Wednesday, July 9, 2008

...గతి...

గాలి వీచే వేళ సాగే మేఘాల చాటున చందమామ...
అలజడి రేగిన వేళ కొలనులో అలల అడుగున గులకరాళ్ళు...
గతి తప్పుతున్నాయి.

ఆవేశం కలిగిన వేళ నా మాటల మాటున నేనూ అంతే..!

7 comments:

Bolloju Baba said...

గతి అని పేరు ఎలా సూటయ్యిందనుకుంటున్నారు?
కవిత బాగుంది.
బొల్లోజు బాబా

మోహన said...

బాబా గారు:
కవిత మీకు నచ్చినందుకు సంతోషం.
"కొన్ని సార్లు చుట్టూ చేరిన ప్రాకృతిక విషయాల వల్ల గతి తప్పినట్టుగా అనిపిస్తాము కానీ అది నిజం కాదు" అన్నది నా ఆలోచన.
ఆ సమయానికి నాకు వేరే పేరు తట్టలేదండీ. మీరు ఏదైనా సూచించండి.

కొత్త పాళీ said...

title suitability బాగానె ఉంది .. చెప్పిన తీరే .. మిమ్మల్ని నిరుత్సాహ పరచాలని కాదు. భావుకంగా చెప్పినా, న్రమగర్భంగా చెప్పినా ఇంకా బాగా చెప్పగలరని నమ్మకం.

ఏకాంతపు దిలీప్ said...

@ మోహన
చాలా బాగుంది. మీరు ఏంచెప్పాలనుకున్నారో అందరికీ అర్ధమయింది, మీరు పద చిత్రం చిత్రీకరించారు కాబట్టి. ఇంకా, గతి తప్పడం అనేదానికన్నా వేరేదేమైనా అయితే నా కళ్ళముందు మెదిలే మీ పద చిత్రానికి సరిపోతుందేమో అనిపిస్తుంది. మసక బారడమేమో... ఏమో.. ఇంకేదైనా పదం...

Bolloju Baba said...

మీ కవితలో ఏదో ఉంది.
ఆ ఉన్నదేదో అర్ధం అవుతుంది.
అందంగా కూడా ఉంది.
వ్యాఖ్యానించటమైతే చేసేసాను గానీ, మళ్లా బాల్ ను నాకోర్టులోకె పంపించినప్పుడు, నాకూ ఎమీ తోచటం లేదు.

బహుసా దిలీప్ గారు నాకన్నా కొంచెం స్పష్టం గా చెప్పగలిగారనుకుంటున్నాను.
pl. remember my comment is based on my feel only.

bolloju baba

మోహన said...

కొత్త పాళీ గారూ..
తోచింది చెప్పాలనుకున్నాను అంతేనండీ. అందంగా ఉండాలి అన్న ఆలోచన రాలేదు. ఉండదని అనిపించలేదు కూడా. కానీ అందరి వ్యఖ్యనాలు చూస్తుంటే స్పష్ఠత లేదని అనిపించింది. కానీ ఈ టపాలో నేను అనుకున్నది చెప్పటానికి నా దగ్గర అంతకన్న మాటలు లేవు.

@దిలీప్ గారూ..

>>మీరు పద చిత్రం చిత్రీకరించారు
ఇంతవరకు రైట్.

"మసక బారడమేమో... " ఈ ముక్క చూసాకగాని నాకు అర్థంకాలేదు, నేను అనుకున్నది వ్యక్త పరచటంలో ఘోరంగా విఫలమయ్యానని.

గాలి వీచేటప్పుడు కదిలే మేఘాల వల్ల చందమామ, తన సహజమయిన వేగాన్ని మించి, వాటితో పాటు కదులుతున్నట్టుగాను, తద్వారా గ(శృ)తి తప్పినట్టుగానూ కనిపిస్తుంది.
చలించిన నీటి అడుగున ఉన్న గులక రాళ్ళు, వాటి స్థిరత్వం కోల్పోయి, కదులుతున్నట్టుగా కనబడతాయి.
అవి కేవలం అలా కనబడతాయి మాత్రమే.. కానీ నిజాంగా తమ సహజత్వము కోల్పోయి కాదు.
అలాగే నేను నా ఆవేశపు మెఘాల పరుగుల వెనుక పరుగుపెట్టినట్టుగా, అలజడి అలల వెనుక చలించినట్టుగా కనిపిస్తానేమో కానీ, నేను ఇంకా నాలానే[స్థిరంగా] ఉన్నాను.

ఇదండీ..కథ. మీకు ఇలానే అర్థమయి ఉంటే ఓకే. లేకపొతే ఇలా సందేహం లో పడేసినందుకు పెద్ద మనసు చేసుకుని అందరూ నన్ను క్షమించాలి.

No hard feelings బాబా గారూ.. నిఖ్ఖచ్చైన వ్యాఖ్యలలోనే కదా మనం ఎదిగేది. నేనూ అలానే ఆలోచించి చించీ, ఈ టపా కీ ఆ పేరు పెట్టాను.

ఏదో రాసింది అని వదిలేయకుండా, పట్టించుకుని, వ్యాఖ్యానించిన అందరికీ మరోసారి ధన్యవాదాలు.

ఏకాంతపు దిలీప్ said...

@ మోహన
నాకూ అలానే అర్ధం అయింది... :-) కానీ గతి తో అన్వయించుకోలేకపోయాను...