నాదైన నేను, నాకు తెలిసిన నిన్ను చేరి, నాకు తెలీని నేనై, నాదైన నిన్ను పొందాను. నాకు తెలీని నీవు, నేననుకున్న నా నుండి నాదనుకున్న నిన్ను తీసుకెళ్ళిపోయావు. మిగిలిన నాది కాదనుకున్న నన్ను చూసి నాకు భయం వేసింది. నువ్వనుకున్న నాదైన నిన్నైతే నువ్వు తీసుకుపోయావు కానీ, నాదైన నువ్వు నా దగ్గరింకా మిగిలే ఉంది. నేను కాని నేను నాదైన నిన్ను, నన్ను జాగ్రత్తగానే చూసుకుంటుంది. నాది హామీ.. :)
6 comments:
ఏంటోనండీ, ఎవరు ఎవర్ని ఏవంటున్నారో కొంచెం కన్ఫ్యూజింగా ఉంది :)
మాది ముందుగానే మట్టిబుర్ర.
Wow..పేపర్ మీద మాథ్ ఈక్వేషన్స్ వేసుకొని, వేరియబుల్ నేంస్ ఇచ్చి, కొన్నింటిని అంటే ex: నాదైన నిన్ను ను అటునుంచి ఇటు వైపుకు ఈక్వేషన్ లో తీసుకొచ్చి, అట్లాంటివి రెండు, మొత్తానికి రెండు సార్లు చేస్తే కాని అర్ధం కాలా.
ఇంతకీ చివర్లో "నాది" ఎవరు మిత్రమా? నాకు తెలిసిన నేనా, లేక నాకు తెలిసిన, తెలవని నేను ల సమ్మెళనమా, లేక ఆ మిశ్రమం తో పాటూ, నిజంగా నాదైన నేను, నాది కాని నేను; అలాగే, నాదనుకున్న నేను, నాది కాకుండపోయిన నేను ఇవన్నీ కూడా కలిసాయా ఆ "నాది" లో.
నాకైతే నచ్చేసింది :)
తల మీద చెయ్యి వేసి గోక్కునే సింబల్ ఇక్కడ...:)
;)
Post a Comment