Saturday, July 26, 2008

ఓ పూవూ.. నీకేమిష్టం ?


మోహన: సుమా.. నిన్న నువ్వు "ఓ పూవును నేను..." అని చెప్పింది నాకు నచ్చి, ఇక్కడ నా బ్లాగు లో పెట్టేసాను. అది అందరికీ నచ్చింది. మెచ్చుకున్నారు కూడా...

సుమ: చాలా సంతోషం. అందరికీ నా తరపున ధన్యవాదాలు చెప్పు. మర్చిపోకు!

మోహన: చెప్తా కానీ.. అక్కడితో అయిపోలేదు. నీకేమి ఇష్టమో తెలుసుకోవాలని చాలా ఉత్సుకతో ఉన్నారు అంతా! నేనే ఎదో ఒకటి చెప్పేద్దాం అనుకున్నా.. కానీ, మన పూర్ణిమ అందంగా కవిత రూపంలో చెప్పాలని ఒక కండిషన్ కూడా పెట్టింది. కాబట్టి మళ్ళీ.. నిన్ను ఆశ్రయించక తప్పలేదు నాకు. మరి చెప్పు...నీకు ఏమిష్టం ?

సుమ: హ్మ్.... అయితే ఇది నాకు ఇంటర్వ్యూనా ? :)
మోహన: పోనీ అలానే అనుకో.. నీ సరదా ఎందుకు కాదనాలి ? :)
సుమ: కానీ కవితంటే కొంచం కష్టమే!
మోహన: అబ్బా.. మురిపించింది చాలు. చెప్పవే..!
సుమ: సరే సరే... నాకేమి ఇష్టం అంటే........


నాకు భావమంటే ఇష్టం.
ఆనందం, దుఃఖం. ప్రేమ, అభినందన.
ఆరాధన, అర్చన.. ఇలా స్వచ్చమయినది ఏదైనా...
అందుకే..!
భావ వ్యక్తికరణలో నేను ఎప్పుడూ ఉండటానికి ప్రయత్నిస్తాను.

తరువాత నాకు చిరునవ్వంటే ఇష్టం! ఎందుకో తెలుసా ?
భావ వ్యక్తికరణలో సహజంగా పుట్టేది చిరునవ్వు.
ఆర్భాటం లేకుండా, అందంగా ఉంటుంది.
నా అవసరం రానీయదు ఈ చిరునవ్వు. :)
కానీ నే తనలోనూ విరబూస్తానని గమనించిందో లేదో మరి ఈపాటీకి!

ఇంకా నాకు నచ్చింది చెయ్యటం ఇష్టం!
"వెళ్ళకమ్మా నలిగిపోతావు" అని అమ్మ అంటే....
"నచ్చినది చెయ్యలేని జీవితం ఉండీ ఎందుకమ్మా..?"
అని నా స్వార్థం నే చూసుకున్నాను. తనకి కడుపుకోత మిగిల్చాను.

నేను ఎవరికేం చేసినా, నాకు నచ్చింది చేశాను.
అది ప్రేమనుకునేరు కొందరు. నిజానికి అది నా స్వార్థం.
ఒక్కోసారి నా అంత స్వార్థపరురాలు లేదనిపిస్తుంది.
కాని, నా స్వార్థం లో కూడా పరోపకార వాంఛ ఉన్నప్పుడు అది ప్రేమకి తీసిపోదేమో! అసలు అదే ప్రేమేమో! అనిపించింది.

అయ్యో.. నాకెమిష్టమో చెప్పమంటే.. ఇలా మీ మెదడు తినేస్తున్నాను.. అన్నట్టు ఇది కూడా నాకు నచ్చిన పనే..! హహహ

ఇంకా నాకు.. సైట్ కొట్టటం ఇష్టం. ;)
టైం దొరికితే చాలు. అదే ధ్యాస..!
సీతాకోకలకు, తూనీగలకు, తేనెటీగలకు.. ఇప్పుడు నీకు!
నేను ఒక నవ్వు నవ్వి, అమాయకంగా చూస్తే ఎవరైన సరే పడిపోవాల్సిందే!!

