ఇంటికి కాస్త త్వరగా బయలుదేరేడు...
ఇంకాసేపుంటే మంచులో తడవాలని కాబోలు!
మళ్ళొస్తా అంటూ అతడి చివరి స్వర్ణ కాంతులు,
చిటారు కొమ్మలను ఓదారుస్తూ బుజ్జగిస్తున్నాయి.
ఆ ఆఖరి వెచ్చటి స్పర్శ కు కలిగిన చల్లటి పులకింతేనా..?
ఈ శీతాకాలపు సాయంకాలం ?
***
వీధి మలుపు తిరిగే వరకూ సాగనంపే అమ్మలా,
ఆకాశం అతడిని సాగనంపుతోంది.
చలికి వణుకుతున్న పుడమికి,
పండిన చెట్ల ఆకులు దారంతా దుప్పటి కప్పుతున్నాయి.
ఈ శీతాకాలపు సాయంకాలం,
వెచ్చని అభిమానాల సమాహారం.
***
పొగ మంచు తెరలో,
వెచ్చని ఊసుల్లో చలి కాచుకుంటూ,
చేతిలో చేయి వేసి నడుస్తున్న...
పండిన గోరింటాకంటి పడుచు జంట.
జ్ఞాపకాల కుంపటిని రాజేసేను,
ఈ శీతాకాలపు సాయంకాలం.
5 comments:
Beautiful.
అవును, అందంగా ఉంది శీతాకాలపు సాయంకాలం...
ఆదిత్యుడు కొండల కౌగిళ్ళలోకి ఒదిగిపోతూ తన కిరణాలతో సుతారంగా స్పర్శిస్తున్నట్టుగా ఉంది.
wonderful!
@all
Thank you
Post a Comment