Monday, July 9, 2012

ఓ వానా....

చిరాకు నాకు వానంటే. తడి తడిగా.. ఎక్కడ చూసినా బంక, బురద. అడుగు తీసి అడుగు వేస్తే అందులో ఇరుక్కుపోతాయి కాళ్ళు. బయటకు వెళ్ళలేం, పనులు చేసుకోలేం!! అన్నిటికీ అడ్డు వాన. ఎక్కడికీ కదలనివ్వకుండా కట్టి పడేసే వర్షం అంటే నాకు చిరాకు అందుకే. అలా అని మొండిగా బయలుదేరితే అన్నీ ఇబ్బందులే!

But...
Now I am standing in this drought. ఎక్కడ చూసినా బీటలు. కట్టి పడేసే వారెవరూ లేరు. ఇంకా చెప్పాలంటే చినుకు తడి కోసం నేను తిరిగి చూడని దిక్కు లేదు. వెతకని దారి లేదు. అన్ని దారులూ మొండి చెయ్యే చూపిస్తున్నాయి.  ఇలా వెతుకుతుంటే తెలుస్తుంది, నేనేం పోగొట్టుకున్నానో! ఏం ద్వేషించానో!! ఇన్నాళ్ళూ...I now see what I used to Hate. నేను నిన్ను అంతగా ఇష్టపడటం నేను తట్టుకోలేకపోయాను. అహమో.. భయమో.. ఏమో మరి. Whatever...No matter what, I LOVE YOU. I always did. But it took me my 'Life' to realize the Truth. I now miss you.

So, why dont you come back, give me a second chance and tie me down, at my HOME. ఎక్కడికీ కదలనివ్వకుండా.....

Friday, July 6, 2012

అనుకోని అతిథి

మనోవనంలో విరబూసే తడి చినుకై వస్తావో...
వలపుకు కళ్ళెం వేసే అందెల మువ్వై ఘల్లుమంటావో...

విశాల గగనంలో తారకవై మురిపిస్తావో...
కారు మబ్బుల ఉరుమై వణికిస్తావో...

అల్లిబిల్లి ఆటల్లో కాకి ఎంగిలే పంచుతావో...
గిల్లికజ్జాల మూటలే మోయిస్తావో...

ఉప్పుమూటలాడిస్తావో...
ఉప్పు చినుకులే మూటకడతావో...

కలవరపెట్టే కలవో....
పొడుపు కథవో.....

ఏమో........

ఎప్పుడొస్తావో.... ఎలా వస్తావో....
ఏ మలుపులో పలకరిస్తావో.......!


Saturday, June 2, 2012

Its Time!

Everything seems OK. Yet,
if there is a glitch, right in the Heart...


Everything is normal. Yet,
if there is pain, which can not be spot....


Everything is set perfect. Yet,
if there is chaos within, unwilling to settle...


Just like a Tornado whirling everything on its way,
if your world feels like sucking you in...


Its Time!
Its time to walk that extra mile...
An extra mile, which is uncertain, unclear,
like a tunnel, might be dark and resonates your own echo,
with the invisible Faith lighting up, only the End...!



...Leading to Destiny.




****


Destiny is....less clear, less certain and little puzzling paths to the Soul, which the Self would choose to traverse.





Sunday, May 27, 2012

తను-నువ్వు

      తనెన్ని మాటలు నేర్చిందో తెలుసా నువ్వెళ్ళాకా! ఇప్పుడు తనకెన్ని ఆశలో, ఎన్ని ఊసులో.... అన్నీ నీ గురించే!! ఏకాంతం పరదా పడగానే నన్ను అల్లేసుకుని నాతో సాల్సానో సామ్బానో ఆడటం ఇప్పుడు తనకో హాబీ!

అది కాకపోతే కబుర్లు కబుర్లు కబుర్లు.......

       ఆ కబుర్లు ఏంటో తెలుసా? నువ్వు వస్తే నిన్ను చూస్తే.. ఎలా ఉండాలో ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో... అని ఎన్నో రిహార్సల్స్ వేస్తుంది. నిన్ను చూడగానే నవ్వుతూ 'Welcome Back' అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వాలో లేక 'I missed you' అంటూ అమాంతం గా వాటేసుకోవాలో.. మరి 'hi' అని నువ్వేం చేస్తావో చూద్దామా లేక దాక్కుని నిన్ను ఆటపట్టించాలా... అని...

