Friday, July 18, 2008

జీవితం పాఠశాలలో జ్ఞాపకాల పాఠాలు...

[నా అవగాహన తప్పైతే మన్నించి సరిదిద్దగలరని భావించి ఈ సాహసం చేస్తున్నాను.]

మనసును కదిల్చిన ఎలాంటి సంఘటన అయినా సరే మనకి ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది
అలానే ఆ సంఘటనలో భాగమైన వారిని కూడా మనం ఎప్పటికి మరువలేం.

అలాంటి సంఘటనలు, మనుషులు మన జీవితాల్లో వేసిన చెరగని గుర్తులు జీవితం పట్ల, తోటి వ్యక్తుల పట్ల మన వైఖరిని ఎంతగానో మార్చేస్తాయి. ఆ అనుభవం మనకి తెలియకుండానే మన స్వభావంలో ఒక భాగమైపోతుంది.

ఐతే ఇది మంచి అయి ఉండచ్చు లేక చెడు అయి ఉండచ్చు. ఉదాహరణకి, ఒక అబ్బాయి బాల్యంలో ఎవరి చెతుల్లోనైన మోసపోవటమో లేక తనకి బాగా నచ్చిన వారు మోసపోవటమో జరిగితే అది తన స్వభావం మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే, ఇక తను ఎవరినీ నమ్మకూడదనే దృఢ నిర్ణయానికి వచ్చేయ్యచ్చు. అదే అలాంటి సమయంలో ఎవరి చేతనైనా సహాయమో లేక ఆశ్రయం వల్లనో అ కష్ఠ సమయం లోంచి బయట పడటం జరిగితే ఆ సంఘటన అతడికి తోటి వారి బాధను అర్థం చేసుకునే గుణం ఇస్తుంది. ప్రేమ అంటే ఏమిటో తెలియజేస్తుంది, నేను ఒంటరిని కాదు అన్న నమ్మకాన్నిస్తుంది. ప్రేమ, సహాయం పొందటమే కాక ఇవ్వటం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది.

కమలావతి టిచరు గారు దిలీప్ గారికి ఓర్పు, సహనం నేర్పిస్తే, హైదరాబాదు గొడవలు పూర్ణిమకి సమయస్పూర్తిని, సాహసాన్ని, ఐకమత్యం తాలూకు ప్రాముఖ్యతని నేర్పించాయి. తోటి వారి పరిస్థితిని అర్థం చేసుకునేలా చేసాయి. పూర్ణిమ గారి నాయనమ్మ, తాతగారుల గురించి చదివి నాకు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ పైన మరో సారి నమ్మకం కుదిరింది.

ఒక మంచి జ్ఞాపకం మనల్ని మనం చూసుకుని సవరించుకునే అద్దం లాంటిదయితే,
ఒక చేదు అనుభవంలో అందిన ప్రేమ మనలో మానవత్వాన్ని వెలికితీస్తుంది, ఒక బాధ్యతని అప్పచెబుతుంది.
ఎలాంటిదైనా,ప్రేమ నిండిన జ్ఞాపకం మనం మనిషిగా ఎదగటానికి దోహదపడుతుంది.

ఇది నా జీవితం నాకు నేర్పిన పాఠం. ఈ రోజు ఆ పాఠాన్నంతా రెండు ముక్కల్లో పెట్టగలిగానంటే, ఆ ఘనత అంతా, వారి తీపి, చేదు అనుభవాలను గుండెలకు హత్తుకునేలా చెప్పిన ['రాసిన ' అనను. అవి చెప్తున్నట్టే ఉన్నాయి] పూర్ణిమ, దిలీప్ ల గారికే చెందుతుంది. నెనర్లు!

9 comments:

Purnima said...

You see what you want to see :)

Kathi Mahesh Kumar said...

మంచి ప్రయత్నం. కానీ మీరు నిజంగా చెప్పాలనుకుంది చెప్పలేదేమో అన్న అనుమానం వస్తోంది. భావస్రవంతి పుటుక్కున తెగిపోయిన భావన కలిగింది.

ఎవరైనా రచయిత (బ్లాగర్) ఒక టపా రాసి పోస్ట్ చేస్తే అంతటితో వారి పనైపోతుంది. చదివేవాళ్ళు తరువాత all powerful అన్నమాట. కాబట్టి మీరు అర్థం చేసుకున్నది,మీకు అనిపించిందీ స్వేచ్చగా రాసెయ్యడమే. అందులో తప్పులనేవి ఉండవు.

