Monday, July 19, 2010

గగనకాంత

వలవో కలవో
వదిలిపోని ఎద లయవో....:)

నిదురించే కళ్ళలోన నీలి గగనమై నిలిచావు.
చుక్కలన్ని నావంటావు. చందమామ నీవంటావు.
నవ్వుతూ వస్తావు, రోజుకో వన్నెలో వెన్నెలంత పంచుతావు.
అంతలోనే సెలవంటావు. రెప్పపాటులో మాయమవుతావు.

పక్షాలెన్ని గడిచినా పుంతలెన్ని తొక్కినా
ఋతువులెన్ని మారినా రంగులెన్ని కూర్చినా
గాథలెన్ని చేరినా గమ్యమెటు సాగినా...
నేస్తమా నీకోసం
వేచిఉండగలను నే గగనకాంతనై.

3 comments:

Anonymous said...

super..!!

Pranav Ainavolu said...

ఆ మేఘాల background
పైన 'విశాల ప్రపంచం' అని పతాక శీర్షిక
ఈ 'గగనకాంత'...
సినిమా టైటిల్ పడ్డట్టు అనిపించింది ఒక్కసారి :)
ఈ టపాని ఎప్పుడూ ఇలాగే ఉండిపోయేలా stick చేయండి. చాలా బాగుంటుంది. :)

"వలవో కలవో
వదిలిపోని ఎద లయవో..."
చాలా బాగుంది!

kavita said...

mohana nee taste super