Sunday, August 17, 2008

స్త్రీ- స్వేచ్ఛ- సీతాకోకచిలుక


అభిమానంలో అభినవ 'సీత'లం.
'జీ'వనంలో స్వేచ్ఛనొందిన సీతాకోకచిలుకలం.

మనః మేధస్సును ఏకం చేసి,
దాస్య శృంఖలాలను ఛేదిచాం.
జ్ఞాన జ్యోతిని వెలిగించి,
వెలుగుబాటలో ప్రయనిస్తున్నాం.

సహజీవిగా గుర్తింపు గెలిచి,
సమానంగా వెలుగొందుతున్నాం.
ప్రోత్సాహకులకు కృతజ్ఞులం,
వారి ఆశయాలకు మేం ప్రతినిధులం!

'జీ'వనంలో స్వేచ్ఛనొందిన సీతాకోకచిలుకలం.
అభిమానంలో అభినవ 'సీత'లం.

-------------------------------------------------

వారి చిత్రాన్ని ప్రచురించేందుకు అనుమతించిన పృథ్వీరాజు వర్మ గారికి కృతజ్ఞతలు.

9 comments:

ఏకాంతపు దిలీప్ said...

హే మోహనా... భలే రాసావురా! 'జీ ' ని ఎందుకు వేరుచేసావు? వనాన్ని చూపించడానికా? లేక ఆ అక్షరానికి ఏమైనా అర్ధం ఉందా?

చిలమకూరు విజయమోహన్ said...

కవిత బాగుంది.అభినందనలు

Anonymous said...

నాకు కూడా 'జీ ' గురించి డౌట్. 'వనం ' అని పెట్టాలి అని నా అభిప్రాయం. 'జీ' కి వేరే అర్దం ఏమైనా ఉందా? అభినవ సీతలం అని రాసారు. బాగుంది.

రాధిక said...

కవిత బాగుంది.అభినందనలు

Anil Dasari said...

సీత అభిమానవతా? ప్రాసకోసం ఆ పేరు వాడారా ఏమిటి? అగ్నిప్రవేశం చెయ్యమన్నప్పుడే రాముడి చెంప ఛెళ్లుమనిపించకుండా తలదించుకుని ఆ పని చేసినామె అభిమానవతి ఎలా అవుతుంది? 'నే లేనప్పుడు నువ్వేమేం చేశావో మరి నువ్వూ చెయ్యవేం అగ్ని ప్రవేశం' అనుంటే ఆమె అభిమానవతే అయ్యుండేది.

కల said...

మోహన గారు,
మన గురించి బాగా రాశారు. "జీ" అంటే హిందీ "జీ"నేనా? కాకపోతే అర్ధం వివరించగలరని మనవి.
అబ్రకదబ్ర గారు,
సీత అభిమానవతే, అందులో మీకెటువంటి సందేహం వలదు. భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఉంటే అభిమానం లేకుండా ఎలా అవుతుంది? రాముడు తనని ఎందుకు అగ్నిప్రవేశం చేయ్యమన్నాడో సీతకి బాగా తెలుసు, అందుకే మారుమాట్లాడకుండా అగ్నిప్రవేశం చేసింది.

Anil Dasari said...

ఏమో, నాకు మాత్రం సీత భర్త మాట జవదాటని అమాయక మూగ, కొండొకచో పిరికి ప్రాణి లాగానే అనిపిస్తుంది కానీ, అభిమానవతిలా కాదు.

మోహన said...

@దిలీప్, విజయమోహన్, బాలు, రాధిక, రాధిక
ధన్యవాదాలు.

వనాన్ని చూపించడానికే 'జీ' ని వేరు చేసాను. వేరే అర్థం ఏమీ లేదు.
వనం లో స్వేచ్చగా విహరించే సీతాకోకలలో నేటి స్త్రీల పోలిక చూసుకున్నాను అంతే..
ఇది హిందీ 'జీ' కాదు కలా..

అబ్బా అబ్రకదబ్ర గారూ.. పెఢేల్ మని మోగింది నా చెంప. :)

రాముడు సీతను అగ్నిప్రవేశం చెయ్యమన్నప్పుడు, మారు మాట్లాడకుండా చేసిన సీత, భర్త అడుగుజాడల్లో నడిచే సీత, అతడి మాట జవదాటని అమాయక మూగ, కొండొకచో పిరికి ప్రాణి సీత, అతడు మన్నించమని, ప్రాధేయపడినప్పుడు ఎందుకు భర్త మాట వినలేదు????
అది తనకు మహద్భాగ్యంగా తలచి అతడి వెంట ఎందుకు వెళ్ళలేదు ???

చెప్పగలరా?


సీత అభిమానవతి. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు.

అభిమానం అంటే, చెంప చెళ్ళుమనిపించాలా ? అలా చెయ్యటానికి ఒక్క నిమిషం కూడా పట్టదు కదా!

ఎదుటీ మనిషిని నిలదీస్తేనే మనం అభిమానవంతులం అవుతామా ??
మనలోని గుణాలను లెక్కవేయటానికి, పక్కవారిని కొలబద్దలా వాడుకోనక్కర్లేదు.


"అగ్నిప్రవేశం చెయ్యమన్నప్పుడే రాముడి చెంప ఛెళ్లుమనిపించకుండా తలదించుకుని ఆ పని చేసినామె అభిమానవతి ఎలా అవుతుంది? 'నే లేనప్పుడు నువ్వేమేం చేశావో మరి నువ్వూ చెయ్యవేం అగ్ని ప్రవేశం' అనుంటే ఆమె అభిమానవతే అయ్యుండేది."

అలా చేసి ఉంటే సీత అభిమానవతి కాదు, అహంకారి అయ్యి ఉండేది.

మీ వ్యాఖ్యలో నేను భరించలేకపోయిన విషయం.. సీతను పిరికి ప్రాణి అనటం.

ముల్లోకాలను జయించి, దేవతలు సైతం ఎదురుపడేందుకు సాహసించని రావణాసురిడి ఎదుట కేవలం భర్తకు దూరమయ్యాను అనే బాధతో తప్ప, భయం లేనిదై నిలిచి, అతడిని ఒక గడ్డి పోచతో పోల్చిన సీత పిరికిదా ???

అణకువను బలహీనతగా చూస్తున్నారా ?

చిలమకూరు విజయమోహన్ said...

చాలా మందికి ప్రతినిధి గా అబ్రకదబ్ర గారువెలిబుచ్చిన సందేహానికి మీరిచ్చిన సమాధానం కవిత కన్నా బాగా నచ్చింది నాకు.