Thursday, March 5, 2009

అ(గె)లుపెరగని ఆరాటం...



నిను చేరేందుకు మనోవేగంతో వచ్చానే...
చేరే చివరి క్షణంలో, నాలో ఈ నిశ్శబ్దం !!
మాటల్లో చెప్పలేని నా భావావేశం కాదు.
నీ స్తబ్ధత ముందు ఓడి మౌనం గా నిలిచిన ఆరాటం.

ఈ అల విరిగింది.
నిరుత్సాహంగా వెనుతిరిగింది.
నీవు అలని చూసేవు.
నాకు అల వెనుక, అనంత సాగరమే కానవస్తుంది.

8 comments:

చిలమకూరు విజయమోహన్ said...

నీవు అలని చూసేవు.
నాకు అల వెనుక, అనంత సాగరమే కానవస్తుంది.
చాలా బాగుంది.

Mahesh said...

hi..

chaala baagarasarandi..

Purnima said...

WOW!!

మురారి said...

>>మాటల్లో చెప్పలేని నా భావావేశం కాదు.
నీ స్తబ్ధత ముందు ఓడి మౌనం గా నిలిచిన ఆరాటం.
>>నీవు అలని చూసేవు.
నాకు అల వెనుక, అనంత సాగరమే కానవస్తుంది.
అద్భుతంగా రాసారు.
ఫోటో మామూలుగా చూసినప్పటికీ, టపా చదివాక చూసినప్పటికీ తేడా ఉంది. ఓ అందమైన భావవేశం దానికి అంటుకొంది.

పరిమళం said...

nice post !

Anonymous said...

లేదు లేదు! అనంతసాగరం ఆశగా మరో అలని ఎప్పుడుముందు తోస్తుందా అని ఎదురు చూస్తున్నాను!
ఈ క్షణం స్తబ్దు వున్నా, నేనూ ఆశాజీవినే!
నాకు తెలుసు నువ్వూ అంతేనని!

కొత్త పాళీ said...

Interesting, but .. some link missing somewhere.
@aswinisri .. గొలుసు కవిత రాస్తార? :)

మోహన said...

@vijayamOhan, Mahesh, Purnima
Thank you.

@మురారి
>>ఫోటో మామూలుగా చూసినప్పటికీ, టపా చదివాక చూసినప్పటికీ తేడా ఉంది. ఓ అందమైన భావవేశం దానికి అంటుకొంది.
మీరు నా రాతకు సార్ధకత చేకూర్చారు. మీ వ్యఖ్య నాకు చాలా సంతోషాన్ని కలుగజేసింది. Thank you.

@పరిమళం
Thank you.

@aswinisri
:) మదిలో మెదులుతున్న మరో కోణానికి మీ వ్యాఖ్యతో ఊపిరి పోసారు. కృతజ్ఞతలు.

@కొత్తపాళీ గారూ
Thank you. Any suggestions about link?