Wednesday, June 4, 2008

..ఎదురు(దాడి)చూపు..


వెదురూ ఉంది, గాలీ ఉంది..
మురారీ, నీవు తాకక వేణుగాన వసంతమేది..?
రాధా ఉంది, ప్రేమ ఉంది..
మాధవా, నీవు లేక రసమయ రాగబంధమేది..?

ఇంతలో కోపమొచ్చింది, పలకరించింది, కన్నీరు కురిసింది...,
ఒంటరితనం నన్ను వరదై ముంచెత్తింది...,
విరహ సాగర మధనంలో, ఎదురుచూపు హాలాహలమైంది...
నీ మోహినీ హస్తామృతమందుకునేందుకు నేను సురకాంతను కాదాయే..!
(అసురకాంతను కూడ కాదు కదా...!)

వేచి ఉన్న ఈ మానవ కాంతను అలుసుగా చూడకు...
వేచి ఉన్నానని నాపై అలుక చేసుకోకు...
అంత గిరినెత్తితివి, నీకు ఇంతి మనసు భారమా..?
ఎంత గీత చెబితివి, నీకు ఇదో చిక్కు ప్రశ్నా..?!



[ఈ ఫైల్ కి నేను ముద్దుగా ’గోల’ అని పేరు పెట్టుకున్నాను. మీకూ అలానే అనిపించిందా..? :)]

4 comments:

మురారి said...

excellent

కొత్త పాళీ said...

actually, it is pretty good.

Anonymous said...

మాధవుడిని అన్ని ప్రశ్నలు అడిగి చిక్కుల్లో పెట్టి, 'నీకు ఇదో చిక్కు ప్రశ్నా' అని అడుగుతారా? చాలా తెలివైనవాళ్ళు మీరు. చాలా బాగుంది.

మోహన said...

@Balu
:) Thank you.