Thursday, March 27, 2008

..భద్రం..

ఎప్పుడైనా వెన్నెలని దొసిలిలో పట్టారా? భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ.. ఓ పక్క అంతా ఒలికి చుట్టూ పారుతూనే... దొసిలి కూడా నిండుగా...
గాలిని హత్తుకోవటం... ఎంత చనువు ఉంటుందో ఆ స్పర్శలో...
రోడ్డు మీద పరుగుపెట్టారా? మారథాన్ కాదు! నేస్తం తో చేయి కలిపి, సిగ్నల్ నుంచి ఆ ట్రాఫిక్ మమ్మల్ని చేరేలోపు, జమ్.. అంటు రోడ్ అటు పక్కకి పరుగుతీయటం...
శీతాకోకచిలుక ఇల్లు ఎక్కడో తెలుసా ? ఆ రంగురంగుల చిలుక ని చాలా కష్టపడి follow అయ్యి, తన రూట్ ట్రాక్ చేశా... హా.... లాభం లేదండోయ్... రెక్కలు కావలసిందే...!
ఎప్పుడైనా రాత్రి పూట, ఆరుబయట గడ్డిలో పడుకున్నారా ? ఇంజినీరింగ్ రోజులవి... నేను నా ఫ్రెండ్, ఊసులాడుకుంటూ, పాటలు పాడుకుంటూ అలానే నిద్ర పోయాం. "మా ప్రదేశాన్ని ఆక్రమించారు.." అంటూ.. చిట్టి నేస్తాలు చిన్నగా గిచ్చితే గాని మెలకువ రాలేదు సుమీ....!
మరి... ఏడుపులో నవ్వు...?? అబ్బో బోలెడు సార్లు...
నాన్న నుదిటి పై పెట్టే ముత్యమంత ముద్దు...
అప్పుడప్పుడు అమ్మ తో గిల్లికజ్జాలు....
అన్నయ్య ఇచ్చిన "I Love U" key chain..
తమ్ముడు ఇచ్చిన "Nice To have a Sister Like U" pen stand...
అమ్మమ్మ తో అంతాక్షరీలు... అక్క తో సల్సా డాన్స్లూ... చెల్లి తో పాటల కచేరీలు...
తాతయ్య తో పేకాటలు... ఫ్రెండ్స్ తో గంటల తరబడి మాటలు...
మా కన్నయ్య ఓర చూపులు... కొంటె నవ్వులు...
అలకలూ, అసూయలూ.. ప్రేమలూ, పంతాలూ...
కోట్లాటలూ, కవ్వింతలూ.. చింతలూ, చిరునవ్వులూ...

ఇలాంటి ఎన్నో చిన్ని చిన్ని ఆనందాల జాజులతో కట్టిన పూలమాల నా జీవితం.
కాలం తో కొన్ని పూవులు వాడినా.. అవి వెదజల్లిన పరిమళాలు, నా జ్నాపకాల పెట్టెలో భద్రం.

2 comments:

Anonymous said...

:-)

నాకెప్పుడూ అదొక ఫీలింగ్..What is it like to have all kinds of relations..I mean..having అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి. అన్ని రిలేషన్స్ లో ఉండే uniqueness ని అనుభవించొచ్చు..enjoy(?) చేయొచ్చు. వాళ్ళని చూస్తే కొంచెం అసూయ.

ఎందుకంటే నాకు కేవలం చెల్లెళ్ళు తప్ప మిగతా sibling relations లేవు.

అపుడప్పుడూ I terribly miss an elderly brother relation..ఇంకా కొన్నిసార్లు తమ్ముడుంటే బావుండేదనిపిస్తుంది...కాని అది కేవలం ఇండియాలో ఏదైనా పని కావల్సివచ్చినప్పుడు మాత్రమే.:-))

మోహన said...

:) independent గారూ..

నాకు ఒక్క తమ్ముడు. మిగతా అంతా పెద్దమ్మ, పిన్ని పిల్లలు. అప్పుడప్పుడు సెలవల్లో కలుస్తూ ఉంటాం. ఒక తల్లి పిల్లల్లాగే కలిసిపోతాం. నాకు అన్నా-చెల్లి బంధం అంటే చలా ఇష్టం. అన్నయ్య ఉంటే ఎందుకో చాలా ధైర్యంగా ఉంటుంది. ఒక్కో సారి నాన్న కంటే కూడా.. నా కన్నా చిన్నాడైనా.. ఇప్పుడు నా తమ్ముడే నాకు అన్నలా మాట్లాడుతుంటాడు. :)

But, yes. every relation is unique.