వాన జల్లులో తడవటమంటే ఇష్టం.
తాను పంపే చినుకు చినుకునూ తాగి,
నాలో మకరందం నింపుకుని యవ్వనం పొందుతాను చూడూ..
ఆహా..ఆ క్షణం! అది ఎంత గొప్ప అనుభవమో!

నేను రెమ్మ పై బుద్దిగా కూచుని ఉంటే..
వాడు వచ్చి అలా తాకి పోతాడు ఒకసారి..
దెబ్బకి మత్తెక్కేస్తుంది నాకు..
మళ్ళా వచ్చి ఒక్క కుదుపు కుదిపాడంటే, ఎక్కింది కాస్తా దిగిపోతుంది. :)
నేనెవరి గురించి చెప్తున్నానో అర్థమయ్యిందా?
హ్మ్... కనిపించకుండా చుట్టేస్తాడు చూడు...వాడే..!
నాకు వాడి పేరు చెప్పాలంటేనే సిగ్గు బాబూ..అదేమిటో మరి...!
కదిపినా, కుదిపినా నాకు వీడి మీద కోపం మాత్రం రాదు. వాడి ప్రేమ అలాంటిది.
నాకు తెలీని రాగాలు పరిచయం చేస్తాడు.
వాడీతో నే గడిపిన క్షణాలన్నీ నాకు మధుర క్షణాలే...
వాడంటే నాకు ఇష్టమని ప్రత్యేకించి చెప్పాలా ? నాలాగే వాడికి ఇంకా బోలెడు మంది అభిమానులు. తెలుసా ?

ఇక ఆఖరుది... అన్నిటికంటే ముఖ్యమైనది...

పంచుకోవటం...
మీకు జ్ఞాపకాలుగానో, అనుభవాలుగానో, అనుభూతులుగానో
శాశ్వతంగా నిలిచిపోయే ప్రతి క్షణంలో,
నేను మీ మెడలోనో, చెతుల్లోనో, జడ కొప్పుల్లోనో...
లేక మీ మనసులోనో, చిరునవ్వుల్లోనో విరబూస్తూ..
మీతో పంచుకునే ప్రతి నిమిషం నాకు చాలా ఇష్టమయినది. అమూల్యమయినది.

"సున్నితమైనదాన్ని" అన్నానని నన్ను దూరం చేయకండి.
నాకు నచ్చిన పని చేయలేకపోవటం, చావు కన్నా దుర్భరం!
నన్ను మీరు గుర్తిస్తే చాలు... ఎన్ని సార్లైనా మరణిస్తాను..
మళ్ళీ పూవుగా జన్మించడానికి!!!

మీతో నా మనసులో మాట పంచుకోనిచ్చిన మీ అందరికి నా ధన్యవాదాలు. ప్రశ్న అడిగిన పూర్ణిమ గారికి ప్రత్యేకించి మొరోసారి ధన్యవాదాలు.. ఇక మోహనా... నీకు థాంక్స్ చెప్పాలా ?అంత అవసరమా ?? ;)

మోహన: ఓఓఓయి.... !!! :)

-------------------------------------------------------------------------

Special Thanks to everyone who inspired me write this post.

20 comments:

Anonymous said...

have u written this with chalam story"o poovu poosindi"inspiration?

మోహన said...

@anony..
I have not read any books of chalam except "maidanam".
This is purely my imagination.

Purnima said...

Any writing needs the natural drive. Had you not related to my question, this wouldn't be so beautiful and hence all kudos to you. I've no part in it, honestly!!

ఇక పువ్వు మనోభావాలు ఆవిష్కరించిన విధానం.. ఎంత అందంగా ఉందో చెప్పలేను. ఆర్త్ద్రత, భావుకత, సున్నితత్వం, కొంటెతనం, అల్లరి, inner strength, మంచి ఆలోచనా సరళి గల నేటి తరం "అమ్మాయి"ల మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉందనిపించింది.

