నా క్లాస్మేట్ ఫ్రెండ్ ఒక సారి 'soft pals' అని సంబోధించాడు మమ్మల్ని. అదే సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ ని.
నిజమే కదా... ఎంత సాఫ్ట్ గాళ్ళం మేం!! డీసెంట్ గా రెడీ అవుతాం. ఎవడేమైపోయినా పట్టించుకోం. ఆకాశం ఊడి పడిపోతున్నా సరే మా డెస్క్ ల దగ్గరే కాపురం ఉంటాం.
'ఇదేంటీ ఇలా మాట్లాడేస్తున్నాను, నేను సాఫ్ట్ గా కదా చెప్పాలీ...అపచారం, అపచారం!'
ఎక్కడున్నానూ, ఆఆ..... పట్టించుకోం! సో, సాఫ్ట్ గా చెప్పాలంటే, ఖాళీ దొరికితే ఏ మాల్ కో, పబ్ కో, సినిమా కో వెళ్ళి మా తిప్పలు మేం పడాతాం. ఇంకా సమయం చిక్కితే నిద్రపోతాం! అంతే గానీ ఎవరి విషయాల్లోనూ తల దూర్చం!! ఆఖరికి సొంత విషయాల్లో కూడా.. :P
అలా మేనేజర్ పాపాలు మేనేజర్ కే వదిలేసి, శాంత మూర్తుల్లా, ఆశ్రమవాసుల్లా గడిపే మా జీవితాల్లోనూ చెప్పుకోలేని ఒక కష్టం ఉంది!!! అదీ..........................
ఏదీ ప్రభావం చూపలేని మా సాఫ్ట్ గాళ్ళకి, అదేంటో గాని, శుక్రవారం 4 అయ్యేసరికి మాత్రం ఎదో అద్వితీయామైన శక్తి మా డెస్క్ నుంచి, వర్క్ స్టేషన్ నుంచి దూరంగా లాగేస్తూ ఉంటుంది. ఒక బలమైన ఆకర్షణ ఏదో మమ్మల్ని బయటకు విసిరికొట్టటానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ అద్వితీయ శక్తికి ధీటుగా, ఘాటుగా సమాధానం చెప్పగలిగేది కేవలం...........
'RELEASE'
రిలీస్ అన్నది కేవలం పేరుకే.. నిజానికి ఇదో బంధనం!! ఏం చెప్పేది మా సాఫ్ట్ కష్టాలు..! :(
8 comments:
:-):-)
నాకైతే శుక్రవారం రాత్రి అస్సలు సరిగ్గా నిద్ర పట్టదండీ..తర్వాత రోజు శనివారం అన్న ఆనందంలో..:-)
అదే విధంగా ఆదివారం రాత్రి అస్సలు నిద్ర పట్టదు..తర్వాత రోజు సోమవారం అన్న బెంగతో...:-)
Happy Release to you...:-)
:)
manadi soft job (peru lone lendi)
work maatram hard...
mari manushalam Stone laa tayaaravutaam... aa work chesi chesi...
hostel lo vundevaallaki ee weekends lo kooda kashtame andi..
:-(
కష్టాలలో సాఫ్ట్ కష్టాలు వేరయా.. విశ్వదాభిరామ, వినండి మోహనా :)
అఫ్టర్ రిలీజు కష్టాలు ... అత్-భు-తంగా ఉంటాయి.
ఆన్ కాల్ ఐతే నిద్రని బీఱువాలో పెట్టి కూర్చోటమే.
మనఃశ్శాంతి ప్రాప్తిరస్తూ
brilliant
Medha .. dbl brilliant
hahahha..bagundi.. :)
:D
Post a Comment