ఇంత మంచి నేస్తాన్ని, నన్నొదిలిపోతావా....ప్రేమా?
***
ఎందుకొచ్చింది నాకీ అనుమానం? రాదా మరి..?! ఇదే కాదు, ఇంకా చాలానే సందేహాలొస్తున్నాయి. నాకు కష్టాలొచ్చినప్పుడు, నిజంగా నీ అవసరం ఎక్కువ ఉన్నప్పుడే నువ్వు నన్నొదిలిపోతావనిపిస్తుంది. లేకపోతే నువ్వు లేనప్పుడు, "ఇదే మంచి చాన్స్" అనుకుంటూ కష్టాలొచ్చి నన్ను చుట్టు ముడుతున్నాయా?? ఇదేమీ కాదేమో!! నువ్వున్నప్పుడూ కష్టాలున్నాయేమో.. కానీ అసలు అవి కష్టాలనే అనిపించలేదేమో... అయ్యుండచ్చు. మంచి తోడుంటే యే దారిలో అయినా, ఎలాంటి ప్రయాణం అయినా ఇట్టే సులువైపోదూ!! నేస్తం ఉంటే నరకం కూడా నైస్ గా ఉంటుంది. ఎంటీ? కాస్త ఎక్కువయ్యింది అనిపిస్తుందా? నిజంగానే చెప్తున్నా... నేస్తం దూరమైతే స్వర్గంలో కూడా కష్టాలొచ్చి కాపురముంటాయి. పరీక్షలొచ్చి పలకరిస్తాయి. కావాలంటే సుధ ని అడుగు... "సంతోషం గానే ఉన్నా, నేస్తం దూరంగా ఉంటే ఎంత వెలితిగా ఉందో.. ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. " అని మొన్న తనే అంది. అందుకే.... ఎదేమైనా, నువ్వు నన్నొదిలిపోయినా, నేను మాత్రం ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నాలో ఉన్న నిన్ను ఎప్పటికీ వదులుకోను. నా హృదయాంతరాలలో నువ్వు నింపిన మకరందాన్ని అందరికీ పంచుతూనే ఉంటాను.
------------------------------------------------------------------------------
పంచేకొద్దీ పెరిగేది ప్రేమ.
4 comments:
Template ఎందుకు మార్చారు,ముందుదే చాలా బాగుంది కదా !
hmmm...nijamea.
సింప్లీ సూపర్బ్.
మీ పాత టెంప్లేటే బావుందండి. తెల్లగా, స్వచ్చంగా మీ టపాల్లానే ఉండేదది.
@విజయమోహన్ గారూ,
మార్చేసానండి. :)
@రాధిక
హ్మ్...
@శేఖర్
మీరు ఆ టెంప్లేట్ ని మరీ అంతలా పొగిడేసాకా మార్చకుండా ఉంటానా?? మార్చేసాను. :)
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
Post a Comment