"నాకు నచ్చిందే చేస్తాను.. అది నా స్వార్ధం.. అదే ప్రేమ కూడా కావచ్చమో.. అవతలి వారి బాధ నాదిగా భావిస్తా కావున... మెదడు తినడం.." ... ఈ అక్షరాలన్నీ... నా స్నేహితురాలిలా చెప్పాలంటే.. "నా మనసులోంచి తీసి రాసినట్టుంది"

చదువుతున్నంత సేపూ... "ఇది నాదే" అని భావన కలిగించిన నీకు ఎలా "థాంక్స్" చెప్పాలో తెలియటం లేదు!!

ఏకాంతపు దిలీప్ said...

పూర్ణిమా ఆ వ్యాఖ్య రాసిన తరవాత నాకు చెప్పడానికి పెద్దగా మిగలలేదు... కానీ...

ఈ మకరందం నా ఊహా సుమాల్లోనుండి సేకరించి నాకోసమే అందిస్తున్నట్టుంది!

మోహనా దీనిలో తత్వం ఉంది, భావుకత ఉంది, ఇంతకుముందన్నట్టు కరుణ ఉంది, ఇంకా మాటల్లో చెప్పడానికి చేతకానిదేదో ఉంది....

నాకు నీ ఆటోగ్రాఫ్ ఇస్తావా....?!! ప్లీజ్... ఒక్కసారి.... :-)

చిలమకూరు విజయమోహన్ said...

సువాసన వెదజల్లుతున్న సుమబాలలాగానే వుంది మీ కవిత

Kranthi M said...

నిన్న స్ప౦దన కలిగి౦ది.
నేడు అవ్యక్తమైన భావన కలిగి౦ది.
గత 3 టపాలుగా మాత్రమే మీ బ్లాగుని చుస్తున్నా కానీ మీ ’అపురూప జ్నాపక౦’,ఇవి రె౦డు చాలు మీ గురి౦చి తెలుసుకోవడానికి అనిపి౦చి౦ది.
కానీ మీరు చెప్పిన తీరే నాకు చాలా బాగా నచ్చి౦ది.
నాకూ మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా....?!! ప్లీజ్... ఒక్కసారి.... :-)

Bolloju Baba said...

beautiful
bollojubaba

Anonymous said...

chalam's story"o poovu poosindi"which was published in saakshi sunday magazine recently is also onthe same lines.hence i asked that question.we can know about chalam's greatness from that story

మోహన said...
This comment has been removed by the author.
మోహన said...

@Anony...

Chalam, undoubtedly, has seen the unseen. Thanks for the info.

For others:
Here is the link to "O poovu poosindi" published in Sakshi news paper.

http://www.sakshi.com/main/weeklydetails.aspx?newsid=2187&subcatid=54&categoryid=10

I enjoyed the read. Thanks again.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది అనేది చాలా చిన్న మాట కానీ అంతకన్నా ఏం చెప్పాలో తెలీడం లేదండి.
పూర్ణిమ గారి కామెంట్ లో రెండో పేరా మళ్ళీ ఓ సారి చదవుకోండి. నే చెప్పాలనుకున్నది కూడా అదే.

Purnima said...

Anonymous gaaru:

Thanks a lot.. for suggesting us this read!!

Thanks mohana.. for finding it out!!

కొత్త పాళీ said...

"వాన జల్లులో తడవటమంటే ఇష్టం."
నించీ
".... ఎక్కింది కాస్తా దిగిపోతుంది. :)"
దాకా చాలా బావుంది ..
మిగతాది ... వోకే ..

Kathi Mahesh Kumar said...

చాలా బాగుంది. కాస్త ఫీల్ అయ్యి, తరువాత విశదంగా కామెంట్ రాస్తాను.

Pradeep Palem said...

After reading "O puvvu neekem istam" & "O puvvunu nenu",I felt like i am reading the blog "Poola prapancham" and not "visala prancham".

Nice,go a head...

Mohana garu..pls see my comments below for your post "devudu unnada"?

1)One God : Yes as in other religions Hinduism has only one God.Ie,Govinda (Sri Maha Vishnu)( In Hinduism Bhagavan is He who possesses without limit the six types of opulence – strength, fame, wealth, knowledge, beauty and renunciation ) and others are demigods (Vinayaka,anjeneya,garuda etc ) and Gurus ( Saibaba etc ).

