Monday, February 4, 2008

సొంత డబ్బా...

ఈరోజు నా గురించి రాసుకోవాలనిపిస్తోంది.

నా పేరు విశాల. నా పేరంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. అమ్మ నన్ను, క్రమశిక్షణ లో పెంచింది. బాధ్యత, శ్రద్ధ నేర్పింది. నాన్న నాకొక మంచి ఫ్రెండ్. ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడుకుంటాం. ఇక తమ్ముడు... వాడంటే నాకు చాలా ఇష్టం. my first best friend అని పరిచయం చేస్తుంటాను అందరికీ..

ఇక నా గురించి... నేను చాలా తెలివైన దానిని అని నాకొక ఫీలింగ్. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నా అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోను. మార్పు అవసరం అనిపిస్తే వెనుకాడను. ఐతే బలవంతం చేస్తే, నా అంత మొండి, saddist ఇంకెవరూ ఉండరేమో..! చాలా మటుకు నా పనులు impulsive గా ఉంటాయి. friends ని ఏడిపించటం, వాళ్ళాపై జోకులెయ్యటం అంటే చాలా ఇష్టం. ఆడుకోవటం అంటే ఇంకా ఇష్టం. ఆడే వాళ్ళు ఉండాలేగానీ... AATR నేను. ఆదేనండీ.. "ఆటకి Any Time Ready" అనీ..

ఇంకా నాకు శ్రీ కృష్ణుడంటే చాలా ఇష్టం. అన్నిటిలోనూ ఉంటూనే, అన్నిటికీ అతీతంగా ఉండే అతని స్వభావం నాకు చాలా నచ్చుతుంది. నేను గీత చదవలేదు కానీ, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి విన్న దానికే అతడికి పెద్ద ఫాన్ అయిపోయాను. I feel that I am crazy about Him. అలాగే, నాకు చిన్న పిల్లలంటే ఇష్తం. ప్రకృతి అంటే కూడా చాలా ఇష్టం. అందుకేనేమో నాకు ఒంటరిటనం అంటే bore కొట్టదు. చుట్టూ పరిసరాలను observe చేస్తూ ఎంత సేపైనా గడిపేస్తుంటాను. అన్నట్టు bore అంటే గుర్తొచ్చిఇంది. నాకు bore కొట్టడం చాలా అరుదు. ఎలాంటి topic లో అయినా ఇట్టే ఇమిడిపోతాను. Spirituality, Philosophy, Psychology, Mathematics, Physics, Social issues, movies, Arts, Languages, Cricket, ఇంటి పని, వంట పని... ఇలా దేని గురించైనా మాట్లాడెస్తుంటాను. అది నా uniqueness అనిపిస్తుంది నాకు. నాన్న మాత్రం.."నీకు కబుర్లెక్కువ పని తక్కువ", అంటూ ఉడికిస్తుంటారు. ఐతే దేని గురించి మాట్లాడినా, నా intentions పక్క వాళ్ళకి అర్థం కావాలి అన్న తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఎదుటివారు నాతో ఏకీభవించకపోయినా నాకు ఎమి అనిపించదు. కాని, నా వాదన అర్థం కాలేదు అంటే మాత్రం, ఓపికగా మళ్ళా విడమర్చి చెప్పటానికి ప్రయత్నిస్తాను. వాళ్ళ ముఖం లో, "ఇక ఆపవే" అన్న భావన కనిపించినా ఆపను. అదేదో బయటకి చెప్పచ్చుకదా. ఎందుకో అంత మొహమాటం... చాలా సార్లు, నా బాధ భరించలేక, కొంతమంది friends, "You are right Visala" అని తప్పించేసుకుంటారు. "అలా అని చెప్పి బ్రతికిపొయావు" అని చెప్పి నేనూ నవ్వేస్తాను. అలా కాకుండ, "విశాలా, ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైన.." అనో.. లేక "ఆ టాపిక్ ఇక్కడితో వదిలెయి" అనో.. చనువుగా చెప్తే నాకు బాగా అనిపిస్తుంది.

