అమ్మ ప్రేమ గురించి ఎంతో చెప్తారు, ఎన్నో కవితలు రాస్తారు...
మరి నాన్న ప్రేమ గురించి ఎవరూ మాటాడరే..? ఒక్కరూ రాయరే ?!!
నేనూరుకోను! ఇప్పుడే రాసేస్తాను..!!
****
నాన్నా, మీకు తెలుసా...
అమ్మ నాపై గర్జిస్తే, మీరు నా కోట గోడ.
అమ్మ కన్ను ఎర్రజేస్తే, మీ హస్తం నాకు అభయ హస్తం.
అప్పుడప్పుడు దొరికే చిన్ని ఏకాంతంలో, ప్రపంచమంతా మన ఊసుల్లోనే..
గణితం నుంచి తత్వం వరకు, శాస్త్రం నుంచి సాహిత్యం వరకు లెక్కలేని కబుర్లెన్నో..
నాన్న మల్లే కాక, నేస్తమై మెలిగారు. నడకతో పాటు నడత కూడ నేర్పించారు.
నా ప్రతి కార్యంలోనూ వెన్నంటే ఉండి, అండగా నిలిచి, "నేనున్నాను కదా.." అని ధైర్యాన్నిచ్చారు.
నా చిన్ని చిన్ని విజయాలను ప్రోత్సహిస్తూ, "నువ్వెంత మంచి తల్లివో, నిన్ను చూస్తే నాకు ఎంత గర్వమో.."
అంటూ పొగడ్తలతో ముంచేస్తారు. నా తల నిమిరి, నుదుటిపై చిట్టి ముద్దులిస్తారు.
తండ్రీ, కూతుళ్ళ అనుబంధాలు, ఆదర్శాల గురించి మాటాడితే...
ఆ నెహ్రూ, ఇందిరలకు ఏ మాత్రం తీసిపోం మనం. ఒకడుగు ముందే ఉంటాం!
జోల పాడలేకపోయినా, నేను ఎన్ని సార్లు నిదరొవలేదు మీ ఒళ్ళో..?!
పెదవి విప్పి చెప్పకపోయినా, ఆ లోటు తెలియలేదు నాన్నా మీ ప్రేమలో...!
-----------------------------------------------------------------------
అంటకుండా, ముట్టకుండా... మాటలస్సలు లేకుండా....
మౌనంగా కళ్ళతో ముద్దాడతారు నాన్న...!!
10 comments:
కళ్ళతో ముద్దాడడం, చాలా బాగా చెప్పారు.
నాన్నలగురించి చెప్పాలంటే,కవిత కాదు పుస్తకం రాయాలి.
మంచి కవిత. మీరు ఓ గీత వేసి తరువాత రాసే వాక్యాలు పైనున్న కవితని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. బహుశా వాటినే "qualifiers" అంటారేమో!
నేనూ మా నాన్న గురించి ఓ సంఘటన పంచుకున్నా ఈ క్రింది లంకెలో చూడండి.
http://parnashaala.blogspot.com/2008/06/blog-post_15.html
good for you.
చాలా బాగ వ్రాసారు మోహన.
Good One. Very good one.
Good One. Very good one.
మరే... నాన్న నాన్నే!
బాగుంది.
Thank you everyone.
Good one Mohanaa!! People say attack is my first defence and that is what my father taught me.
You keep writing,
Purnima.
I love you నాన్న సూపర్ msg bro
Post a Comment