Thursday, September 3, 2009

మన్-దారం


మాట రాని ఊసు ఏదొ మౌనమై చూస్తుంది.
ఊహ లేని పలుకు ఏదొ గోడమల్లె కూర్చుంది.

ఊసులకు వారధి, చూపులే కట్టేది.
చూపులకు బాట, తలపులే వేసేది.

తలపులన్ని తలుపులేసి భద్రపరచి ఉంచేవా..?
భద్రమైన మనసు చూసి నిగ్రహమని మురిసేవా..?

5 comments:

Purnima said...
This comment has been removed by the author.
శేఖర్ పెద్దగోపు said...

మొదటి నాలుగు లైన్లు అర్ధం అయ్యింది. చివరి రెండు లైన్లు మాత్రం ఎంత చదివినా నా మట్టి బుర్రకి అర్ధం కాలేదండీ. బాగుంది మీ మన్ దారం.

మోహన said...

శేఖర్ గారూ, బుర్రలో మట్టి సహజం... విత్తు నాటే సత్తా కవితలో ఉండాలి. ఏమంటారు? :)

చివర్లో ఈ లైను కలుపుకుని ట్రై చెయ్యండి.

"అని అనుకుంటోంది మబ్బు పట్టిన ఆకాశాన్ని కళ్ళార్పకుండా చూస్తూ..., మా పెరట్లోని మందారం."

ఇంకా అర్థం కాలేదా? పరవాలేదులెండి. కవిత్వం అర్థం కాకపోతే ఫీలవ్వాలేమో కానీ.. కపిత్వం, పైత్యానిదేముందీ.. :D

Thank you.

శేఖర్ పెద్దగోపు said...

మోహన గారు,
బంజర భూమి మట్టిలో కోనసిమ కొబ్బరి విత్తేసినా అది మురిగిపోతుంది కదా!! (చెత్తగా కొత్తగా అనిపించిందా మీకు) :)

నేను, మీరు(first person అయ్యి) మందారం గురించి చెబుతున్నారేమో అని అనుకున్నాను. మందారమే తన మనసు పరిచిందని అనుకోలేదు. అందుకే కవిత ఆత్మ గ్రహించలేకపోయాను.
ఇప్పుడు అర్ధం అయ్యింది. పరమానందయ్య శిష్యులు చిన్నప్పటి నుండి నా బెంచ్ మేట్స్ లెండి. :)

kalpa latika said...

talapulaki talupulu vaeyalaemani cheppakanae cheppina mee talapula "man-daaram" amogham.

......selavu