ఏది తప్పు ?
తప్పు చెయ్యటం తప్పా ?
చేసిన తప్పు ఓప్పుకోలేకపోవటం తప్పా ?
తప్పు చేసిన వారిని చూసి నవ్వటం తప్ప,
తప్పు ఒప్పుకున్నవారిని ఆదరించలేకపోవటం తప్పా?
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో..
ఎదో ఒక సమయంలో, ఎదో ఒక విషయంలో,
కనీసం ఒక్కసారైనా..చిన్నదైన, పెద్దదైన...
'తప్పు' అనేది చేసే ఉంటారు. అది సహజం.
కానీ అది పక్క వాడు చేస్తే...,
తక్కువగా చూసో లేక ఎగతాళి చేసో,
వారి ఆత్మ గౌరవాన్ని చంపెసే మన సంస్కారం ముందు
వారి తప్పులేపాటివి?
తప్పు ఒప్పుకోవటానికి ఎంతో ధైర్యం కావాలి.
అది ఎదుర్కోవాలంటే మనలో ఎంతో ప్రేమ ఉండాలి.
------------------------------------------------------------------------------------
తప్పు తో పాటు, తప్పు చేసిన వాడిని కూడ వెలేస్తే ఎవరు మాత్రం చేసిన తప్పు ఒప్పుకునేందుకు ముందుకొస్తారు ?
9 comments:
చాలా complex విషయాన్ని, సూటిగా చెప్పటానికి యత్నించావ్. తప్పును మొదట తప్పుచేసినవాడి కోణం నుండీ చూసి అర్థంచేసుకోవడం empathy కి మొదటి మెట్టు. కానీ మనం judgment ఇవ్వడంలో బిజీగాఉండి empathize చెయ్యలెకపోతున్నాం అనుకుంటా!
Good one Mohana!. Your poem reminds me of what Vemana said on the same lines.
మంచి కవితాత్మకమైన ప్రశ్న..అడగండి మరిన్ని..
బాగుంది మీ కవిత.. నాకింకా కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది..
అందరూ తప్పనేది మనకి ఎందుకనిపించదు అలా ఒక్కోసారి?
మనకి తప్పని తెలిసినా ఎందుకు చేయాలనిపిస్తుంది?
మనిషంటేనే తప్పొప్పుల సమ్మేళనం కదా.. మరి తప్పులకెందుకంత ప్రాముఖ్యం.
అసలు చేసింది తప్పా కాదా అని బయట నుండే నిర్ణయించేస్తాము.. వాళ్ళల్లోకి ప్రవేశిస్తే చాలా సార్లు మనం అనుకునే తప్పులు తప్పులు కావసలు..
హమ్మ్... మిమల్ని అడగడం లేదివ్వన్నీ.. :-)
"తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు"
మరియు
"ఎర్ర గురివింద తననలు పెరుగనట్లు .."
మరియు
"ఏ పాపం చేయని వాడే ముందుగ రాయి విసరాలి"
బాగుందండి.
@ మహేష్
అసలు judgement మాత్రం ఎందుకు ఇస్తున్నాం అంటారు ?
@ఫ్రశంత్
నెనర్లు.
@పెదరాయ్డు
తప్పక ప్రయత్నిస్తాను. నెనర్లు.
@పూర్ణిమ
బాగుంది మీ కవిత..
థాంక్స్.
>>నాకింకా కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది..
Sure. Go ahead.
>>మిమల్ని అడగడం లేదివ్వన్నీ.. :-)
కానీ మీరు ఇన్ని ప్రశ్నలు నా బుర్రలో నెట్టాకా, నాకు తోచిన సమాధానం ఇవ్వకుండ ఉంటనా? ;)
>>అందరూ తప్పనేది మనకి ఎందుకనిపించదు అలా ఒక్కోసారి?
తప్పు, ఒప్పులు సాపేక్షిక మైనవి. ఒక్కొక్కరికి ఒక్కోల అనిపించటమె మరి జిందగిలో మసల దట్టిస్తుంది.
>>మనకి తప్పని తెలిసినా ఎందుకు చేయాలనిపిస్తుంది?
తప్పని తెలిసినా చేస్తున్నాం అంటే మనలో ఎదో బలహీనత మన విచక్షణా జ్ఞానాన్ని కప్పేస్తోందన్నమాట.
>>మనిషంటేనే తప్పొప్పుల సమ్మేళనం కదా.. మరి తప్పులకెందుకంత ప్రాముఖ్యం.
పడి లేవటమే జీవితం. పడటం అనేది చేసిన తప్పైతే, లేవటం దానిని సరిదిద్దుకోని ఎదగటం. మన ఎదుగుదల మనం మనలో సవరించుకున్న తప్పుల పై అధారపడి ఉంది కాబట్టే వాటికి అంత ప్రాముఖ్యత అని నా అభిప్రాయం. ఇక్కడ ఎదుగుదల కూడా సాపేక్షకమయినది అని గుర్తించగలరు.
>>అసలు చేసింది తప్పా కాదా అని బయట నుండే నిర్ణయించేస్తాము.. వాళ్ళల్లోకి ప్రవేశిస్తే చాలా సార్లు మనం అనుకునే తప్పులు తప్పులు కావసలు..
మళ్ళీ ఆలోచించండీ. వాళ్ళాలోకి ప్రవేశించటం అంటే, వారి స్థితి లో ఉండి, మన జ్ఞానాన్ని వాడటం. అలా చెయ్యగలిగితే, తప్పు తప్పుగానె కనిపిస్తుంది. కాని అది వారు ఎందుకు చేసారో అర్థమవుతుంది.
రోగ లక్షణాలకు మాత్రమే కాక అసలు రోగానికి మందెయ్యటం ముఖ్యం కదా...
@కొత్త పాళీ said
Thank you.
తప్పునే వెలివేయాలి, తప్పు చేసిన వాడిని క్షమించాలి. ఇది నేను నేర్చుకున్న విషయం.
మంచి కవిత్వం... ఏది తప్పు.. ఏది తప్పు.. అని చెప్పి .... తప్పంటే ఏమిటో సూటిగానే చెప్పారు
తప్పుల్లేని కవిత
బొల్లోజు బాబా
Post a Comment