Sunday, July 20, 2008

"దేవుడు ఎక్కడ ఉన్నాడు?"

యశిర్ గారి బ్లాగులో "హిందువులు ఎంత మంది దేవుళ్ళు ఉన్నారొ వారికే తేలియదు" అన్న టపాకి నే రాసిన వ్యాఖ్య తాలూకు సారాంసాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ టపా రూపంలో ప్రచురిస్తున్నాను.
-----------------------------------------------------------------------------------

"దేవుళ్ళు ఎంత మంది ?"
దేవుడొక్కడే..!

ఐతే.. "ఆ ఒక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు?"
దేవుడొక్కడే అయినా.. అతడు మనం ఊహించుకున్నట్టూ ఒక్క మనిషిలోనో, ఒక్క ప్రదేశంలోనో, ఒక్క మతంలోనో, ఒక్క వస్తువులోనో.. ఇలా యే ఒక్కదానిలోనో కాక, సమస్తమయిన విశ్వం కూడా ఆతడి శక్తితో నిండి ఉంది.

మరి "హిందూ మతంలో ఇంత మంది దేవుళ్ళు ఎందుకున్నారు?"
మనిషి తో సమానంగా గాలి, నీరు, నిప్పు, గ్రహాలు, నక్షత్రాలు, తాబేలు, చేప, సింహం, కూర్మం[పంది], ఏనుగు, పాము, ఎలుక, గుర్రం, చెట్లు ఇలా... ప్రకృతిలో భాగమయిన ప్రతి జీవిలోనూ భగవంతుని శక్తి జీవ శక్తిగా వెలుగొందుతుందనే నిగూఢమయిన సత్యం చెప్పటానికే హిందూ మతంలో ఇన్ని దేవుళ్ళు [ఇది నా అవగాహన]. తోటి వారిని [ప్రకృతి లో జీవరాసులన్నీ తోటి వారే కదా..!] గౌరవించి, ప్రేమించాలన్న విషయం ఇంతకన్నా సులువుగా చెప్పగలమా? ఇది అర్థం చేసుకున్న వారికి ప్రతి వారిలోనూ భగవంతుడు కనిపిస్తాడు కదా!


మతం అంటే?!
మతం అనేది మనం దేవుడిని చేరుకునేందుకు [అర్థం చేసుకునేందుకు] మన పూర్వీకులు మన కోసం వేసిన మార్గం. ఆహార విధానాలు, పదార్థాలు వేరైనా, గమ్యం ఒక్కటే! ఆకలితో ఉన్న వారికి ఏదైనా గొప్పదే! భగవంతుడిని చేరాలనే తపన ఉన్న వారికి ఏ మతమయినా (మార్గమయినా) గొప్పదే! ఈ రకమయిన ప్రయాణంలో వేరు వేరు మతాలకు చెందిన మనమంతా తోటి ప్రయాణికులం. మన అనుభవాలు పంచుకుందాం. ప్రతి ఒక్కరూ తోటి వారి భావాలను గౌరవించుకుందాం.

ఏ మతమయినా సూచించింది "మానవత్వాన్ని". మన దారులు [మతాలు] వేరైనా అవి కలిసిన కూడలి "మానవత్వం". ఎవరి దారి గొప్పది అని వాదించుకుంటూ, గెలవాలన్న ప్రయత్నంలో మనం దారి తప్పుతున్నాం అని నాకనిపిస్తోంది.

అలోచించండి..!

20 comments:

Anonymous said...

మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

బాగుంది.
ప్రకృతి ఆరాధన మూలంగా గల ఆదికాలంలో అన్ని ‘ప్రకృతి శక్తుల్నీ’ పూజించడం జరిగేది. అదే రూపాంతరం చెంది ‘హిందూ’ మతమయ్యేసరికీ అసలు మతలబులు మాయమై, విగ్రహాలు వెలిసాయి. అక్కడి నుండీ మొదలైంది ఈ confusion.

