ఎడారి మనసులో ఒయాసిస్సల్లే ఎదురుపడ్డావు.
నిను చేరేందుకు ఎంతో దూరం పయనించాను.
దారంతా మనసుకు ఎన్నో పోట్లు.
అలసి, విసిగి, ఆగి, వెనుతిరిగి చూసాను.
అక్కడ ఏదో ఒక కొత్త ప్రదేశం!!
నందన వనాలు, నెమళ్ళూ, పూలు, సెలయేళ్ళు..
చెట్లు, వాటి నీడలో సేదతీరుతున్న మనుషులు...
ఇంకా ఎన్నో దృశ్యాలు.
ముందు నీవు లేవు.
వెనుక నా గతం లేదు.
చదును చేసిన మనసుతో...
అగమ్యగోచర స్థితిలో ఒంటరిగా నేను!!
13 comments:
హమ్మ్... బాగుంది! :-)
ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఒయాసిస్సు దగ్గరా?
వెను తిరిగి చూస్తే నందనవనం, నెమళ్ళు....అంటే నువ్వు దాటి వచ్చేసినవి వెను తిరిగి చూస్తే ఇప్పుడు అలా కనపడుతున్నాయా?
చాలా బాగుంది..
@దిలీప్ ...దాటివచ్చాకా వెనకవి అలా కనపడడం కాదేమో.అలాంటి ప్రదేశాన్ని దాటివచ్చినా తెలుసుకోలేని పరిస్థితిలో తను వున్నానని కాబోలు.ఇంత ప్రయాణం చేసివచ్చినా ముందు తను లేకపోవడం,వెనుక తనుపోల్చ లేని గతం....వీటితో అంతా అగమ్యగోచరం గా వుందని మోహన భావం కాబోలు.నేనేమన్నా తప్పుగా అర్ధం చేసుకున్నానా మోహనా?
దిలీప్ గారి రాధిక గారి వాదనలూ ఒకటిగానే అనిపిస్తున్నాయి.
మంచి కవిత
Nice one
బావుందండి..భావావేశ కవితలు రాయటం లో మీకు మంచి ఈజ్ వుంది.
చాలా బాగుంది.
మోహన గారు చాలా బాగుంది.
మీ ఎడారి మనసులో ఒయాసిస్సు అనుకున్నది ఎండమావేమో ఎంత దూరం వెళ్ళినా మిమ్మల్నది చేరలేదు. వెళ్ళేకొద్దీ అంతేదూరాన్ని మీ మధ్య కొనసాగిస్తుంది.
మనసుతో ఇదేనండి పేచీ.
కొలననుకుంటే తరంగాలుంటాయి పట్టలేము
ఎడారైతే ఎండమావులుంటాయి చేరలేము
పున్నమైతే వెన్నెలుంటుంది దాచుకోలేము
కడలయితే అలలుంటాయి ఆపలేము
అవి మనల్ని చేరటమే గాని మనం వాటిని చేరలేము
మీ కొన్ని రచనల్లో పదాలు చెప్పని భావాలేవో దోబూచులాడుతుంటాయి. కొన్నింటిని మీరు assume చేసేసుకోవడం వలన వదిలేస్తారేమో. కొన్ని పార్శ్వాలు అస్పష్టంగా కనపడటం వలన కూడా రచన ఆకట్టుకొంటుంది. అగమ్యగోచరం బాగుంది.
@దిలీప్
నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను ;)
@రాధిక
దాటి వచ్చినప్పుడు అంతా ఎడారే... ప్రాయాణంలో కలిగిన పోట్లకు ఎడారి కూడా వనం లా మారిందని చెప్పాలనుకున్నాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నాకు తెలిసిన ఎడారి [గతం] లేదు. అంతా కొత్తగా ఉంది. అందుకే అగమ్యగోచరంగా ఉంది. ఇదండీ నే చెప్పాలనుకున్నది.. Thank you
@పూర్ణిమ, @బాబా గారూ, విజయమోహన్ గారూ, ప్రతాప్, P L Sekhar, వేణూ శ్రీకాంత్ గారూ
Thank you.
@మురారి గారూ
పదాలు చెప్పని భావాలేవో దోబూచులాడుతుంటాయి అంటే.. అంతకు మించి చెప్పలేక కావచ్చు. Emotions can be understood only when they can be felt. ఎదైనా వదిలేయటం అనేది బహుసా స్పష్ఠత లేకేమో... నేను రచయితని కాదు. రాసేటప్పుడు తోచింది రాయటమే తప్ప అది చదివేవారిని ఆకట్టుకుంటుందా లేదా, గొప్పగా ఉంటుందా లేదా అని ఆలోచించి మాత్రం రాయను. అగమ్యగోచరం మీకు నచ్చినందుకు సంతోషం. Thank you.
@ఆత్రేయ గారూ
ఈ కవితలోని నే చెప్పాలనుకున్న విషయాన్ని మీరు సరిగ్గా పట్టారు. ధన్యవాదాలు.
మీ కవిత నాకు చాలా నచ్చింది.
నిజమేనండీ అవి మనల్ని చేరటమే గాని మనం వాటిని చేరలేము. పైగా చేరాలని చేసే ప్రతి ప్రయత్నంతో ఇంకా దూరమే అవుతాయి.
ముందు నీవు లేవు.
వెనుక నా గతం లేదు.
చదును చేసిన మనసుతో...
అగమ్యగోచర స్థితిలో ఒంటరిగా నేను!!
beautiful!!!
Post a Comment