Wednesday, August 19, 2009

నీడలు...

మెర్కురీ దీప కాంతులను అడ్డగిస్తున్న ఆకుల నీడలు...
కిటికీ అద్దం మీద నల్లగా, మెల్లగా ఊగుతున్నాయి.

అరుగు మీద ఎర్పడ్డ చిన్ని కొలనులోని అలల నీడలు...
వరండా సీలింగ్ పై పసిడి వర్ణంలో మెరుస్తూ కదులుతున్నాయి.

బీడు వారిన మది మైదానంలో పాతుకుపోయిన జ్ఞాపకాల నీడలు...
ముఖం పై మౌనంగా, ఖాళీగా మెదులుతున్నాయి.

5 comments:

భావన said...

బాగుంది మోహన గారు.

సుజ్జి said...

Well expressed.!

మురారి said...

Wow!!..visual beauty!. మొదటి రెండు వర్ణనలు main point యొక్క గంభీరతని, లోతుని, ప్రభావశీలతని పెంచడానికి అద్భుతంగా కుదిరాయి. perfect setting/establishment.

>>ముఖం పై మౌనంగా, ఖాళీగా మెదులుతున్నాయి.
ఈ లైను నాకు ఎంత నచ్చిందో చెప్పలేను. దీనికే ఆస్తి అంతా రాసిచ్చేయొచ్చు.

మోహన said...

@భావన, సుజ్జి
Thank you.

@శేఖర్
జీవితం అంటే అన్ని రసాలూ ఉంటాయి కదా... :( ఎందుకు?

@మురారి
ఎప్పుడు రమ్మంటారు?
అదేనండీ ఆస్తి పత్రాలు పుచ్చుకోవటానికి. :P
I am so excited that you could grasp the emotion right. Thank you.

kalpa latika said...

mee aa gnyaapakala needalanu anusaristaenae kada ee kaavya veechka bayalpadinadi