Wednesday, July 23, 2008

ఓ పూవును నేను....

సిగ్గు మొగ్గలేస్తాను, సింగారంగా విరబూస్తాను.
పరిమళం వెదజల్లుతాను, పది మందినీ ఆకర్షిస్తాను.

నాలో ఎంత సొగసో, నేను ఎంత సున్నితమో..!
నాకై ఎన్ని రంగులో, నాపై అందరికీ ఎంత మక్కువో..!

ప్రతి పండక్కీ నేనుంటాను, ప్రతి పందిరినీ పలకరిస్తాను.
మగువలను ముస్తాబుచేస్తాను, విజేతలను అభినందిస్తాను.

అమాయకత్వమే తప్ప, అహం లేనిదానను.
పాడిని సైతం అలంకరిస్తాను, పీనుగులనూ కౌగిలిస్తాను.

ప్రతిచోటా ఇమిడిపోతాను, ప్రతివారికీ ఒదిగుంటాను.
ఇమిడిన చోటల్లా అలుసవుతాను, ఒదిగిన సారల్లా గాయపడతాను.

పీక నులిమినా కాదనను, సుది దించినా వద్దనను.
ఎక్కడున్నా.., ఉన్నదంతా పంచుతాను.

ఓ పూవును నేను....
చిరునవ్వుతో జీవిస్తాను, చిరునవ్వుతో మరణిస్తాను!!

14 comments:

Srividya said...

Beautiful...
ప్రతిచోటా ఇమిడిపోతాను, ప్రతివారికీ ఒదిగుంటాను.
ఇమిడిన చోటల్లా అలుసవుతాను, ఒదిగిన సారల్లా గాయపడతాను.

chaalaa baagaa raasaaru.

చిలమకూరు విజయమోహన్ said...

దేవుడి మెడలో అలంకరింపబడ్డ పుష్పమాలలా వుంది మీ కవిత.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది మోహన గారు

ప్రపుల్ల చంద్ర said...

చాలా బాగుంది!!!!

Kranthi M said...

తలలో పెట్టుకునే పువ్వులో ఎన్ని కోణాల్ని చూసార౦డి మీరు.simply superb.'అలుసవుతాను ' అ౦టే అర్ధ౦ కాలేదు.చెప్పగలరా?plzzzz

ఏకాంతపు దిలీప్ said...

మోహనా,

మీ "అపురూప జ్ఞాపకం" , ఈ "ఓ పూవును నేను" అందంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆ పాపలో నవ్వు పుట్టించే ప్రయత్నంలో ఎలా కరుణ(compassion) కనపడిందో,ఇక్కడ పువ్వుల భావాలని వెలిబుచ్చడంలోనూ అలానే కనపడింది.

అక్కడ పట్టించుకుని ప్రేమని పంచారు.చదివుతున్నంత సేపూ అలానే పంచాలి అనిపించేట్టు రాసారు, ఇక్కడ ప్రేమగా పట్టించుకోమంటున్నారు. చదివిన తరవాత
పువ్వుని అలానే సున్నితంగా చూసుకోవాలి అనిపించేట్టు.

నాకు ఈ రెండిటిలో చాలా పోలిక కనపడింది... నా ఈ ఆవిష్కరణని వెంటనే పంచుకోవాలనిపించింది...ఈరెంటిలో పోలికలు వెతుక్కుంటూ ఇంకా ఏదో రాయాలనిపిస్తుంది..
నేను చెప్పాలనుకున్నది చెప్పలేదనిపిస్తుంది...

మోహన said...

@శ్రీవిద్య
నెనర్లు.

@చిలమకూరు విజయమోహన్
ఆ ఒక్క మాట చాలండీ.. నేను నా కృష్ణుని బొమ్మకు అప్పుడప్పుడు సొగసుగా అలంకరించే పూమాల గుర్తొచ్చింది. :) నెనర్లు.

నెనర్లు వేణూ శ్రీకాంత్ గారూ.. :)

@ప్రపుల్ల చంద్ర
Thank you!

@క్రాంతి కుమార్ మలినేని
పండగ అయిపోయి సందడి అంతా ముగిసాకా, ఆ పూలు ఇంకా తాజా గానే ఉంటాయి. కానీ మనిషి స్వార్థ జీవి కదండీ! పని అయిపోగానే వాటిని చెత్త కుప్పకి అంకితం చేసేస్తాడు. అవసరానికి మించి వాడుకున్నది కాక, వాటి అయువును చేజేతులా చెరిపేసి, అకాల మరణం శాశిస్తాడు. ఎందుకు? "పువ్వే కదా.." అన్న అలుసుతోనే కదా..! ఏమంటారు ?

మోహన said...

@దిలీప్
ఇప్పుడే ఒక స్నేహితునితో "ఓ పూవును నేను.." గురించి చెబుతూ... నే రాసే వాటిలో పోలికలుంటున్నాయి అంటూ.. నేను చెప్పి ఇంకా పూర్తిగా ముగించనైనా లేదు.. మీ ఈ వ్యాఖ్య వచ్చింది... :) ఒక వేళ చెప్పినా మీరు చెప్పినంత బాగా వ్యక్తపరిచేదాన్ని కాదేమో!సందేహం లేదు. చెప్పలేను. నిండా ముంచిన భావాన్ని కొన్ని మాటాల్లో ఇరికించటానికి చాలా నేర్పు కావాలి. నాకు అది ఇంకా అలవడ లేదు.

దేనికైనా అందం చేకూర్చేది స్పందించే వాళ్ళే.. మీ స్పందనకి నెనర్లు..!

మీకు ఎప్పుడు చెప్పలనిపిస్తే అప్పుడు చెప్పండి.. you are always welcome!

మోహన said...

అక్కడ పట్టించుకుని ప్రేమని పంచారు.చదివుతున్నంత సేపూ అలానే పంచాలి అనిపించేట్టు రాసారు, ఇక్కడ ప్రేమగా పట్టించుకోమంటున్నారు. చదివిన తరవాత
పువ్వుని అలానే సున్నితంగా చూసుకోవాలి అనిపించేట్టు.

This is it! :)

Purnima said...

ఇన్ని చెప్పిన పువ్వు గురించి.. ఆ పువ్వుకేం ఇష్టమో.. చెప్పరూ.. ఇంతే అందంగా ఇంకో కవితలో.. i'll b waiting!!

ఏకాంతపు దిలీప్ said...

అవును... ఎదురుచూస్తున్నాము... :-) పూర్ణిమ అడిగిన ప్రశ్ననే నేనూ అడుగుదామనుకుని ఇందాక మరిచిపోయాను!

Bolloju Baba said...

చాలా బాగుంది
బొల్లోజు బాబా

Kranthi M said...

thanks for the answer mohana garu.