నా వెర్రి ఇక్కడితో ఆగలేదండోయ్... నేను పాటలు పాడుతుంటాను. మనలో మన మాట.. "ఏడారి లో ఆవదం చెట్టే.. మహా వృక్షం." అన్నట్టు, మా గ్యాంగ్ లో నెనే పెద్ద సింగర్. ఇంకా బొమ్మలు గీయటం..., చిన్న చిన్న రాతలు.. [వాటిని ఏమనాలో తెలియదు నాకు...], పుస్తకాలు చదవటం, చదివింది ఎంతైనా..., నాకు ఆంతా తెలిసిపోయినట్టు వాదించటం.. ఇలా ఎదో ఒకటి చేస్తుంటాను. మధ్యలో, ఎవరైనా పొగిడితే మురిసిపోతుంటాను. ఇలా రోజులు గడిపేస్తున్నాను...

సరే మరి.. మళ్ళా ఎప్పుడైనా, నాకు మూడ్ వస్తే మరికొన్ని రహస్యాలు చెప్తాను...

ఇట్లు,
విశాల.

2 comments:

తెలుగు'వాడి'ని said...

మన గురించి తెలుసుకోవటం లేదా/మరియు తెలిసిన విషయాలను లేదా/మరియు మనవైన విషయాలను చెప్పాలనుకోవటం ఒక ఎత్తైతే, వాటికో స్పష్టతనివ్వటం, తదుపరిగా వాటికో అక్షరరూపం ఇవ్వటం అనేది నిజంగా అభినందించవలసిన విషయం. అందుకు మీకు ముందుగా వేనవేల అభినందనలు.

మీదైన ప్రపంచంలోని ప్రతి క్షణానికీ ఓ అధ్భుతమైన ఆనందాన్ని, అనుభవాన్నీ, జ్ఞాపికగా మార్చుకుంటూ ఇలాగే హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ గడిపేయండి.

ఇకపోతే మీకూ మీరే 'వెర్రి' అనుకుంటున్నారు కాబట్టి దానిలో అవిభాజ్య భాగాలైన వాటిని (పాటలు, గీతలు, రాతలు, చదువులు, వాదనలు) అలా వదిలేయకండి. అప్పుడప్పుడూ సానపెడుతూ ఉండండి. మీ స్నేహితులు మీలో వచ్చే మార్పుకు భయపడిపోయి 'వెర్రి ఉన్నప్పుడే బాగుంది ... ఇప్పుడు ఏమయ్యిందొ ఏమిటో అనుకునే) ప్రమాదముంది ...

అలాగే ఇష్టమైన వాటిని ఎంత కష్టంతో చేస్తున్నా (వాటిని లేక విన్న/కన్న వారిని కష్టపెట్టేస్తున్నా కూడా) కొన్నిరోజుల తరువాత తిరిగి చూసుకుంటే ఆ ఆనందమే/అనుభూతే వేరేమో కదా....ఇందుకోసమైనా ప్రయత్నించండి.

శేఖర్ పెద్దగోపు said...

మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం కూడా ఒక గొప్ప కళ అని నా ఫీలింగ్. మీరు అందులో బాగా ప్రావీణ్యం ఉన్నవారిలా కనిపిస్తున్నారు.

మీ పాత టపాలన్నీ ఒక సారి చూస్తుంటే మీ సొంతడబ్బా :) కనిపించింది. ఓ లుక్కేసాను.

సంవత్సరం కిందట రాసిన టపాకి కామెంట్ చేస్తున్నాడేంటి అని కళ్ళు ఎర్రగా చెయ్యొద్దు. నాకు ఏదైనా అనిపిస్తే అది వెంటనే చెప్పేస్తాను.

లేకపోతే అదేదో సినిమా లో మాటలు వచ్చిన తర్వాత శ్రీ లక్ష్మి తన ఒకటో తరగతి క్లాస్మట్ ని తిట్టినట్టు ఉంటుంది నా పరిస్థితి.