        తరువాత నీతో కాస్త ఏకాంతం దొరికితే తన భావాలన్నీ చెప్పాలా లేక వాటిని పెదవుల వద్దే ఆపి కళ్ళలో దాచి నిన్ను వెతకనివ్వాలా లేక చిలిపి ఆటలతో నిన్ను మురిపించాలా అని...

         ఇలా నిత్యం నీతో గడపాలనుకునే ప్రతి నిముషాన్నీతన ఊహల్లో అలంకరించుకుంటూ వాటిని ఎప్పుడెప్పుడు మాలగా గుచ్చి నీకివ్వగలనో అని తహతహలాడుతూ తిరిగే తను నడిచే రంగవల్లికలా మురిపెంగా కనిపిస్తుంది. ఎప్పుడూ పరవశం, తన్మయత్వం తప్ప వేరే ఊసేరుగని తన సాంగత్యం నాకు వెన్నెల వెలుగును తలపించేది.

కాల్చే విరహం ఇంత చల్లగా ఉంటుందని వినలేదు నేనెప్పుడూ....



******************************


           తనలో ఏదో చిటపట. వెన్నెల ఎంత నిండుగా ఉన్నా పాలిపోయినట్టు ఉండదు. అలాంటిది ఈ మధ్య తనెందుకో పాలిపోయినట్టనిపిస్తుంది. నిరుత్సాహంగా తిరుగుతుంది. అద్దిన రంగవల్లికలా నిండుగా నవ్వే తానిప్పుడు నడుస్తున్న నిశిలా భారంగా, గంభీరంగా లోతైన కళ్ళతో పేలవంగా తిరుగుతుంది. ఏమంటే ఏమీ లేదంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా నీ ఊసులేదు. నీ ఊసు లేనంత మాత్రాన, నీ ఊహ లేదనుకోను!! ఎందుకంటే తడిసిన మట్టి వాసనో, నీకిష్టమైన పాటో తాకిన ప్రతి సారీ ఆ లోతైన కళ్ళలో నల్లని మేఘాలు కమ్ముకోవటం చూసాను. లోయలో పడిన పిడుగు  కొండా,కోనా ప్రతిధ్వనించినట్టు తను నిలువునా స్థంబించి కంపిస్తుంది అలాంటప్పుడు. ఆ కనులు నీరు కారటం నేను చూడలేదు. కానీ తడిపొర కమ్మిన కన్నులు చూసే పదునైన చూపును చూసాను. ఎన్ని వరదలు ఆ కనుకొనలకా పదును చేసాయో!!

వియోగం మంచు ముక్కలా నరాలు తెగేలా కోస్తుందంటే నమ్మలేదు నేను. మీ మధ్యా?  వియోగం??!! ఇదేదో మనస్పర్ధలా అనిపిస్తుంది నాకు.

నువ్వు రా!! నువ్వు త్వరగా వచ్చి ఈ మంచును కరిగించు.

Break the ice, before it cuts through.

Tuesday, April 3, 2012

ఆ వెలుగే...


ఆ వెలుగే...

దగ్గరున్నప్పుడు సూర్యుడిలా ప్రకాశించి జీవనాధారమయ్యింది.

దూరమయ్యాక తారలా మెరుస్తూ ఏకాంతంలో తోడుగా ఉండి సేద తీర్చింది.

అప్పుడు నేను వదులుకోలేని ఆ వెలుగే, ఇప్పుడు నన్ను వీడలేని నీడగా మారి నాతో పాటు అడుగేస్తుంది.

Saturday, January 14, 2012

Friday, December 2, 2011

Me and My Conscience - Duality/Dichotomy in Life

When you feel like talking more than necessary, push yourself to be quiet.
When disturbed with too much silence in mind, make some noise, plan yourself a nice engaging activity.

When you feel like moving away from the world, move to the best of the pals or a better place.
When you are engaging your self too much into world's matters, its time you get some time for yourself.

When you throw yourself into a bigger pot, you are actually moving close to your Self and becoming more self-centric.
When you are moving into your own shell, your are actually sorting or organizing your world.




-- Its funny and amazingly absorbing and surprisingly interesting, how the solutions for most problems reside in the opposite plane. Understand and Catch up with Duality/Dichotomy in life and live feather lite life.