Monday, May 25, 2009

మౌన వేదన...

లోగిలిలో దీపం మిణుకు మిణుకు మంటోంది.
తులసమ్మ నిదురించక తోడు కూర్చుంది.
మేలుకున్న శశి మబ్బుల మాటున నక్కాడు.
సందేశం లేదని చెప్పేందుకు మనసొప్పలేదు కాబోలు.
జాడ లేదని గాలి కబురు తెచ్చింది.
స్తంభించిన ప్రకృతి జాలిగా చూస్తోంది.
ముడిచిన పిడికిలి బిగుస్తోంది.
ఆశ చావని గుండె ఎక్కు పెడుతోంది.
ఈ రేయి తెల్లవారనీకని దీపం వేడుకుంటోంది.

10 comments:

హరే కృష్ణ said...

ముడిచిన పిడికిలి బిగుస్తోంది.
ఆశ చావని గుండె ఎక్కు పెడుతోంది.

చాలా బాగా వున్నాయి

పరిమళం said...

మీ పదాల అల్లిక సరళంగానూ ...అందంగానూ ఉందండీ !

శేఖర్ పెద్దగోపు said...

దేని కోసం ఇంత వేదన? ప్రతీ లైను ఊహించాలంటేనే భయం వేస్తుంది.
నేనేమైనా తప్పుగా అర్ధం చేసుకుని ఉంటే అన్యధాభావించవద్దని మనవి.

మరువం ఉష said...

అంటే ఈ రేయి ఎవరికోసమో మీ అన్వేషణ, నిరీక్షణ అని నాకు అర్థం అయింది. రానున్న వేకువ చీకటితో పాటు మీ వేదన తొలగించి, ఆ జాడేదో తెలియచెప్తుంది. అదే ఆశ అంటే. అదే రేపులోకి మనని నడిపించే చుక్కాని.

చిలమకూరు విజయమోహన్ said...

:(

రాధిక said...

good feel vunna kavita.cakkaTi vyaktiikaraNa.

Purnima said...

hmmmmm

ఏకాంతపు దిలీప్ said...

chaalaa gaaDhamgaa undi mOhanaa..

మురారి said...

beautiful!!..
మీరు క్రియేట్ చేసిన ambience, దాని ఫీల్ చాలా బాగుంది.
>> తులసమ్మ నిదురించక తోడు కూర్చుంది.
>>స్థంబించిన ప్రకృతి జాలిగా చూస్తోంది.
>>ఆశచావని గుండె ఎక్కుపెడుతోంది.
చాలా బాగున్నాయి. రోజురోజుకీ మీ రచనల పదును పెరుగుతోంది.

హను said...

nice, chala bagumdi nee visleshana,
nice naku telugu bloggerlo naa blog ela add cheyyalo teliyatam ledu akkada blog cherchamdi daggara kottina kuda raava tam ledu, meeru komcham cheppara pls