2) Image worship - This is one type of worship and this is not not every thing in Hindusim .For instance i cannot step on a photo of my father,because i see him in that.It is more or less my father.This is the theory behind the Image worship.

Yaser-U may think that i am a fool worshipping the photo.But its wrong.I am worshipping my father in that.

3) Whether God is there r not :Pls think - A just born calf will apporach its mother ( Cow ) and drink milk with in a span of one hour.Who told to that just born calf that cow is its mother and has to take milk as its food and that too from breast.

It is because of creation ( Srusti ).If creation ( srusti ) is there means creator ( Srustikartha) should be there.And that person is God called with different names in different religions like Govinda/Allah/Jenovah etc.

So pls never think whether God is there r not in your future life.

Thanks

మోహన said...

@Purnima
నీకు నచ్చింది కదా ? చాలు నాకు. థాంక్స్ అక్కర్లెదు. అవును "ఇది నీదే" :)

@దిలీప్
మీ వ్యాఖ్యకి, అభిమానానికి నెనర్లు!!
"ఇంకా మాటల్లో చెప్పడానికి చేతకానిదేదో ఉంది...."
ప్రేమ ? ఇదే అయితే మాటల్లో చెప్పటం కష్టం లెండి..:)

మరైతే ఎప్పుడు వస్తున్నారు ఆటోగ్రాఫ్ కోసం ?! ;)

@విజయమోహన్
నెనర్లు.

@క్రాంతి కుమార్ మలినేని
"ఇవి రె౦డు చాలు మీ గురి౦చి తెలుసుకోవడానికి అనిపి౦చి౦ది." అనిపించిందా ? :)
మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
మీ అభిమానానికి క్రుతజ్ఞురాలిని. కానీ ఆటోగ్రాఫ్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదేమోనండి..! కనీసం ఇప్పుడప్పుడే!! :)

@బొల్లోజు బాబా
నెనర్లండీ..

@వేణూ శ్రీకాంత్
చాలా చాలా థాంక్స్ అండీ. consistent గా నాకు మీరిచ్చే "చాల బాగుంది" అనే కామెంట్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. :)

@కొత్త పాళీ గారూ..
మీ వ్యాఖ్య చూశి చలా సంబరపడ్డాను. అన్నట్టు ఈ విషయంలో నేనూ మీవైపే..:)

@కత్తి మహేష్ కుమార్
Thank you! I will be waiting for your comment.

మోహన said...

@Chandra
Thank you.

Isaw your comment in "devudu ekkadunnadu" post of mine.

Its see your passion in expressing your opinions, that yopu posted it here agian. :)

My opinion: Journey to Truth is always lone. We all have to do it individually. We can become pointers to others. But we can not decide "Should/should nots" for anyones journey. Because we have our own paths. And what we see in each of our paths might be completely different. With respect to consciousness, some might be ahead/behind to others on the way. And the journey can be longer for few in the scop of time. Our duty is to just move with out disturbing others.

I hope you understand what I mean.

Thank you.

Anonymous said...

సిగ్గు మొగ్గలు వేయించారు, సింగారం పూయించారు. ఇప్పుడు మనోవాంఛలను మా ముందు ఉంచారు. చాలా బాగుంది. అమ్మ చెప్పినా వినకుండా 'సుమ ' చేసే అల్లరితనం నచ్చింది. కొందరి కష్టం - మరికొందరికి ఇష్టం.

మోహన said...

@బాలు
Thank you.
"కొందరి కష్టం - మరికొందరికి ఇష్టం."
మీరు చెప్పాలనుకున్నది - "కొందరి ఇష్టం - మరి కొందరికి కష్టం" అని అనుకుంటా?

రాధిక said...

వాహ్... చాలాబాగుంది.ఇంతబాగా రాస్తున్న మీకు నా బ్లాగు నచ్చడం చాలా వింతగా వుంది.ఎనీవే ఇంత మంచి బ్లాగులో నా బ్లాగుకి లింకు వుండడం నా అదృష్టం.మోహనా మీతో మాట్లాడాలను వుంది.నాకో మైల్ ఇస్తారా?
rrk2k3@gmail.com