Monday, August 3, 2009

వినిపించుకోను..........

నిశ్శబ్దం నా కాలు నిలవనీయట్లేదు.
తల బద్దలయ్యేలా ఢీకొడుతున్న ఆలోచనల అలలు.....
ఆ ఘోష అస్పష్టంగా వినపడుతోంది.
ఆ హోరు చెవులను చీల్చేస్తోంది.

ప్రతి క్షణం చూసిన ఎదురుచూపుకు,
అను క్షణం గుర్తుండిపోయేలా ఇచ్చిన ఆ
పిడికెడు మాటల కన్న,
పిడి బాకుతో గుండెను ఒకేసారి చీల్చేసి పో.......

తీయని కలలను నిర్దాక్షణ్యం గా తుడిచేసే ఆ,
మాటలతో ఎందుకు ఇలా చిత్ర వధ???
ఈ మాటల మూటల భారం, జీవితాంతం!
మోయగలననుకుంటున్నావా....?

గలనో.. లేదో....... ఎవరికి నిరూపించాలి???
మోయాలేకపోతే, ఈడ్చుకుంటూ వెళ్ళను.
ఉన్న ఫళాన విదిలించుకోగలను, విడిపించుకోగలను!!
ప్రస్తుతానికి మాత్రం వినిపించుకోను.

---------------------------------------------------------------------------------------
అటు నిశ్శబ్ధం భరించలేక, ఇటు మాటలు వినలేకపోతే, వినటం మానెయ్యాలంతే...!!!

6 comments:

కొత్త పాళీ said...

Wow!

శేఖర్ పెద్దగోపు said...

ఆ మాత్రం బెట్టు చెయ్యల్సిందే!!! బావుంది.

మరువం ఉష said...

Sorry to not capture my feelings in text. But the tone used reminds me of my
ముగించేసానొక యుద్దం http://maruvam.blogspot.com/2008/12/blog-post_14.html
నీవు - నా అలక http://maruvam.blogspot.com/2008/12/blog-post_13.html
చివరకు మిగిలేదేది? http://maruvam.blogspot.com/2009/01/blog-post_15.html

మోహన said...

@కొత్త పాళీ, శేఖర్
Thank you.

@ఊష
Sorry??
మునుపటి టపాకి మీరిచ్చిన వ్యాఖ్యలో కూడా ఇలానే మన్నించమన్నారు..! దేనికి?? am I missing something??

మీ టపాలు చదివాను. బాగున్నాయి. Thanks for sharing. అయితే మీకో విషయం చెప్పాలి. నే రాసింది కేవలం ప్రేమని, ప్రేమికుడిని మాత్రమే ఉద్దేశించి కాదు. నేస్తాలూ, అమ్మ, అక్క, దైవం ఇలా ఎవరైనా కావచ్చు. ముఖ్యం గా నే వదిలి వెడతా అన్నది మాటల భారాన్నే కానీ... మనసుని, మనుషుల్ని కాదు.

భావన said...

"ఉన్న ఫళాన విదిలించుకోగలను, విడిపించుకోగలను!!
ప్రస్తుతానికి మాత్రం వినిపించుకోను."
గుడ్ అలానే వుండాలి...

kalpa latika said...

MEE MAATALA TOOTAALU YEVARINI MOTTALANI?