ఇలాంటి పరిస్థితే మహమ్మద్ ప్రవక్త సమయంలో కలిగింది. మన హిందూ మతం లాగానే,మూల సిద్ధాంతాలతో సంబంధం లేని విగ్రహారాధనలో అనవసర సమయం,దాని చుట్టూ పెరిగిన వ్యవస్థలకు బలమూ పెరిగిన నేపధ్యంలోనే ఆ ప్రదేశంలో ఇస్లాం పుట్టింది.కనుక వారు విగ్రహారాధనను ఖండించడంలో అర్థముంది.

కాకపోతే యాసిర్ గారు తనకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పక, తన అజ్ఞానాన్ని మొదట బయటపెట్టడంతో ఇలాంటి సమస్యలొస్తున్నట్టున్నాయి. అదే సలహాని నేను వారికీ ఇచ్చాను. మనలో చాలా మందికి ఇస్లాం పట్ల అపోహలే తప్ప అవగాహన లేదు. అది వారు పెంచగలిగితే మంచిదే. we shall be rich by another religion.

yasir said...

నెను విగ్రహరాదనకు మత్రమె వ్యతిరెకిని,
సమస్తమ్ దెవుడి ది,
అటువంటి దెవుడి ని వదలి
రాయీ,రాప్ప,చెట్టు ,చెమా.
పాపమ్ మహపాపం.

దేవుడు ఒకడె,
అయన శక్తివంతుడు,ఎవరి అవసరమ్ లెని వాడు.
హస్బి అలహ్హు

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగా చెప్పారు.

చిలమకూరు విజయమోహన్ said...

@yasir,సమస్తమూ దేవుడిదే అన్నదాంట్లో ఎవరికీ అనుమానం లేదు.దేవుడిచ్చిన ప్రతి వస్తువులో ఆయనను చూసుకోవడంలో తప్పులేదుకదా!

Purnima said...

Thought provoking.. post!!

Naga said...

దేవుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసుకునేంత వరకు అందరికి ఈ గోల తప్పదు! అది తెలియకుండా (ఈ విషయంలో) మనం ఏం మాట్లాడినా వృథా!

ఉదాహరణకు - దేవత ఒక్కతే, ఆమె శక్తివంతురాలు, ఎవరి అవసరం లేనిది - ఎలా అనిపిస్తుందో చూడండి :)

Anil Dasari said...

దేవుడున్నాడు అనుకునేవాళ్లతోనే గొడవంతా - మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్ప అని. నాస్తికుల పనే బాగుంది. ఉన్నాడో లేడో తెలీని దేవుడి గురించి ఇన్ని గొడవలెందుకు? 'నా' అనేదంతా గొప్పదేనని విర్రవీగే గుణం మనిషి సొంతం. ఆ భావాన్ని దూరం చేసినప్పుడే విశ్వమానవ సమానత్వం.

కొత్త పాళీ said...

నాగరాజా, నువ్వు ఊరుకోవుగా! :)
అబ్రకదబ్ర గారు చెప్పింది బాగుంది. కాని అసలు గొడవంతా అక్కడే కదండీ .. నా అనేది వదులుకుంటే ఇంకేముంది? :)

మోహన said...

@Anony..
Thank you

@Mahesh
నాకు చరిత్ర పెద్దగా తెలియదు. మీరు మీ అభిప్రాయం, కొంత చరిత్ర కూడా తెలిపినందుకు ధన్యవాదాలు.

@Yasir
>>నెను విగ్రహరాదనకు మత్రమె వ్యతిరెకిని,
మీరు మీకు నచ్చిన మార్గంలోనే వెళ్ళండి. విగ్రహారాదన చేయమని గానీ, ఒప్పుకోమని గానీ మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టరు. అలాగే మీరు కూడా తోటి వారితో ఏకీభవించకపోయినా, వారు ఎంచుకున్న అభిప్రాయలను గౌరవిస్తే చాలు. కేవలం ఒక మనిషి ఇంకో మనిషికి ఇచ్చే గౌరవం తప్ప, ఇందులో మతం అనే మాట లేదు.

