Tuesday, September 15, 2009

లైవ్ షో..

కొంచం పిండి నీలి మందు డబ్బాలో పోసుకోవచ్చు అన్నట్టున్న ఆకాశం మీద,
టైడ్! అవాక్కయ్యారా? అన్నట్టు తెల్లగా, చిక్కగా మెరిసిపోతున్న మబ్బులు.
వాళ్ళలో వాళ్ళు ఎవో కబుర్లాడుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంటే,
"నాతోనే, నాతోనే..!!" అని మురిసిపోతూ, కళ్ళు అప్పగించి టీ.వీ చూసే ప్రేక్షక పాత్రలో ఉన్న నాకు....
పగలే ఇక వెన్నెలా, జగమే ఒక ఊయలా~~~

**********

ఆవేశంతో ఊగిపోతూ బస్సెక్కిన నా పై ఆకాశంలోని ఆ మబ్బులు ఏం మందు చల్లాయో మరి! నే చేసిన గంటన్నర సేపు ప్రయాణం అచ్చం గా వాటితోనే ఏవో ఊసులాడుతున్నట్టే సాగిపోయింది. ఆ ఊసులేమిటో అంతు పట్టని నా మెదడును, "అంత కష్టపడకు, ఆ ఊసులు నాతో." అని ఏదో చెప్పి మనసు సమాధానపరచింది. గట్టు మీద నుంచి ఇసుక తిప్పలోకి దూకినట్టు, అమాంతం ఈ నేల మీది నుంచి ఆ ఆకాశాంలోకి దూకి ఆ నీలంలో మునిగిపోయి, కావాల్సినంత సేపు ఆ నింగిని అలానే పట్టుకుని ఉండాలన్న కోరిక పుట్టకపోలేదు. కానీ అలా కుదరదు కదా... వీలైనంత సేపు ఆ నీలాన్ని, ఆ మబ్బుల ఆకృతుల్ని కళ్ళతోనే తాగేసాను. ఎంత చేసినా, ఎంత చూసినా తృప్తి తీరదే!!

7 comments:

శేఖర్ పెద్దగోపు said...

>>>కొంచం పిండి నీలి మందు డబ్బాలో పోసుకోవచ్చు అన్నట్టున్న ఆకాశం మీద,
టైడ్! అవాక్కయ్యారా? అన్నట్టు తెల్లగా, చిక్కగా మెరిసిపోతున్న మబ్బులు.

హహా..హా..భలే రాసారు.

కవులుకి సంతోషం వచ్చినా కోపం కలిగినా కవిత్వం వొలాకాల్సిందే అని ఎందుకున్నారో ఇప్పుడు అర్ధమైందండీ..

kalpa latika said...

naaku kuda chaalasaarlu alanae anipinchinchindandi.mari meeru kavulu kada danni andangaa teerchdiddaru.

మోహన said...

@శేఖర్ గారూ,

రాజ్య లక్ష్మి గారి రేంజిలో నేను కవినన్న వాడిని..
ఎందుకంటే కవయిత్రి కదండీ? :P

సరదాకన్నాను గానీ.. కవి, కవిత్వం లాంటి పదాలు నాకు చాలా పెద్దవేనండీ. ధన్యవాదాలు.

@kalpa latika
మీదీ అదే మాటా? :)
Thank you.

సుజ్జి said...

:) nice..

మురారి said...

>>ఆకాశం మీద టైడ్! అవాక్కయ్యారా? అన్నట్టు తెల్లగా, చిక్కగా మెరిసిపోతున్న మబ్బులు.
భలే చెప్పారు. ఈ వాక్యాన్ని ఒక టి.వి ప్రోగ్రాంలో వాడుకోవడానికి మీ అనుమతి కావాలి.

>>ఎంత చేసినా, ఎంత చూసినా తృప్తి తీరదే!!
హ్మ్.. నిజమే!.

మోహన said...

@సుజ్జి
Thank you.

@మురారి
అంతకన్నానా... తప్పకుండా వాడుకోవచ్చు.

నీటి బొట్టు said...

nice post