ఈ జ్ఞాపకాల మీద నేనూ ఒక టపా కట్టాను చూడండి.
http://parnashaala.blogspot.com/2008/07/blog-post_2957.html

ఏకాంతపు దిలీప్ said...

@ మోహనా
మీ ఈ స్పందన నా టపా కి అందాన్ని,అర్ధాన్ని అద్దింది.. పూర్ణిమ అన్నట్టు వెతుక్కునే ఓపిక ఉన్న వాళ్ళకి, తమకి చేరాల్సినవి చేరుతూనే ఉంటాయి... అది మీ ఘనతే..


అవునూ.. మీ కలల బ్లాగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? :-) నేనైతే కళ్ళు కాయలు కాసేట్టు ఎదురుచూస్తున్నాను...

Kottapali said...

అక్కడ నాయనమ్మ తాతయ్య ల గొప్పదనం వాళ్ళ పెళ్ళి పెద్దలు చెయ్యడం వల్ల రాలేదని గమనించ గలరు. వారి స్వంత వ్యక్తిత్వాలు, అటుపైన ఒక సంపూర్ణమైన జీవితాన్ని చూసిన అనుభవమూ .. ఇవీ ఆ గొప్పతనం

Purnima said...

మొహనా:

కొ.పా గారి వ్యాఖ్యను మరో సారి గమనించు. "ఎలా ఏకమయ్యారు" అనేది అప్రస్తుతం.. ఎలా ఐక్యంగా నిలిచారన్నదే ముఖ్యం.. నా మట్టుకు నాకు!!

అందుకే అన్నాను.. You see what you want to see అని. ఇందులో తప్పొప్పులు ఉండవు.. కానీ we can always better ourselves.

మోహన said...

@పూర్ణిమ
you are right. I always am in search of Love.

అందుకే ప్రేమని అందించిన వాటిని అభినందించకుండా ఉండలేను. అది మాటైనా, పాటైనా, మనిషైనా, సంఘటన అయినా!

కొత్త పాళీ గారికి నా సమాధానం కింద వ్రాశాను.

@కత్తి మహేష్ కుమార్
అంతర్లీనం గా నే చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటాను. నే చెప్పేది అల్లా ఒకటే. "సరైన సమయానికి ప్రేమ దొరికితే యెవరికయినా, యేలాంటి జ్ఞాపకమయినా ఎదగటానికి ఉపయోగపడుతుంద"ని. నిజమే నాకు నా ఆలోచన మాటల్లో పెట్టటం కష్టమే అవుతుంది. ఎందుకంటే తిన్నగా, 'నువ్వు అందరినీ నీతో సమానంగా ప్రేమించాలీ అని చెప్పలేను కదా! :) అలా చెప్పటం వల్ల ఏమి లాభం కూడా లేదు.


@ఏకాంతపు దిలీప్
చాలా థాంక్స్ అండీ..

కలల బ్లాగా?!.. చూస్తానండీ.. ఒక టపాకి సరిపెడతానేమో..!! లేకపోతే అది రాయటనికి నాకో script/copy writer కావాలి ;) నేను క్లుప్తంగా రాసి జనాలను కష్ఠపెడుతుంటను అప్పుడప్పుడు.. అందుకె మనకి social లోనూ management సబ్జెక్ట్స్ లోను మార్కులు నిల్! [తక్కువ అని! :)]

@ కొత్త పాళీ గారూ..

పెద్దలు చేసిన పెళ్ళీళ్ళ లో కూడా అభిరుచులు కలిసే వారు దొరకచ్చు అని నా అభిప్రాయం అంతే..!

ఏకాంతపు దిలీప్ said...

మోహనకి ఆ విషయం తెలుసేమో అనిపిస్తుంది నాకైతే. తను మరో జంటని చూసి నమ్మకం పెంచుకున్నారే కానీ, అలా కలిస్తేనే ఐక్యంగా ఉంటారు అని చెప్పడం తన ఉద్దేశం కాదేమో! తన నమ్మకానికి పునాధి తనకు ఎదురైన అనుభవాలు, తను విలువ ఇచ్చి పరిగణనలోకి తీసుకున్న అంశాలే కావొచ్చు...

మోహన said...

@ ఏకాంతపు దిలీప్
:)

Purnima said...

@dileep:

You see what you want to see :).. that is all I can say.