>>సమస్తమ్ దెవుడి ది,
అటువంటి దెవుడి ని వదలి
రాయీ,రాప్ప,చెట్టు ,చెమా.
పాపమ్ మహపాపం.

"సమస్తం దెవుడిది" అంటూనే రాయీ, రప్ప, చెట్టూ, చేమ అని కొన్నిటిని "దేవుడి" నుంచి విడగొడుతున్నారు. ఒక సరీరంలో వేరు వేరు భాగాలు. పంటికి నొప్పొస్తే, చేయి ఓదారుస్తుంది. కాలికి దెబ్బ తగిలితే కన్ను నీరు కారుస్తుంది. ఇలా దేనికది తన పని చేసినప్పుడే సఖ్యత. అందం. అర్థం! నేను, మీరూ కూడా దేవుడి సొత్తే..! అలాగే రాయి, రప్పా కూడా.. ప్రకృతిలో అన్నీ వేటి బాధ్యత అవి నెరవేరుస్తున్నాయి. అలుపులేకుండా. మిగతా జీవులకు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి.
మరి మనిషి ? మానవత్వాన్ని, తనకి భగవంతుడు ఇచ్చిన శక్తిని, బుద్ధిని ఎంతవరకు మంచికి వాడుతున్నాడు?
ఒకరి పాప పుణ్యాలు లెక్కించటానికి మనం ఎవరం?
"సమస్తం దెవుడిది" కదా! ఆ లెక్క చూసే బాధ్యత ఆయనికే వదిలేయటం మంచిదేమో!

@Vijay mohan, Purnima
Thank you.

మోహన said...

@నాగరాజా
దేవుడు ఒక్కడే అన్న మాటని మీరు లింగం బేధం తో చూస్తున్నారా? అన్నిటిలోనూ ఉన్న శక్తి ఆడ, మగ అని చెప్పగలమా ? నా శరీరంలో కుడి, యడమ భాగాలు ఉండచ్చు. కానీ నేను కుడా? ఎడమా? చెప్పగలరా ?

@అబ్రకదబ్ర
నాస్తికులు కూడా తమ ఆలోచన సరైనదని వాదిస్తూ ఉంటారు. :) ఒక్కోసారి ఉన్నాడా దేవుడు ? ౠజువు చెయ్యండీ అంటూ సవాళ్ళు విసిరిన సందర్భాలూ లేకపోలేదు. :)

@All
దేవుడిని నమ్ముతున్నామా లేదా ? నమ్మితే ఎంత మంది ? ఏ మతం, ఏ కులం? ఏ లింగం? లాంటి ప్రశ్నలు వేసుకునే ముందు, ఇవి ఎంతవరకు అవసరమయిన ప్రశ్నలు? ఈ ప్రశ్నలకు దొరికే సమాధనాల వల్ల నేను ఏమి సాధించాలి అనుకుంటున్నాను ? అన్నది ఒక సారి ఆలోచించల్సిన విషయం.

మోహన said...

@కొత్త పాళీ గారూ..

నిజమే 'నా' అనేది లేకపోతే.. ఇంక ఏముంది ? :)

Anil Dasari said...

మోహన,

మీరపార్ధం చేసుకున్నట్లున్నారు. 'నాస్తికుల్లో, వాళ్లలో వాళ్లకి గొడవలుండవు' అనేది మాత్రమే నా ఉద్దేశం - దేవుడున్నాడా లేదా అనే విషయంలో వాళ్ల వాదనని సపోర్ట్ చెయ్యటమో, వ్యతిరేకించటమో కాదు.

వేణూశ్రీకాంత్ said...

మంచి పోస్ట్ మోహన గారు...

