జ్ఞాన జ్యోతిని సాధించటం మొదటి అంకం.
ఆ వెలుగు లేనిదే సత్యాన్వేషణ అసాధ్యం.
జ్ఞానమే సర్వస్వమనుకుంటే మూర్ఖత్వం.
ఆ జ్వాలలో మాడి మసవటం ఖాయం.
అజ్ఞానికి సైతం మోక్షాన్నిచ్చేది ప్రేమ తత్వం.
ప్రేమను సైతం పరిహసించగలిగేది విశ్వ సత్యం.
అజ్ఞానికి సత్యం తెరిచే తలుపు విరక్తి.
జ్ఞానమున్న నాడు అదే వైరాగ్యం, మోక్షానికి ముఖ ద్వారం.
ప్రవేశ రుసుము విలువ, పేర్చుకున్న జ్ఞానమంత!
ఆ తలుపు ఆవల అంతా శూన్యమే..!!
5 comments:
ఏంటి మోహనా ఇది? అంతా శూన్యమేనా? :(
అంతా తెలుసుకున్న తర్వాత ఇంకేముంది శూన్యమేకదా!
ఒక్కో వాక్యం వెనుక గొప్ప భావముంది. చాలా బాగా రాసారు.
>>అజ్ఞానికి సత్యం తెరిచే తలుపు విరక్తి.
జ్ఞానమున్న నాడు అదే వైరాగ్యం, మోక్షానికి ముఖ ద్వారం.
ఈ విషయంలో జ్ఞానికి, అజ్ఞానికి భావస్పందనలలో బేధముంటుందా?
@దిలీప్
శూన్యమంటే :( ఎందుకు ?
@విజయమోహన్ గారూ
అంతా తెలుసన్న విషయం కూడా వదిలెయ్యగలగాలేమో.. అని నాకనిపిస్తుంది.
@ మురారి గారూ
నిజాన్ని చూడగలిగే వాడు జ్ఞాని. చూసిందే నిజమనుకునే వాడు అజ్ఞాని.
నిజాన్ని వ్యక్తపరచ గలవాడు జ్ఞాని. వ్యక్తపరిచిందే నిజమనుకునే వాడు అజ్ఞాని.
జ్ఞాని యొక్క భావస్పందన ఇలానే ఉంటుంది అని చెప్పలేను కానీ, అది నిజమై ఉంటుంది. అలానే అతడి దృష్ఠి పరిమితి అతడిని మించి ఉంటుందని..., చేసే క్రియ ఏదైనా, ఉద్దేశాలు మాత్రం సృష్ఠిని గౌరవించేవిగా ఉంటాయని అనిపిస్తుంది. నిజాన్ని అవసరమైన చోట అద్దంలా చూపగలిగే ధైర్యంతో పాటు, నిజానికి అనుకూలత, ఆదరణ లేని చోట సున్నితంగానే హెచ్చరించగలిగే, అవసరమైతే మౌనం వహించగలిగే సమర్ధత ఉన్నవాడనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞాని అనే వాడు ఎంత కష్టమైనా నిజాన్ని గౌరవించి ఆదరించగలడు.
అజ్ఞాని అనే వాడి దగ్గర నిజం, అలానే నిశ్శబ్దం మనటం కాస్త కష్టమే అనుకుంటా...
ఇది నిజం కాకపోవచ్చు. కేవలం నా ఊహగానం కావచ్చు. కానీ ప్రస్తుతానికి నాకు ఇలానే అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా వీలైతే తెలుపగలరు.
వైరాగ్యం ఇద్దరికీ (జ్ఞానికి, అజ్ఞానికి) సహజంగా కలుగుతుతుందని నా అభిప్రాయం. I had a blurred distinction between them. అంత నిశితంగా ఆలోచించలేదు. మీ reply చూసాక, from your perspective/rationale మీరు చెప్పింది కరక్టే అనిపించింది.
Post a Comment