Saturday, June 14, 2008

మన భవిష్యత్తు మన చెతుల్లోనే...





మన భవిష్యత్తు మన చెతుల్లోనే...

కార్పొరేట్ సంస్ధల్లో టిష్యూ పేపర్లు చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఈ టిష్యూ పేపర్ల ఉత్పత్తికి ప్రపంచం మొత్తం మీద రోజుకు కొన్ని వేల చెట్లు నరికివేయబడుతున్నాయి. కాబట్టి, నా వంతు నేను వీటిని వాడటం మానివేసాను. రోజూ రుమాలు తెచ్చుకోవటం మొదలు పెట్టాను. అప్పటి వరకూ నాకు ఎప్పుడూ అలవాటు లేకపోవటం వల్ల, కొన్ని సార్లు మర్చిపోయేదాన్ని. నా మరుపుకు ఒక excuse లేకుండా ఆ రోజు నా ఓణీనే రుమాలుగా లేకపోతే గాలికే చేతులు ఆరబెట్టుకోవటం. ఇలా కొన్ని రోజులకు నాకు రుమాలు అలవాటు చేసుకోవటం కష్టం కాలేదు. కొంత మంది నవ్వినా, కొంత మంది విపరీతం అని పెదవి విరిచినా, నా ఈ విక్రమార్క ప్రయత్నం తో కొద్ది మందిలో మార్పు తీసుకురాగలిగాను. క్రమశిక్షణతో అసాధ్యమనేది లేదు!

రోజుకు ఎంతో మంది public transportaion వాడుతుంటారు. వారిలో కొంత మందికి నెలసరి పాస్ లు ఉన్నా, టికెట్ తో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువే! టికెట్ పరిమాణమ్ చాలా చిన్నది కావటం వల్ల, అవి రీసైకిలింగ్ కి వీలవకుండా, ఎక్కువగా మట్టిలో కలిసిపొతున్నాయి. దీనివల్ల నష్టం లేకపోయినా, ఒక్క రోజులో నరికిన ఆ చెట్లను తిరిగి ఆ స్దాయికి తేవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదీ.. ఏ పుణ్యాత్ముడైనా నాటితే..! ఇలా చిన్నగా కనిపించినా పెద్ద మొత్తంలో మార్పు తీసుకురాగల అంశాలు ఎన్నో ఉన్నాయి. కానీ పరిష్కారం అంతుబట్టటంలేదు.

భావి తరాల గురించి ఎలా ఉన్నా, పర్యావరణం పట్ల మన వైఖరి ఇప్పటికైనా మార్చుకోకపోతే... మన కొంపకి మనమే నిప్పు పెట్టుకున్న వాళ్ళమవుతాం.
చేతులు కాలాక, ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు.

గొడ్డలి పట్టి, చెట్టు నరికి, నాగలి పట్టి,
నేల దున్ని, పార తెచ్చి, గంప కెత్తి..
చెమటోడ్చి, ఖర్చుపెట్టి, రాళ్ళు పేల్చి,
ఇసుక తెచ్చి, కునుకులేక, ఆగకుండా...
మేడలేపి, మిద్దెలేపి, అద్దాల గోడలకు రంగులేసి,
పూలు కట్టి, బాండు పెట్టి, కల నిజమాయెగా అనుకునేవు...

అడవి నరికి, ఇసుకతో పూడ్చి,
ఎడారి తయారు చేసి, ఎదిగానని సంబరపడేవు...
ఓ మనవుడా...
సరి చూడు, నీ పాడిని నీవే సిద్దం చేసుకున్నావు!

ఈ సమస్య మనందరిది... బత్తీబంద్ లాగనే, సామూహికంగా మొక్కలు నాటే ఉద్యమం మొదలవ్వాలి. రోడ్ వెడల్పు చేయటానికో, మరే కారణం చెతనో చెట్లు నరకవలసి వస్తే, వేరే చోట పది మొక్కలు నాటాలి అనే నిబంధన ఉండాలి. వాటిని సంరక్షించాలి.

6 comments:

Anonymous said...

Sorry if I commented your blog, but you have a nice idea.

Hema said...

Nice Visala ... I never knew that you can wrire such beautiful Telugu. Its really a pleasant surprise . :-)

చిన్నమయ్య said...

అద్భుతం. చివరంటా చదివితేనే గానీ, మెలిక బోధ పళ్లేదు. ఇలాకూడా ఆటో వాడిని "దారికి" తీసుకురావచ్చన్నమాట. తెలుగులో కూడా రాయండి. అభినందనలు.

Kathi Mahesh Kumar said...

బాగా చెపారు. కంప్యూటర్లు వచ్చాక పేపర్ ఉపయోగం తగ్గి ‘పేపర్ లెస్’ ఆఫీసులౌతాయని చాలా మంది అనేవారు.కానీ నిజానికి పేపర్ ఉపయోగం పదింతలు పెరిగింది.ప్రతి అనవసరమైన దానికీ ప్రింట్లు..ప్రింటుచేసిన ప్రతిదానికీ కాపీలు ఇలా పెరుగుతూ పోతూనే ఉంది. ఈ వృధా తగ్గించి వృక్షాల్ని రక్షించడానికి ఒక విధానమైతే ఖచ్చితంగా అవసరం.

ఇక వృక్షాలు నాటడమనేది ఫ్యాషన్ గా ప్రతి ఒక్కరూ చేస్తున్నా,కావాల్సిన డ్యామేజ్ కంట్రోల్ కావడం లేదన్నది అందరూ అంగీకరించే విషయం.కాబట్టి ఇదికూడా ఒక ప్రణాలికాబద్దంగా చెయ్యాల్సిఉంది.

చెట్లు నరకవలసి వస్తే, పది చెట్లునాటే నిబంధన ఆల్రెడీ ఉంది. పాటించేవారే లేరు. మీరి Andhar Pradesh Water Tree and Land Act (AP WALTA-2004) చదవగలరు.

చిలమకూరు విజయమోహన్ said...

నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మన నాయకులు ఏ క్రార్యక్రమప్రారంభానికైనా చెట్లు నాటుతూ వుంటారు వాటిని తర్వాత శ్రద్దగా కాపాడే వారే లేరు వాళ్లు నాటిన మొక్కలే సరిగా కాపాడబడి వుంటే ఇప్పుడీ పరిస్థితి ఉండేదికాదు.

మోహన said...

Thanks hema..

మహేశ్ గారు.. ఇలా నిబంధనలు కాగితాలకే పరిమితమయినంత కాలం మార్పు గురించి కనీసం ఊహించలేం. ఎవరో (ప్రభుత్వం) వస్తారు, ఏదో చేస్తారు అని చూస్తూ ఉండకుండా, మన వంతు కౄషిని, మీరన్నట్టు ప్రణాలికాబద్ధంగా చేయాలి. తాపత్రయం కార్యరూపం దాల్చాలి.

విజయ్ గారూ.. నిజమే.. రాస్తున్నప్పుడు, నాకూ అదే ఆలోచన వచ్చింది. విత్తులు నాటే ముసలి తాతయ్య కథ కూడా.. పెద్దలు ఊరికే పెట్టారా అలాంటి పద్ధతులు..?
నాటిన వాటిని సంరక్షించటం తరువాత.. ఫోటోలు తీసే పని అయ్యాకా ఒక గంట అయినా ఉంచుతారో లేదో నాకు సందేహమే!