రాధిక said...

200% agree with u mohana garu.well said

Anonymous said...

దేముడు సర్వ శక్తి సమన్వితుడు. ఆయన లేని చోటు లేదు. అలాంటప్పుడు రాయి, చెట్టు, కొండ, జంతువులు వేటిని పూజించినా ఆయనని పూజించినట్లే.ఇది తప్పు అంటే దేముడి ఉనికినే ప్రశ్నించడం అన్నమాట.

Pradeep Palem said...

A little bit about Hindusim ( For Mohana,Yasir & other frens ) -

1)One God : Yes as in other religions Hinduism has only one God.Ie,Govinda (Sri Maha Vishnu)( In Hinduism Bhagavan is He who possesses without limit the six types of opulence – strength, fame, wealth, knowledge, beauty and renunciation ) and others are demigods (Vinayaka,anjeneya,garuda etc ) and Gurus ( Saibaba etc ).

2) Image worship - This is one type of worship and this is not not every thing in Hindusim .For instance i cannot step on a photo of my father,because i see him in that.It is more or less my father.This is the theory behind the Image worship.

Yaser-U may think that i am a fool worshipping the photo.But its wrong.I am worshipping my father in that.

3) Whether God is there r not :Pls think - A just born calf will apporach its mother ( Cow ) and drink milk with in a span of one hour.Who told to that just born calf that cow is its mother and has to take milk as its food and that too from breast.

It is because of creation ( Srusti ).If creation ( srusti ) is there means creator ( Srustikartha) should be there.And that person is God called with different names in different religions like Govinda/Allah/Jenovah etc.

So pls never think whether God is there r not in your future life.

If any doubts u can ask me...

Anonymous said...

నరేంద్ర భాస్కర్ S.P
నమస్తే
యాసిర్ గారి తెలుగు గొప్పా? ఉర్దూ గొప్పా? టపాకు నేను రాసిన వ్యాఖ్యానం మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు, దేవుడి గురించి మీరు రాసిన టపా బాగుంది, దేవుడున్నడా? లేడా? అనేప్రశ్నకన్నా మనిషికి తన నమ్మకాని ప్రశ్నించడం చాలా ఇబ్బంది పెడుతుంది కామోసు. డేవుడు ఉన్నాడు అనేది ఎలా ఒక నమ్మకమో దేవుడు లేడు అనేది కూడా ఒక నమ్మకమే కదా?
నెనర్లు,

మోహన said...

@అబ్రకదబ్ర
లేదండీ.. అపార్థం ఎమీ లేదు. అది నా అభిప్రాయం మత్రమే. Pure discussion. Thats it.

@వేణూ శ్రీకాంత్, @ రాధిక
Thank you.

@Mallik
Right!

@Chandra
Thanks for sharing your opinion.

@నరేంద్ర భాస్కర్
నమస్తే..
"మనిషికి తన నమ్మకాని ప్రశ్నించడం చాలా ఇబ్బంది పెడుతుంది కామోసు"
అక్కడే కదండి మరి.. అసలు చిక్కంతా..?
లేకపోతే.. నిజంగా ఉంటే, ఏ దెవుడైనా "నువ్వు పో, నన్ను నిరూపించు." అని చెప్తాడా ? అసలు దేవుడికి అది అవసరమా ?

మనతో పాటు మనం నమ్మే దేవుడిని కూడా అహంకారిగా చిత్రీకరిస్తున్నాం కదా..!! :)

ఏమంటారు ?

BaluPramu said...

devudu unndu, manishi ki srusti ni intha andham ag srustinchadam chetha kadhu, dheni aina intha samanam ga ivvledu,bcoz a man is a dirty man untill he knows god's power.... srustiloni vi, manishi samanam kadhu... devudu unnada ani theliyani meeku, devudu evaro ela thelusukonagalaru? kabaddhar, be ware of the Almighty God...