Monday, June 30, 2008
నను నే కోల్పోయి పొందిన వైనం...
బీడువారిన నా మది మైదానంలోకి అనుకోని అతిధిగా వచ్చావు. మేఘమై, ప్రేమగా కురిసావు.
నా ప్రతి అణువులో జీవం నింపి, వసంతాలను ఇచ్చావు. స్నేహమనే కంచె కట్టి, తోటమాలివై పరిరక్షించావు.
నా ఒడిని అనురాగ కుసుమాలతో నింపావు. వాటిని మాల కట్టి అందియ్యబోతే, అది ’నీద’న్నావు. ’నా దారి వేరు’ అన్నావు.
’నను నీ వెంట రానీ’ అంటే, ’నీకు ముల్లు దిగితే నే చూడలేన’న్నావు. నాకు దగ్గరగా ఉంటూనే నన్ను దూరంగా ఉంచావు.
నీ మాట కాదనలేక, నిను వీడి ఉండలేక నే విలవిలలాడితే, నాపై కఠినత్వం నటించావు. గుడ్డిగా నీ మాటను మాత్రమే విన్నాను.
అంతా శూన్యమయింది. నీ చిరునవ్వు కిరణం లేని ఆ చీకటిలో, దారి కానక, కాలు జారి విషాద లోయలో పడ్డాను. భయం ముసిరేసింది.
ఒంటరిగా ఉన్న నన్ను చూసి వెక్కిరించింది. ఎగతాళి చేసింది. తనదే జయం అంది. ఇక ’నువ్వు నా బందీవి’ అంది.
నమ్మకాన్ని ప్రమిదగా చేసి, నీ జ్ఞాపకాల వత్తిని వెలిగించి, ముందుకు నడిచాను. ఒంటరితనం పరుగుతీసింది. భయం భయపడి పారిపోయింది.
నీకై వెతుకుతూ, నడక సాగించాను. కంటి తడి ఆరి, నీటిపొరలు కరిగాక, నీ మాట కాక, నీ గొంతు వినిపించింది.
ఒక్క సారిగా శూన్యం, పూర్ణమయింది. నాలో అంధకారాన్ని చెదరగొడుతూ నవోఉదయం నాలో చైతన్యం నింపింది.
అంత ప్రేమను గొంతులో దాచిన నువ్వు గరళ కంఠుడిలా తోచావు. భగవంతుడు నాకై పంపిన ప్రేమ దూతలా అనిపించావు.
ఆ నింగి వీడి, అలజడి అలలను ఛేదించి, సాగర గర్భాన దాగిన నాలో స్వాతిచినుకై చేరి ముత్యమై మెరిసావు.
--------------------------------------------------------------------------------------------------------------------------------
నీ ప్రేమ వేడిలో నా అహం కరిగి ఆత్మ జ్యోతికి ఆహుతయింది, ఇంధనమయింది. ఆ వెలుగులో నా ఉనికి స్పష్ఠమయ్యింది.
ప్రేమ లో నన్ను నేను కోల్పోతున్నాను అనుకున్నానే కానీ, నిజానికి నన్ను నేను పొందుతున్నానని అప్పుడే అర్థమయింది.
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
చాలా బాగుంది. హృదయానికి హత్తుకొనేలా వుంది. చివరి 3 పంక్తులు నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అహం వదలితేనె ప్రేమ అని, చాలా బాగ చెప్పారు. 'శూన్యం ',' సూన్యం ' వీటిలో ఏది ఒప్పు ఏది తప్పు దయచేసి ఒకసారి CHECK చెయ్యండి. దయచేసి క్షమించండి.
'శూన్యం' మే ఒప్పు. సరిదిద్దాను. పొరపాటును తెలియచేసారు. క్షమాపణలు అవసరం లేదు. మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు చైతన్య గారు.
చాలా బాగుంది.
Beauty!! Love as means of self realization.. liked the concept!!
Hey.. the lines are too lengthy.. why don't u format them to short sentences. This is my suggestion. If you wanted it that way, leave it!! :-)
@Mahesh
Thank you.
@Purnima
Thank you. I dont go for lengthy lines ususllay. But here, yes. I wanted it that way. As I felt that expression in each line gives an image in mind. will remember it for future posts ;-)
శూన్యం పూర్ణం అవ్వడం ... చాలా బాగుంది
@Balu
Thank you
ఏంటబ్బా నాతో నేను మాట్లాడుకుంటున్నట్టు ఉందీ?!!!
మోహన గారు చాలా బగుంది...
నీ వెంట వస్తాను అంటే ,నీకు ముల్లు దిగితే నే చూడలేను.....ఈ లైన్ నాకు తెగ నచ్చేసింది..
ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బగుంది...నను నేను కోల్పోయి పొందిన వైనం...
కీప్ పోస్టింగ్..నైస్ వన్..
@దిలీప్ గారూ..
నేను రాసిన దానిలో మిమ్మల్ని మీరు పొల్చుకోగలగటం నాకు చాల సంతోషంగా ఉంది. :) నేను ఇక్కడ భూమికి ఒక ఇంచి పైన ఉన్నాను. ;)
ధన్యవాదాలు.
@ మీనాక్షి
Many Thanks :)
Post a Comment