Friday, September 5, 2008
'వినిపించని రాగాలే... కనిపించని అందాలే...'
రాత్రి 10 కావస్తోంది. బెంగుళూరు నుండి హైదరాబాదు రహదారి మీద, National Travels వారి బస్సు చీకట్లను ఛేదించుకుంటూ వేగంగా దూసుకుపోతుంది. కిటీకీ తెరలు మూసెయ్యమని ఆర్డర్ వేశాడు బ్బస్సులోని యాదగిరి. నేను యాదగిరి వంక కోపంగా చూశాను. వాడు మాత్రం నన్నేమీ అనలేదు! అసలు నన్ను చూస్తే కదా ఏమైనా అనటానికి!! ముయ్యమని చెప్తూ డ్రైవర్ కేబిన్ వైపు వెళ్ళిపోయాడు. అన్ని కిటికీల తెరలు మూసుకున్నాయి. నాది కూడా... ఈలోపు ’పరదేశి’ [హిందీ] సినిమా మొదలయ్యింది. నేను అంతకు ముందు చూడలేదు. సో లీనమై చూసేస్తున్నా.... సినిమా పూర్తయ్యే వరకూ తెలియలేదు లైట్లన్నీ ఆరిపోయి చాలాసేపయ్యింది అని. ఇప్పుడు టీవీ కూడా కట్టేసేటప్పటికి అంతా చీకటి, నిశ్శబ్దం. అందరూ నిద్రపోతున్నారా ? లేక నాలాగే మౌనంగా మాట్లాడుకుంటున్నారా..? ఏమోలే! నాకెందుకు?! ఇలాంటి అవకాశం కోసమే కదా నేను ఇంతసేపూ వేచి చూసింది..! ఇంక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకూడదు. కిటికీ తెర నెమ్మదిగా తెరిచాను. కిటికీ సందుల్లోంచి, గండిపడ్డ నదిలా ప్రవహిస్తోంది గాలి. ఆ జోరుకు కళ్ళు మూసుకుపోతున్నాయి. ముఖం కోసేంతటి వేగం..! ఆ చిన్ని సందును, కిటికీ అద్దం ముస్తూ పూరించేసాను. సీట్లో వెనక్కి వాలి, తల పైకెత్తి సెకండ్ షోకి రెడీ అయ్యా... రాత్రి పూట ఆకాశాన్ని చూడటం అంటే నాకు చాలా ఇష్టం. ఒంటరిగా చేసే ప్రయాణంలో ఐతే ఇంకా చాలా ఇష్టం. నల్లటి ఆకాశం లో మిళుకూ-మిళుకూ మంటూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. ’వినిపించని రాగాలే... కనిపించని అందాలే...’ అన్నట్టు ఎంత ఖర్చుపెట్టినా పెద్ద పెద్ద నగరాల్లో కూడా దొరకని ఈ అందమైన అనుభవం... చుక్కలతో సావాసం. ఆకాశం నన్ను ఒడిలో చేర్చుకుని జోల పాడుతుంటే, చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా, అమ్మ ఒడిలో హాయిగా నిదురించే పసిపాపలా.. చింతలన్నీ మరచి నా కలల లోకంలో విహరించాను. ఊహలు ఊయలలూగుతూ ఆలపించే రాగాలు వింటూ నిదురపోయాను.
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
:-)
నాకు సెకండ్ షో యే కాదు, అన్ని షోలూ ఇష్టమే ;-) ఆకాశాన్ని ఎప్పూడైనా అలా కళ్ళప్పగించి చూడగలను. ముఖ్యంగా మబ్బులని.
సిటీలో ప్రకృతి ఉండదు అని జనాల గోల, ఆకాశానికి మించిన అందమేమిటో నాకర్ధం కాదు.
అదృష్టవంతులు
ప్రయాణాలు చాలామంది చేస్తూనేవుంటారు.కానీ కిటికీ లోంచి బయటకు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మనసులో కలిగే అనుభూతులను అక్షరాల్లో నిక్షిప్తం చేయడమనేది ఎంతమంది చేయగలం.మీ అనుభూతుల్ని చక్కగా పొందుపరచి మాకందించిన మీకు అభినందనలు.
ఈ చిన్నచిన్న ఆనందాలూ, అనుభూతులూ లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా ఉంటుందోకదా! మంచి టపా.
