా స్వస్తి పలికే క్షణం కోసం నిరంతరం నిరీక్షిస్తూనే ఉంది.
తనలోని అశాంతికి కారణమైన అజ్ఞానాన్ని కాల్చి తగలబెట్టే వెలుగు కోసం నిత్యం వేచిచూస్తుంది !!
నాకు తెలియకుండానే, ఆ రెక్కల పురుగులా.

2 comments:
పోలిక బావుంది మోహన గారు.
wow mohana!
Post a Comment