Monday, November 16, 2009

టెలీపతీ

పగటి వెలుగు వెనుక నిశ్శబ్దం గా దాగి,
రేయి కుదిర్చిన ఏకాంతంలో మౌనంగా ఊసులు దొర్లించుకుంటూ...
తలపు తళుకులన్నీ కళ్ళలో మిలుకుమనిపిస్తూ...
భావోద్వేగాన్నంతా చుట్టూ కమ్ముకున్న నిశిధిలోకి శ్రావ్యమైన యుగళగీతికలా ఆలాపిస్తున్న ఆ రెండు తారలను చూసావా?
భౌతికంగా అవి ఎంతో దూరంగా ఉన్నాయని తెలిసినా, నాకవి ఎంతో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి.


***
ఈ టపా నా టెలీపతీ దోస్త్ కి అంకితం.

5 comments:

శేఖర్ పెద్దగోపు said...

బాగుంది.. :)

సుజ్జి said...

:) nice one.

కొత్త పాళీ said...

అవును, తారలు, మనం ఊహించుకున్న దానికంటే మనకి దగ్గరగానే ఉన్నాయి :)

Bolloju Baba said...

beautiful.
thought provoking

మురారి said...

>> రేయి కుదిర్చిన ఏకాంతంలో మౌనంగా ఊసులు దొర్లించుకుంటూ...
>> భావోద్వేగాన్నంతా చుట్టూ కమ్ముకున్న నిశిధిలోకి శ్రావ్యమైన యుగళగీతికలా ఆలాపిస్తున్న..

ఆహా!!.. ఏమి మంజుల భావుకత!!.. ఏమి కల్పన!!.. చాలా బాగా నచ్చింది. ధన్యవాదాలు.