Friday, July 31, 2009

నీ ప్రశ్నలు నీవే... [Lyrics]

ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాటల్లో ఈ పాట ఒకటి. 'కొత్త బంగారులోకం' చిత్రంలోని ఈ పాట బాలు గారి స్వరంలో వినేప్పుడు మనసులో కలిగే స్పందన నా మాటల్లో చెప్పలేను. ఎందుకో ఇక్కడ భద్రపరుచుకోవాలనిపించి......

*******

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా..!

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా..!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా...
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..!

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా...
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..!

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా...
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా...
ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా...!


అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?
గతముందని గమనించని నడిరేయికి రేపుందా?
గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా..?

వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది.
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??
సుడిలో పడు ప్రతి నావ... చెబుతున్నది వినలేవా..?


పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా?
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా?
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??

కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!
అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు.
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు???
ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత...!!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా...
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా...
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా...
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా...
ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా.....

4 comments:

Rajasekharuni Vijay Sharma said...

అవును చాలా మంచి పాట. నేనూ ఎన్నో సార్లు విన్నాను.

Padmarpita said...

నాకు కూడా ఇష్టమైన పాట.

శేఖర్ పెద్దగోపు said...

నాకు కూడా...దీని లిరిక్స్ ఎవరు రాశారో తెలిపుంటే బావుండేదండీ. ఈ మద్య కాలంలో పాటల్లో సాహిత్యానికి కొంచెం పెద్దపీట వేస్తున్నరనే చెప్పొచ్చు. చంద్రబోస్, వనమాలి, అనంత శ్రీరాం వంటి వారు రాసే లిరిక్స్ కొంచెం సరళం గానూ, హార్ట్ టచింగ్ గాను ఉంటాయి. ఇక ఆ అందమైన సాహిత్యానికి కార్తీక్ దో లేకపోతే శ్రేయాఘోషల్ లేక spb గారి వాయిసో కలిస్తే ఆ పాట మదిలో ముద్ర పడిపోతుంది.

మోహన said...

రాసింది... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారండీ..