Wednesday, August 6, 2008

ప్రస్తుతానికి ఇక్కడ ఆగాను!!

గత నాలుగు రోజులుగా గుండెలో ఏదో కలకలం. లోపల ఏదో పెద్ద సంభాషణ జరుగుతున్నట్టు... నాలుగైదు గొంతులు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఒక గొంతు పెద్దగా వినిపిస్తుంది. కానీ ఏమీ అర్థం కావటం లేదు. మగత నిద్రలో ఉన్నప్పుడు కూడా నాకు ఏదో చెప్పాలన్న తపన తో నన్ను గట్టిగా పిలుస్తున్నట్టు... పీడకల మాత్రం కాదని తెలుసు. భయం కూడా కాదు. నాలుగు రోజులు పరిశీలించాక అర్థమయ్యింది...నాలో మెదులుతున్న అస్పష్ఠమయిన ఆలోచనలు రూపం పొందెందుకు తహ తహలాడుతున్నాయని...

నే పట్టలేకున్నాను వాటిని... ఎంత వేగం!! పట్టినా, కాగితం పై పెట్టే లోపు చటుక్కున జారిపోతున్నాయి..!!! ఛ్.. మెదడులోని ఆలోచనలని అంతే వేగంగా అక్షర రూపంలో రికార్డ్ చెయ్యగల యంత్రం ఏదైనా ఉంటే బాగుండు కదా!

స్వార్థం, ప్రేమ, కరుణ, కర్తవ్యం, బాధ్యత.... నాకు నచ్చిన పని చెయ్యటం స్వార్థమా? ఎవరినీ నొప్పించకుండా ఉండటం ప్రేమా ?? బాధ్యత అంటే ???.............

ఇలా అలోచిస్తూ ఆ ఆలోచనల ప్రవాహంలో మునుగుతూ తేలుతూ.. కొట్టుకుపోతున్నాను.. ఆటు పోట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. యే ఒక్క వైపుకో ఈదటం చాలా కష్టం గా ఉంది. మధ్య మధ్యలో ఎగిసిపడుతున్న ప్రశ్నల అలలు లోతుకు తోసేస్తున్నాయి...

ఆఖరికి కలాన్ని ఊతంగా చేసుకుని ఈదుతున్నాను. ఈదుతూనే ఉన్నాను. తీరం కనిపించలేదు. రాస్తూనే ఉన్నాను. ఆఖరికి ఓడనే ఆశ్రయించానో, ఒడ్డుకే చేరుకున్నానో.... ఒక చోట ఆగాను. ఆ ఆఖరి ఖండాన్ని ఇక్కడ రాస్తున్నాను.

నచ్చిన పని చెయ్యటం అంటే మన మీద మనకున్న ప్రేమను వ్యక్త పరచటం.
తనను తాను ప్రేమించుకోలేని వాడు మరెవరినీ ప్రేమించలేడు!
ఆ స్వప్రేమ దాహం తీర్చటం కోసం ఇతరుల ఆనందానికి అడ్డుపడితే అది స్వార్థం.
తనను మాత్రమే ప్రేమించుకునే వాడు ఎప్పటికీ ప్రేమను అనుభవించలేడు!!

Serving oneself is Self-love
Serving oneself at the cost of others is Selfishness
Serving others is Compassion
Serving others at the cost of self is Low/no self-esteem [expecting something in return]
Serving others through serving self is Responsibility
Serving Self through serving others is Universal Love

ఇందులో ఎంత అర్థం ఉందో, ఇది ఎంత వరకూ నిజమో నాకు తెలియదు. కానీ, ప్రస్తుతానికి ఇక్కడ ఆగాను!!

8 comments:

Purnima said...

చదవగానే కమ్మెంటే పోస్ట్ కాదిది. Lemme think over it!!

Kranthi M said...

nEnu kUDA anni bloglU tirigi tirigi enTO ikkaDE aagipOyAnanDi.EdO chesaru meeru?em chEsAru?

nicelist about love.real things.Everyone find them among this list.keep writing.

Anonymous said...

I read ur's Bhayam blog also. మీ అస్పష్ట భావాలని చదవడం వల్ల కలిగిన భావనో, లేక మీ రాతలు నిజంగానే అస్పష్టంగా ఉన్నయో గాని ... స్పష్టత లేని పరిస్థితిలో పడ్డాను. By the way if u find the machine that captures the thoughts ... i too badly need it. :)

ఏకాంతపు దిలీప్ said...

మోహనా,
ఇలాంటి ఆటు పోట్లనే నేనూ ఎదుర్కొన్నాను... కాకపోతే అప్పుడు నా ఆటు పోట్లు ప్రేమ,భాధ్యత,స్వార్ధాలకి సంబందించినవే... అవి సేవతో ముడిపడలేదు...

మోహన said...

@క్రాంతి కుమార్ మలినేని
నేనెమీ చేయలేదండీ.. :)
Thank you.

@బాలు
ఎవరినీ confuse చేద్దామని అనుకోలేదండీ. క్షమించాలి. అనిపించింది రాసా అంతే..! ఆ మెషీన్ దొరికితే తప్పకుండా చెప్తాను. కామెంటినందుకు ధన్యవాదాలు. :)

@దిలీప్... నెను రాసెటప్పుడు ఆ భావం ఆలానె ఇంగ్లీష్ భాషలో ఒక ఫ్లో లో బయటకి వచ్చింది. నమ్ముతారా..? అది రాసాకా దానికి సేవను నెను ఎందుకు మూలం చేసుకున్నానో నాకు వెంటనే వెలగలేదు. సేవను నేను ఎందుకు ఆశ్రయించాను అనేది..చాలా సేపు ఆలోచించాను. అర్థం అయ్యాకా అది రాద్దామా వద్దా అని కూడా ఆలోచించాను. కనీ ఫైనల్ గా రయలేదు. మీరు పట్టేశారు. :)

సేవ అంటే చారిటీ గా చూడాట్లేదు నేను. I see it in the context of Serving purpose అంతే.. Whatever we do, we 'serve' some purpose. Even the basic act of breathing. Through breathing, we serve self to be alive. This is the reason why I used that word. But I failed to get an equivalent telugu word. dharmam? kartavyam??

Srividya said...

@మోహనా : మీ పోస్ట్ చూస్తుంటే నన్ను నేను చదువుకున్నట్టు అనిపించింది. నిజంగానే ఈ ఆలోచనల వేగం మనకి అంతు పట్టనిది. వాటిని ఒడిసిపెట్టి కాగితం పెట్టామంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ అవేమో మన అందకుండా పారిపోతూ మనల్ని ఏడిపిస్తుంటాయి.
Very good post.

ఏకాంతపు దిలీప్ said...

నిన్ను నమ్మకపోతే ఎలా మోహనా? ;-) అసలే ఆటోగ్రాఫ్ తీసుకోవాలి నేను..

ఏదైనా ఒక్కటే... ధర్మం, కర్తవ్యం సంధర్భాన్ని బట్టి మారుతుంది...

నాక్కూడా ఒక్కోసారి మనలో కలిగే భావము ప్రేమో,కరుణో,భాధ్యతాయుతమైన భావమో, స్వార్ధమో తెలియకుండా పోతుంది...

మోహన said...

@శ్రీవిద్య
completely agree with you.
ఈ టపా రాసాకా అలాంటి ప్రశాంతతే నాకు అనుభవంలోకి వచ్చింది. అసలు రాసినదానిలో స్పష్ఠత ఎంత ఉంది అనేదాని కంటే.. నా అస్పష్ఠమైన ఆలోచనలని స్పష్ఠం గా రాయగలిగినందుకు నాకు త్రుప్తి గా అనిపించింది. :)

@Dileep
ఏంటండీ.. ఇంకా ఆటోగ్రాఫ్.. గురించి మర్చిపోలేదా..? :)
సరే.. మరి నేను ఇక్కడా పెన్ను చేతిలో పెట్టుకుని తిరుగుతున్నా... మీకు ఎప్పుడు ఆటోగ్రఫ్ ఇద్దామా అని ;)

అమ్మో అన్నీ ఒక్కటే అన్నారంటే నాకు మళ్ళీ confusion మొదలవుతుంది.. అన్నీ ఒకేలా కనిపిస్తాయి..

All look alike and most of the times they are hard to differentiate. This is becasue satisfaction is the common thread that runs underneath.

But to satisfy whom ?

I feel that this question is very important. whatever we do, we have at least a little selfish motive in it. I mean to feel self-satisfaction. I dont mean it is wrong. Once we realise this, the process of complaining about others will diminish to a great extent.

This ultimate realisation is what I understood as Univeral Love.
ఇందులో ఎంత అర్థం ఉందో, ఇది ఎంత వరకూ నిజమో నాకు తెలియదు. కానీ, ప్రస్తుతానికి ఇక్కడ ఆగాను!! :)