పూర్ణిమా..
చూడాలే కానీ ప్రతి దానిలోనూ అందం కపిస్తుంది కదా... నిజమే ఆకాశం చాలా అందంగా ఉంటుంది. కానీ మించిన అందం ఉందా లేదా ఎలా చెప్పగలం ?? Can we compare beauty?
Everything is unique and everyone is unique. So, I feel that beauty in different aspects appeals in different ways to different people at different times and its appearence is unique in each case.
"సిటీలో ప్రకృతి ఉండదు అని జనాల గోల, ఆకాశానికి మించిన అందమేమిటో నాకర్ధం కాదు."
సిటీలో ప్రకృతి ఉండదు అని నే అనను. ఎందుకంటే నేను అనుభవిమ్చిన అందాల్లో 60% సిటీల్లోనివే..!! కానీ చుక్కలతో నిండిన ఆకాశం మాత్రం సిటీల్లో చుడలేం కదా..?
@independent.
hmm... Right! I am lucky. so is everyone. అవకాశం అందరికీ ఉంటుంది. అందిపుచ్చుకున్నవాడే అనుభవించగలడు.
@ చిలమకూరు విజయమోహన్
Thank you
@కత్తి మహేష్ కుమార్
నిజమేనండీ... అందమె ఆనందం. ఆనందమె జీవిత మకరందం.
:)
Hmm.. smart catch! So gear up for the answer.
ఇప్పుడు నీ చుట్టూ ఓ నలుగురు పరిచయస్తులు ఉన్నారనుకో. ఆ నలుగురిలో ఒక్కరితో నువ్వు కాస్త ఎక్కువ కంఫర్ట్ గా అనిపించిందనుకో, now r u not choosing one among the others, when everyone is unique and special. ఆకాశాన్ని ఆ ఉద్ధేశ్యంతోనే అన్నాను.
ప్రతీదీ అందమే, కొన్ని మరీ అందంగా అనిపిస్తాయి. తక్కిన వాటిని తక్కువ చేయడం కాదది, మనసు పాపం అక్కడ ఉండి, ఇంకెక్కడికీ రానంటుందంతే! :-)
సిటీ ఆండ్ ఆకాశం, చుక్కలతో సహా.. వీటి పై నేను రాయాల్సిందే, కమ్మెంట్ కాదు, ఓ టపా! ;-)
కదూ మోహన గారు...!
ఆ చల్లగాలి అనుభూతిని ఒక్కసారి గుర్తు తెచ్చి చల్లగా తాకారు. :)
@అత్మకథ గారూ... అలా నవ్వితే ఏమనుకోవాలండీ..?:)
@పూర్ణిమా..
నీ మాటాల్లో చూపెడితే... నా అభిప్రాయం మార్చుకుంటానేమో..! I will be waiting for youir post.
@శ్రీవిద్య గారూ
Thank you.
మోహన గారూ ...ఆ ప్రయాణంలో ఒక్కటి మిస్ అయ్యారేమో అని అనిపించింది నాకు. ఏంటో చెప్పనా...వెన్నెలను..కాదంటారా?? నీలిరంగు ఆకాశంలో మినుకు మినుకుమనే నక్షత్రాలు, వెన్నెల వర్షంలో తడిసి ముద్దౌతున్న పచ్చని చెట్లు అలా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా కదులుతుంటే....వాహ్.. తలుచుకుంటేనే మనసు ఎక్కడికో పోతుంది ఎవ్వరికైనా...
ఆకాశానికి పున్నమి చంద్రుడు తోడైనప్పుడే ప్రకృతి తల్లి గీసిన చిత్రం శోభాయమానంగా వుంటుంది.
కాని ఇలాంటి దృశ్యం ఖచ్చితంగా సిటీలో కనపడదు. పల్లెటూళ్ళకు బండి కట్టాల్సిందే...
శేఖర్ గారు..
ఆ రోజు కృష్ణ పక్షంలోని చివరి రోజుల్లో ఒకటి. వెన్నెల నేను మిస్స్ అవలేదండీ.. సిటీ వెలుగుల్లో... తారల మిళూకులు నేనూ అంతగా అనుభవించలేను. :-( అందుకే నేను ఎక్కువగా మిస్స్ అయ్యేది చుక్కలనే.. అమావాస నాటి నిశిలో మిళుకు మనే తారలు చాలు.. రేయంతా ఊసులు చెప్పుకునేందుకు..
