Wednesday, December 30, 2009

అడిగేవాళ్ళే లేరా??

బంద్ ల పేరు చెప్పి రోజూ తిరిగే సిటీ బస్సులు తగలబెట్టటం!!
ఎవరో గుండెపోటుతో చచ్చిపోతే, వారి అభిమానులు అందరి పైనా రాళ్ళు విసరటం!!

Whats driving human race???

ఎవరు; ఎవరి కోసం; ఎందుకు; ఏం చేస్తున్నారు??? ఏం సాధిద్దామని?
అడిగేవాళ్ళే లేరా??

రోజంతా రోడ్ల మీద తిరిగితే కాని డొక్కాడని వారి పరిస్థితి ఏమిటీ?
:(

అసలు ఇలాంటి సంఘటనల సమయం లో మీ పరిస్థితి ఏమిటీ? అవి మీ పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అని సామాన్యుల్ని, ఆం ఆద్మీ ని ఎవరూ అడగరా? తెలుసుకోరా? పట్టించుకోరా??? అక్కర్లేదా ఎవరికీ???
Anybody there to show concern about the DAMN common man and to understand whats going through them????

ప్రజల కోసం ఏర్పడి, దేశంలో ఎంతో పటిష్ఠమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న మీడీయా కూడా ఈ విషయం లో ఏం చెయ్యలేదా? వారికేం బాధ్యత లేదా???

వాళ్ళు తలుచుకుంటే నిష్పాక్షికమైన సమాచారాన్ని, అసలు సిసలైన సంఘటనలని ప్రజల, ప్రభుత్వం ముందుకు తీసుకు రాలేరా???
వాటిని పర్యవేక్షించి సామాన్య మానవులకు ఆటంకం కలగకుండా న్యాయమూర్తులు, కోర్టులు ఏమీ ఉత్తరువులు జారీ చెయ్యలేరా??
మనం ఇలా ఉన్మాదం తో పేట్రేగుతున్న పరిస్థితుల్లో మగ్గి, మాడిపోవల్సిందేనా??

I feel lost in my own home, place, town, country!!! :((

8 comments:

Chandamama said...

లేరు!

చింతా రామ కృష్ణా రావు. said...

ఆపేదరికంతో జీవనం సాగించలేక రెక్కాడితేనే కాని డొక్కాడని అమాయక అభాగ్య జీవుల వేదన రోదన ఈ రాజకీయనాయకులకూ, మేధావులకూ వినబదినా ఆమాటలు మనసున్నవారిపై పనిచేస్తాయికాని, అందరిమీదా పనిచెయ్యవుకదా. ఒకప్పుడు గరీబీ హఠావో. అనే నినాదమ్తో పేదల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ఉద్యమాల ఆలోచన గరీబ్ హఠావో అంటున్నట్టుంది. పేదలకీ రెక్కాడితేనే గాని డొక్కాడనివారికీ మరణమే శరన్యం. పాపం వారెవరినాశ్రయించగలరు? వారిని గూర్చి స్వచ్ఛందంగా ఆమోచించే హ్యూమన్ రైట్స్ కమీషన్ లేదుకదా! మా బ్రతుకులు బండలపాలౌతున్నాయని మొరపెట్టుకొంటున్నపేదలకు ఆ కనఁబడని దేవుడే శరణు.

తుంటరి said...

ఎన్నికల్లో ఓటు వెయ్యకుండా,పని చెయ్యని పోలీసు లను ప్రభుత్వ ఉద్యొగులను ప్రశ్నించకుండా అడిగినంత పన్ను కట్టి జవాబుదారీతనం ఆశించకుండా ఉండే మద్యతరగతి మనుషులు ఉన్నంత కాలం ఇవి ఇలానే సాగుతూ ఉంటాయి. వేరే దారి లేదు.

వేణు said...

మీడియా విషయంలో మీకు చాలా అనుకూల అభిప్రాయాలున్నట్టు కనిపిస్తోంది. కొన్ని టీవీ ఛానళ్ళ పోకడలు ఎంత ఘోరంగా ఉన్నాయో గమనిస్తున్నారా...?

శేఖర్ పెద్దగోపు said...

ఎన్నో ఏళ్ళ నుండే అడిగేవారు కరువయ్యారు...ఇప్పుడు ప్రశ్నించుకోవటం అత్యాశే అవుతుందనుకుంటా...

Whats driving human race???

డబ్బు, గుర్తింపు, అధికారం, స్వార్ధం, నిర్లక్ష్యం, మూర్ఖత్వం...

ఇప్పుడు మీడియా అనేది ఒక కార్పోరేట్ వ్యాపారం...వ్యాపారంలో లాభనష్టాలే చూస్తాంగానీ అనవసర విషయాలు పట్టించుకోంకదండీ...

Purnima said...

>>> అసలు ఇలాంటి సంఘటనల సమయం లో మీ పరిస్థితి ఏమిటీ? అవి మీ పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అని సామాన్యుల్ని, ఆం ఆద్మీ ని ఎవరూ అడగరా? తెలుసుకోరా? పట్టించుకోరా??? అక్కర్లేదా ఎవరికీ???

ఎందుకు లేరూ? మీడియా ఉంది కదా, ఏ సందర్భంలోనైనా "మీరెలా ఫీల్ అవుతున్నారు" అని అడగడానికి! ఎంచక్కా టివీలో కూడా చూపిస్తారు!

అడిగివాళ్ళు కాదు.. కడిగేవాళ్ళు కావాలి! అదన్న మాట!

Purnima said...

>>> అసలు ఇలాంటి సంఘటనల సమయం లో మీ పరిస్థితి ఏమిటీ? అవి మీ పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అని సామాన్యుల్ని, ఆం ఆద్మీ ని ఎవరూ అడగరా? తెలుసుకోరా? పట్టించుకోరా??? అక్కర్లేదా ఎవరికీ???

ఎందుకు లేరూ? మీడియా ఉంది కదా, ఏ సందర్భంలోనైనా "మీరెలా ఫీల్ అవుతున్నారు" అని అడగడానికి! ఎంచక్కా టివీలో కూడా చూపిస్తారు!

అడిగివాళ్ళు కాదు.. కడిగేవాళ్ళు కావాలి! అదన్న మాట!

Kathi Mahesh Kumar said...

"ఆమ్ ఆద్మీ" అంటే ఎవరూ????
ఒకపక్క బ్రహ్మాండం బద్దలవుతున్నా తన పని తను చేసుకుపోయే ఎస్కేపిస్టా!
ఎందుకు పట్టించుకోవాలి సగటుమనిషిని? అటూ ఇటో ఏటోవైపో తేల్చుకోకుండా, "నాకేమీ పట్టదు నా బ్రతుకు నన్ను బ్రతకనియ్యండి" అనే పలాయనవాది పక్షం ఎవరు మాత్రం ఎందుకు వహించాలి?