Tuesday, July 28, 2009

స్వేచ్ఛ

అనంతమైన నీ నుండి స్వేచ్ఛానుభవము గోరి, ఉప్పొంగి, విడివడి సంకల్పపు రెక్కలు తొడిగి అత్యున్నత శిఖరాలను అధిరోహించితిని..
సంతృప్తి లేని ఒంటరి జీవినై, నిత్యానందము ప్రసాదించు ప్రేమ కొరకు వెదకుచు దేశాటనము చేసితిని...
విరహమో, వేదనో మరి వెతుకులాటయో... ఒక తోడు కొరకు తహతహలాడుతు విధి చూపిన మార్గముననుసరించితిని...
ఒక నాడు, ఊహించని రీతిన భగవంతుని దూతయనిపించెడి అదృశ్య హస్త ద్వయముల ఆలింగన స్పర్శచే పరవశించితిని..
అట్టి అనుభవమును శాశ్వతముగ పొందవలెననెడి బలీయమైన కాంక్ష మనసును ముసరగ ఆ క్షణమును ఒడిసిపట్టితిని...
ప్రేమామృతము సేవించిన మరు క్షణమున అహము నశించి, స్వేచ్చా స్వాతంత్ర్యములతో ఆనందమై జాలువారితిని...
ఉరకలెత్తు నవ చైతన్యము సంతరించుకున్న నేనిదివరకెరుగని నేను సరికొత్త పుంతలు త్రొక్కుతు ప్రవహించితిని....
ప్రేమైక మైకమున, ప్రకృతితొ మమేకమై, జీవితముననుభవించినట్టి ఉత్సాహముతో సంతుష్ఠుడనైతిని...
నీ చెంత చేరవలెనన్న ఆశతో, ఎగసిపడు ఉద్వేగముతో పరుగులెత్తుతు, విజయోత్సాహముతో నీలో చేరితిని....




తండ్రీ, ఇట్టి స్వేచ్ఛను ప్రసాదించిన నీ ప్రేమ అపారము, అనిర్వచనీయము.....

5 comments:

కొత్త పాళీ said...

కొత్తగా ఈ "తిని" లు ఏంటండీ .. ఏం బాలేదు. ఈ భావాల్నే మీ మామూలు హాయైన భాషలో చెప్పేస్తే ఇంకా కమ్మగా ఉండేది

madhu said...

>>ఏం బాలేదు!

కొత్తపాళీ గారు, ఎక్కడ మార్చాలో విన్నవించుకున్నారు ! బాగుంది ! కానీ, ఈ "ఏం బాలేదు" ఏంటండీ ?

మీరిలా అనటం, ఏం బాలేదు !

మరువం ఉష said...

నా శోధన "జగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు?" http://maruvam.blogspot.com/2009/04/blog-post_06.html ముగిస్తే మీరన్న స్వేఛ్ఛ లభ్యమౌతుందేమో. ఈలోపు "ఒక తోడు కొరకు తహతహలాడుతు విధి చూపిన మార్గముననుసరించితిని..." అనుసరించి "నే వెళ్ళాలిక పరాధీన జీవితరేఖ వెంట " http://maruvam.blogspot.com/2009/07/blog-post_28.html అనుకుంటూ సాగిపోతున్నాను. మన్నించండి కవితా భాషే కాని మిగిలినవి నాకు రావు పెద్దగా.

మురారి said...

>>బలీయమైన కాంక్ష మనసును ముసరగ ఆ క్షణమును ఒడిసిపట్టితిని...
'మనసును ముసరగ'.. బాగా నచ్చింది.

>>ప్రేమైక మైకమున, ప్రకృతితొ మమేకమై, జీవితముననుభవించినట్టి ఉత్సాహముతో సంతుష్ఠుడనైతిని..
చాలా బాగుంది. చక్కగా టపాకెక్కించారు.

మోహన said...

@కొత్తపాళీ గారూ,
రాసేప్పుడు ఆలొఛించలేదండీ.. ఎలా అనిపిస్తే అలానే రాసేశాను.

@mano
ఇంతకీ మీకు ఏమనిపించిందో చెప్పలేదు. :)

@ఉష, మురారి
Thank you.