చుక్కలతో ఈ ఏకాంతం వెన్నెల రోజుల్లో కుదరదంటే కుదరదు, అది సిటీ అయినా, పల్లెటూరయినా.. అని నా అభిప్రాయం.
మా సిటీలో వెన్నెల కూడా అద్భుతంగా కనిపిస్తుంది. మా ఇంటిపక్కనున్న పార్కులోనుండి చూస్తే అప్పుడే డ్యూటీ ఎక్కుతున్న పూర్ణ చందర్రావ్ ఎంత పెద్దగా కనిపిస్తాడో ....
ఈ సందర్భంగా ఓ విశేషం చెప్పేదా?
భూమ్యాకాశాలు కలిసేచోట నుండి అప్పుడే ఉదయిస్తున్న(?) చంద్రుడు అర్ధరాత్రి నడినెత్తినున్న చంద్రుడికన్నా పెద్దగా కనిపించటం మనందరికీ అనుభవమే. అయితే అది ఓ కనికట్టు (illusion) మాత్రమే. నిజానికి మన కళ్లకి ఆ రెండుసార్లూ చంద్రుడి పరిమాణం ఒకటిగానే కనిపిస్తుంది కానీ మెదడు ఆ రెండింటినీ రెండు సైజుల్లో 'చూపిస్తుంది'. ఎందుకో ఎవరన్నా చెప్పగలరా?
@అబ్రకదబ్ర
enjoying nature, whereever we are.. is a boon.. I am happy that you could have it..
hmm.. I think that illusion is because, human being always comapres a thing with its surroundings...
ఎలా మిస్ అయ్యానో తెలియదు.మీటపాలు చాలా నానుండి తప్పించేసుకున్నాయి.మీరు చాలా చాలా చాలా బాగా రాస్తున్నారు.
ఇంటర్లో ఆటోగ్రాఫు పుస్తకాల్లో ఇష్టమైనది అంటే అందరూ వాటర్ఫాల్ అని రాస్తే నేను మాత్రం ఆకాశం అనిరాసాను.సైకాలజీ చదివిన మా బోటనీసారు[ప్రిన్సిపాల్ కూడా ఆయనే]నన్ను పిలిచి నువ్వు జీవితంలో అన్నింటికీ సిద్దంగా వుండు అన్నారు.అర్ధంకాలేదు నాకు.నీళ్ళు,భూమి,మొక్కలు ఇలా అందుబాటులో వుండేవాటిని ఆరాధించగలిగేవాళ్ళు జీవితంలో అన్నీ పొందగలుతారు.పొందలేకపోయినా పెద్దగా బాధపడరు.కానీ ఆకాశం లాంటివాటిని ఇష్టాలుగా రాసినవాళ్ళు ఎక్కువ ఊహాలోకంలో బ్రతుకుతారు.వాళ్లకి వర్తమానంలో నెగ్గుకురావడం చాలా కష్టం అలాగే ఏదయినా పొందలేకపోయినా,అనుకున్నది జరగపోయినా చాలా త్వరగా బాధపడిపోతారు అంటూ ఏదో చెప్పారు.ఈ టాపిక్ అంతా చాలా సాధారణంగా జరిగింది.మా బోటనీసార్ కి నేనంటే ప్రత్యేకమైన ఇష్టం.కొద్దిగా స్పెషల్ ఎఫెక్షన్ చూపేవారు.ఇప్పటికీ ఆయనంటే నాకు గౌరవం,అభిమానం.
క్షమించండి....టాపిక్ కి దూరం గా వున్నా ఎందుకో ఇది పంచుకోవాలనిపించి ఇక్కడ ఇలా .....
రాధిక గారూ..
Thank you.
మంచి స్నేహితురాలిలా ఒక మంచి జ్ఞాపకాన్ని ఇక్కడ నెమరువేసుకున్నారు.. ఇక క్షమాపణలు ఎందుకండీ.?? పైగా మీరు చెప్పింది టాపిక్ కి దూరంగా ఉంది అని అనిపించలేదు నాకు..
Post a Comment