Thursday, December 10, 2009

పిచ్చి ప్రేమ కథ

సోది: ఇది ఒక పిచ్చి ప్రేమ కథ!!
ఆమె పేరు ప్రేమ. అతడి పేరు పిచ్చి. పిచ్చి ప్రేమ ని ప్రేమిస్తాడు. ప్రేమ పిచ్చి ప్రేమ తొ పిచ్చెక్కుతుంది. కొన్నళ్ళకి... ప్రేమ కి ఆమె స్నేహితుడు దుఃఖంతో నిశ్చితార్ధం ఫిక్స్ అయ్యిందని తెలిసి పిచ్చి కి ప్రేమని కోల్పోతున్నా అన్న భయం తో పిచ్చెక్కుతుంది. పిచ్చెక్కిన పిచ్చి ని చూసి ప్రేమ కు పిచ్చెక్కినంత పని అవుతుంది. పిచ్చి కి తన పై ఉన్న పిచ్చి ప్రేమ తో పిచ్చెక్కిపొవటాన్ని తలచుకుని తన దుఃఖాన్నంతా దుఃఖం తో చెప్పుకుంటుంది ప్రేమ. అంతా విన్న దుఃఖం మనసు కరిగి దీర్ఘం గా దుఃఖిస్తాడు. ఆ భావోద్వేగంలో 'పిచ్చి కి పిచ్చెక్కిన వైనం' అని కథ రాస్తాడు. అందులో పిచ్చి ప్రేమ ని పిచ్చెక్కించేలా వర్ణిస్తాడు.

సోది ఫ్రెండ్: తర్వాత సినిమా తీస్తాడు. అదే ఆర్య 2

సోది: అబ్బా... నేను ఆర్య-2 చూడలే. నువ్వు ముందు నే చెప్పేది విను.......

ఆ ప్రేమ కథ ని చదివిన ప్రేమ పిచ్చి దై పిచ్చి ని ప్రేమించి, ప్రేమ ను, పిచ్చి ని, పిచ్చి ప్రేమ ను, ప్రేమ పిచ్చి ని అర్థం చెసుకున్న దుఃఖాన్ని ఆరాధిస్తుంది.

సోది ఫ్రెండ్: ఇది బాగుంది. పిచ్చెక్కేలా ఉంది :P

సోది: హ్మ్... విను విను....
ఒక వైపు పిచ్చి పిచ్చి ని భరించలేక, మరో వైపు పిచ్చి ప్రేమ ను పొందలేకపొతున్నా అనీ.... ఆ సంధిగ్ధం తట్టుకోలేక దుఃఖం తో నూతిలో దూకేస్తుంది పాపం పిచ్చి ప్రేమ. దూకాకా నూతిలో నీళ్ళు లెవని తెలుస్తుంది.

సోది ఫ్రెండ్: హహహహహహా.... నూతి లో నీళ్ళు లేకుండా ఎలా దూకింది.. సన్నాసి కాకపొతే!


సోది: అదే అదే....అందుకే తను ప్రేమ అయ్యింది.
పాపం అలా ఆ నూతిలోనే ఉండిపోతుంది. ఎందుకంటే నీళ్ళు లేవని ఎవరూ అటు రారు, చేద లేదు, తాడు లేదు, మెట్లు కూడా లేవు. ఇక చేసేది లేక దుఃఖాన్ని ఆశ్రయిస్తుంది. పిచ్చి తో ఉండాలనుకున్న ప్రేమ దుఃఖం తో తన శేష జీవితం గడిపేస్తుంది.

ఇప్పుడు చెప్పు. ఎలా ఉందీ కథ?

సోది ఫ్రెండ్: పిచ్చి ప్రేమ కథ విని దుఃఖం ఆగట్లేదు. :(

సోది: అంతే మరి! అమర మైనది పిచ్చి ప్రేమ. విని ఎవరైనా సరే దుఃఖించాల్సిందే!

సోది ఫ్రెండ్: మరి చదివినోళ్ళో??

సోది: పిచ్చెక్కిపోవాల్సిందే!! :P

11 comments:

Unknown said...

హ్హహ్హహ్హహ్హహ్హ..............
బాగుందండి మీ ప్రేమ,పిచ్చి ప్రేమ కథ.

శేఖర్ పెద్దగోపు said...

మీరు "పిచ్చి ప్రేమ కధ" ను పిచ్చ పిచ్చగా నచ్చేట్టు రాసుంటారని పిచ్చిలేని నా మనసు పిచ్చిగా ఆశించి చదివితే, పిచ్చెక్కినంత పనైనప్పటికీ పిచ్చికి పిచ్చెక్కించేంత పిచ్చితనం ఎలా వచ్చిందో తెలుసుకోడానికి ప్రయత్నించాను. అయితే పిచ్చి పిచ్చి మాటలతో నాకు పిచ్చెక్కించిందిగానీ, పిచ్చిలో కూడా పిచ్చికొరకు పుట్టిన ఓ పిచ్చిది ఉంటుందేమో అని వెతుకుతున్న నాకు పిచ్చినే మిగిల్చింది.
( మీ పోస్ట్ ఇచ్చిన ఉత్సాహంతో రాసిన పిచ్చికమెంట్ ఇది..దయచేసి పిచ్చిగా..సారీ తప్పుగా అనుకోవద్దు :-))

నిషిగంధ said...

అయ్యబాబోయ్ :)))

Sandeep P said...

బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మానందంగా ఉంది మాష్టారు. చక్కగా వ్రాశారు. మీ హ్యూమర్ చాలా బాగుంది.

శిశిర said...

ఆర్య-2 సినిమా చూసాక పుట్టిన కథాండీ ఇది? :)

Padmarpita said...

:):))

S said...

Good one!!!

మురారి said...

పిచ్చెక్కేంత బాగుంది. :)

మోహన said...

@శేఖర్
>>పిచ్చిగా..సారీ తప్పుగా అనుకోవద్దు :-)
:)) అనుకోనులేండి.

నేను మూడు పదాలతో కథ అల్లితే మీరు ఒక్క పిచ్చి అనే పదాన్ని చితక్కొట్టి పచ్చడి చేతిలో పెట్టి నా బుర్రతో ఫుట్ బాల్ ఆడుకున్నారు. మీ వ్యాఖ్య అర్ధం కావాలంటే నేను మీ దగ్గర ఒక పిచ్చి క్లాస్ తీసుకోవాలేమో! :P

@శిశిర
నేను ఆర్య-2 చూడలే!! :)

@all
Thank you. :)

Unknown said...

bagundandi. annitikanna prema nillu leni nuutilo dukadam bagundi :)

Unknown said...

bagundandi. annitikanna prema nillu leni nuutilo dukadam.. :D